Navratri Brahmotsavams
-
తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమల: తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవం మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ నాడు జరుగుతుంది. అధికమాసం కారణంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు కూడా దీన్ని నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ప్రాతఃకాలారాధన పూర్తయిన తరువాత శ్రీమలయప్పస్వామి తిరుచ్చిపై పాపవినాశన మార్గంలో నూతనంగా నిర్మించిన పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం పంచాయుధమూర్తిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి శంఖం, చక్రంతోపాటు ఖడ్గం, గద, ఈటె, విల్లు, బాణం తదితర ఆయుధాలు ధరించి పారువేటకు వెళ్లారు. స్వామి వారి తరఫున టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో పాటు అర్చకులు రామకృష్ణ దీక్షితులు ఈటెను 3 సార్లు విసిరారు. ఆ తరువాత స్వామివారు పార్వేట మండపం నుంచి మహాద్వారానికి వచ్చి హాథీరాంజీవారి బెత్తాన్ని తీసుకొని సన్నిధికి వేంచేయడంతో పారువేట ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవం కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. అన్ని విషయాలను ఆ కోణంలో చూడవద్దు: భూమన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..అత్యంత ప్రాచీనమైన, కూలడానికి సిద్ధంగా ఉన్న పార్వేట మండపాన్ని టీటీడీ అధికారులు అదే రీతిలో పునర్నిర్మించారని చెప్పారు. అయితే, ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూసి విమర్శించడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. పార్వేట మండపం చాలా పాతదని, ఇది కూలిపోయే స్థితిలో ఉండగా టీటీడీ చక్కగాపునర్నిర్మించిందని తెలిపారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పాత మండపంలోని కళాఖండాలను రికార్డు చేసి యథావిధిగా తిరిగి పునర్నిర్మించామని, నూతన మండపం అద్భుతంగా వచ్చిందని చెప్పారు. వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం నాడు స్వామివారికి చక్రస్నానాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించారు. రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీరామ పట్టాభిõÙకం అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. దీంతో 9 రోజుల పాటు జరిగిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. -
స్వర్ణరథంపై శ్రీనివాసుడి వైభవం
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించాడు. మంగళవాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం సాగింది. రాత్రి మలయప్ప స్వామి అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులను పరవశింపజేశారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్న జీయర్‌స్వామి, చైర్మన్ భూమన దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, బోర్డు సభ్యులు, జేఈవో సదా భార్గవి ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు సోమవారం ఉదయం 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం స్నపన తిరుమంజనం వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ముగిశాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి చక్రస్నానం చేపడతారు. రాత్రి ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, టీటీడీ ముద్రించిన 6 పేజీల ప్రత్యేక కేలండర్‌ను చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి అశ్వ వాహనం ఎదుట ఆవిష్కరించారు. రూ.450 విలువైన ఈ కేలండర్‌ను 50 వేల కాపీలను టీటీడీ ముద్రించింది. -
ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు
-
నేడు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల: అక్టోబర్ 15–23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల తొలిరోజు అక్టోబర్ 15న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు. మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. తిరుపతి/తిరుమలలో ఎటు చూసినా నవరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్లను అతికించారు. వైభవం మండపం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పూల మొక్కల నడుమ అనంతపద్మనాభ స్వామి నమూనా ఆలయం ఆకట్టుకుంటున్నాయి. రామాయణం గుర్తు చేసే విధంగా రామ, లక్ష్మణ, భరత, శతృజు్ఞలను దశరధుడు ఉయ్యాలలో ఊపే ఊహా చిత్రాన్ని సుందరంగా చిత్రీకరించారు. విద్యుత్ వెలుగులతో తిరుమలగిరి, ఆలయ మహాగోపురాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి సేవలో ప్రముఖులు శ్రీవారిని శుక్రవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో సత్కరించారు. -
అంగరంగ వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల: అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయన్నారు. అక్టోబరు 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో చెప్పారు. అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరన్నారు. జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవీ ముంబయిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం.. నవీ ముంబయిలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమలలోని సింఘానియా గ్రూప్‌తో టీటీడీ ఎంఓయూ కుదుర్చుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, రేమాండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈవో మాట్లాడుతూ.. ముంబయి ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిరి్మంచేందుకు ఓ దాత ముందుకొచ్చారని తెలిపారు. -
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమల: అక్టోబర్ 15–23 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 14న అంకురార్పణ చేయనున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల తేదీల్లో అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశామన్నారు. తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15వ తేదీల్లో ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబోమని చెప్పారు. 29న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి తిరిగి 29న తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తామని చెప్పారు. గ్రహణం కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి 29న ఉదయం 9 గంటలకు తెరుస్తామన్నారు. తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేస్తున్నట్లు చెప్పారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి ఖాళీ చేసిన గంటలోనే రీఫండ్ ప్రక్రియను మొదలుపెడతామని, అయితే ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరడానికి 3–7 పనిదినాలు పడుతుందన్నారు. సెపె్టంబర్లో శ్రీవారిని 21.01 లక్షలు మంది దర్శించుకున్నారని, హుండీలో రూ.111.65 కోట్లు వేశారని చెప్పారు. -
Tirumala: 15 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ఇలా ఉన్నాయి. ఈ నెల 14న అంకురార్పణం, 15న ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెద్దశేష వాహనం, 16న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 17న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 18న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 19న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం, 20న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పకవిమానం, రాత్రి గజ వాహనం, 21న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 22న ఉదయం స్వర్ణ రథం, రాత్రి అశ్వవాహనం సేవ నిర్వహిస్తారు. 23న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 79,365 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.77 కోట్లుగా తేలింది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,952 మంది. -
నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలో...తెలుసా ?
