కురగల్లులో కొనసాగుతున్న నిరసన
కురగల్లు (తాడేపల్లి రూరల్): మండలం కురగల్లులో స్థానికుల నిరసన గురువారం కూడా కొనసాగింది. కురగల్లును రాజధాని ప్రాంతంగా నిర్ణయించినప్పటి నుంచి దళితవాడలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని మండిపడ్డారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ధర్నా విరమించాలని కోరినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో గంగానమ్మపేట అభివృద్ధి కమిటీ సభ్యులు, రాజధాని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం రవి, యువజన నాయకులు లెనిన్ తదితరులు పాల్గొన్నారు.