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు
-
నగరంలో దాండియా సందడి
-
బ్రహ్మోత్సవ నాయకునికి బ్రహ్మాండ నీరాజనం
దసరా నవరాత్రులలో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం శుభముహూర్తాన నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. స్వామికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఉదయం, రాత్రివేళల్లో స్వామి ఒక్కోవాహనంపై ఊరేగుతూ దివ్యదర్శనంతో కటాక్షిస్తాడు. అంకురార్పణతో ఆరంభం బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతిదిశలో ఉన్న వసంత మండపం వద్ద నిర్ణీత ప్రదేశంలో భూదేవి ఆకారంలో చిత్రించిన చోట లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో ఈ పవిత్ర మృత్తికతో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు) నవధాన్యాలను పోసి, ఆ మట్టితో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. నిత్యం నీరుపోసి, శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా చేస్తారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనిని అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరించడాన్నే ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో మీనలగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకలదేవతలు, అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటిదేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉంటూ, ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు. చిన్నశేషవాహనం రెండవరోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేషవాహనంపై దర్శనమిస్తారు. శుద్ధసత్త్వానికి ప్రతీకయైన పరమశివుని గళాభరణంగా విరాజిల్లే వాసుకి శ్రీనివాసుని సేవలో చిన్న శేషవాహనంగా తరిస్తున్నాడు. హంసవాహ నం రెండవరోజు రాత్రి స్వామివారు శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం. తుచ్ఛమెన కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామి చాటుతారు. సింహవాహనం బ్రహ్మోత్సవాలలో మూడవరోజు ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతుస్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహాన్ని వాహనశక్తికి, గమనశక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై వేంచేస్తారని ఆర్యోక్తి. ముత్యపు పందిరివాహనం ముక్తిసాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. మూడవరోజు రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే... తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువైన స్వామివారు నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతారు. సర్వభూపాల వాహనం లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని చాటుతూ నాలుగోరోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది మోహినీ అవతారం. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కారమిస్తారు. పరమ శివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీరసాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచిపనులు చేయడం ద్వారా ఎలా మేలు చేయవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరిస్తారు. గరుడవాహనం స్వామివారు ఐదోరోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుడుని మీద ఊరేగుతారు. మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, ఛత్రాలు గరుడవాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది. హనుమంత వాహ నం ఆరవరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ ఆయనేనని ఈ సేవ ద్వారా తెలుస్తుంది. గజవాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటిచెప్పడానికి శ్రీనివాసుడు ఆరో రోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజవాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభవాహనం ఏడవరోజు ఉదయం ఏడుగుర్రాలపై భానుడు రథసారథిగా ఎర్రటిపూలమాలలు ధరించి స్వామి ఈ వాహనంపై ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. చంద్ర ప్రభవాహనం ఏడోరోజు రాత్రి తెల్లటివస్త్రాలు, పువ్వులమాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదోరోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదోరోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో ప్రధాన మైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహనసేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదోరోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు తేది ఉదయం రాత్రి 05.10.2013 ధ్వజారోహణం పెద్ద శేషవాహనం (సా.6గం.) 06.10.2013 చిన్నశేషవాహనం హంసవాహనం 07.10.2013 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం 08.10.2013 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం 09.10.2013 మోహినీ అవతారం గరుడవాహనం 10.10.2013 హనుమంతవాహనం సాయంత్రం స్వర్ణరథోత్సవం గజవాహనం 11.10.2013 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 12.10.2013 రథోత్సవం అశ్వ వాహనం 13.10.2013 చక్రస్నానం ధ్వజావరోహణం పవిత్ర చక్రస్నానం... ఏడాదిలో నాలుగుసార్లు తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో సంవత్సరంలో నాలుగుసార్లు చక్రస్నానం నిర్వహిస్తారు. భాద్రపద మాస శుక్ల చతుర్థశిలో అనంత పద్మనాభవ్రతం రోజు, బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు, ముక్కోటి మరునాడు, రథసప్తమి రోజు చక్రస్నానం నిర్వహిస్తారు. సుదర్శన చక్రతాళ్వార్ పల్లకిలో అధిరోహించి ఊరేగింపుగా ఆలయ తిరువీధులలో మహాప్రదక్షిణగా వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. వైదిక ఆచారాలతో అభిషేకం నిర్వహించి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేస్తారు. ఆయా పర్వదినాల్లో 3 కోట ్ల 50 లక్షల పుణ్యతీర్థాలు తిరుమల పుష్కరిణిలో ఆవహిస్తాయని, ఆ సమయంలో సర్వదేవతలూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని పురాణ వచనం. ఇదే సమయంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించటం వల్ల దోషాలు, అరిష్టాలు, తెలిసీ తెలియక చేసిన తప్పులు తొలగి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఆదివరాహుని జయంత్యుత్సవం ప్రతిఏటా భాద్రపద శుక్ల తృతీయ దినాన వరాహజయంతిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పుష్కరిణి గట్టుపై వెలసిన భూ వరాహస్వామి ఆలయంలోని గర్భాలయ మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి స్థానం ఇచ్చింది వరాహస్వామియే. అందుకే ఆ స్వామికి అంగరంగ వైభవంగా జయంత్యుత్సవం జరిపిస్తారు.