navyandhra capital
-
మీకు ఎవరు కావాలి ? సినిమా యాక్టరా ? లేక...
ఇతర రాష్ట్రాల నుంచి మోడళ్ల దిగుమతి గంటకు రూ.10 వేలకు పైగా వసూలు మంగళగిరి చుట్టుపక్కల జోరుగా వ్యభిచారం టీడీపీ నేత అండతో ఓ మహిళ నిర్వాకం ‘సాక్షి’ చేతికి చిక్కిన ఫోన్ సంభాషణ ‘మీకు ఎవరు కావాలి? ముంబయి మోడళ్లా..? ఢిల్లీ భామలా..? లేక సినిమా ఆర్టిస్టులా..? లేదా బుల్లితెర అందగత్తెలా..? ఎవరైనా సిద్ధం.. విందు వినోదాలకు కూడా అమ్మాయిలు రెడీ... ఎవరి రేటు వారిదే... కర్ణాటక, తమిళనాడు, పూణే, నాగాలాండ్ ప్రాంతాలకు చెందిన అందమైన అమ్మాయిలూ సిద్ధంగా ఉన్నారు... మీరు సరే అనడమే ఆలస్యం...’ ఇదీ... మంగళగిరి ప్రాంతంలోని పలువురు ధనవంతుల సెల్ఫోన్లకు వస్తున్న మెసేజీల సారాంశం. రాజధాని నేపథ్యంలో ఖరీదైన ప్రాంతంగా మారిన ఇక్కడ అంతే కాస్ట్లీవ్యభిచారం సాగుతోంది. అధికార పార్టీ నేత అండతో ఓ మహిళ ఈ వ్యవహారాన్ని నడిపించడం గమనార్హం. రాజధానిగా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోక మునుపే ఇటువంటి వికృతాలకు కేంద్రం కావడం దురదృష్టకరం. సాక్షి, అమరావతి : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని మంగళగిరి కేంద్రంగా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. ముంబయి మోడళ్లు, తెలుగు సినీ ఆర్టిస్టులు, బుల్లితెర నటులు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తున్న వ్యభిచార కేంద్రాల నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నారు. ధనవంతులను ఎంపిక చేసుకుని వారి ఫోన్లకు వాట్సప్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పంపించి వారిని ముగ్గులోకి దించి నిత్యం లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. టీడీపీ ముఖ్య నేత అండతోనే.. ! ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో హైటెక్ వ్యభిచార గృహాలు నిర్వహించడంలో ఓ మహిళ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె గతంలో బీజేపీలో ఉన్నారు. అప్పట్లో మంగళగిరి ఇందిరానగర్‌లో కొంతకాలం అసాంఘిక కార్యకలాపాలు జరిపిస్తుండగా, పోలీసులుకేసులు కూడా నమోదు చేశారు. అప్పట్లో ఆమె ఓ బీజేపీ నాయకుడి అం డతో వ్యభిచార గృహం నడిపేవారు. అయితే ఆ నాయకుడు పోలీసులను మ్యానేజ్ చేయలేకపోవడంతో ఏకంగా ఆమె బీజేపీని వీడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నియోజకవర్గ నేత పంచన చేరారు. ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో ఆమె హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రతిఫలంగా ఆ నాయకుడికి నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు తెలిసింది. బోనస్‌గా అందమైన అమ్మాయిలను పంపిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ఖరీదైన వ్యక్తులు.. మరోవైపు అధికార పార్టీ నేత అండ ఉండడంతో ఆమెను పోలీ సులు ఏమీ చేయలేక నెలకు రూ.లక్ష వరకు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు సమాచారం. సినీ, టీవీ ఆర్టిస్టుల రాక.. ముంబయి మోడళ్లతోపాటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పూణే, నాగాలాండ్ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ, టీవీ ఆర్టిస్టులను కూడా ఆమె పిలిపించి వ్యాపారం చేయిస్తున్నారు. మోడళ్లను ప్రత్యేకంగా పిలిపించి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల వద్దకు పంపిస్తున్నారు. ఇందుకు సంబంధించి గంటకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఖరీదైన వ్యక్తులకైతే వారి విందు, వినోదాలకు పంపించి లక్షలాది రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. చాలా మంది రాజకీయ నాయకులు తమ విందు, వినోదాలకు మోడళ్లను పంపాలని సదురు మహిళను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. అపార్టుమెంట్లలో యథేచ్ఛగా... విజయవాడ, గుంటూరు నగరాలకు మధ్యలో ఉన్న మంగళగిరి రాజధాని ప్రాంతంలో కీలకమైంది. ఆ ప్రాం తంలో రియల్ భూమ్ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు నివాసాలు ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అసాంఘిక కార్యకలాపాల జోరు కూడా ఈ ప్రాంతాల్లో పెరిగింది. జాతీయ రహదారి సమీపాన మంగళగిరి, సీతానగరం, తాడేపల్లి ప్రాంతాల్లో ఖరీదైన అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని హైటెక్ వ్యభిచారం సాగిస్తున్నారు. టెక్నాలజీతోనే వ్యాపారం.. హైటెక్ వ్యభిచారానికి టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలు రాగానే వారి ఫొటోలను తమ కస్టమర్లకు వాట్సప్ ద్వారా పంపిస్తారు. వారు నచ్చారని తిరిగి మెసేజ్ పంపితే, ఆ తర్వాత రేటు చెబుతారు. యువతి అందచందాలను బట్టి రేటు నిర్ణయిస్తారు. నచ్చితేనే అపార్ట్మెంటు వద్దకు వాలిపోవాలి. అపార్ట్మెంటు వద్దకు వెళ్లి యువతులను చూసి వస్తానంటే అంగీకరించరు. ఆన్ లైన్లోనే వ్యాపారం సాగి స్తారు. ఒకవేళ నచ్చిన అమ్మాయిని బయట ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే ఆ మహిళా నేత భర్తే వాహనం సమకూరుస్తారు. ఆయనే డ్రైవర్ అవతారమెత్తి కస్టమర్ చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్తాడు. వ్యభిచారం నిర్వాహకులు ఓ వ్యక్తితో వ్యాపారంపై జరిపిన ఫోన్ సంభాషణ ‘సాక్షి’ చేతికి చిక్కింది. -
‘చేయెత్తి జైకొట్టి’న తొలితరం ప్రజాగళం!
చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా!... అంటూ తెలుగునాట ఉర్రూతలూగించిన ఈ చైతన్య గీతికను అలనాటి కమ్యూనిస్టు ప్రముఖుడు వేములపల్లి శ్రీకృష్ణ రాయగా.. ఆ గేయం బహుళ ప్రచారం పొందడానికి కారకులు బి. గోపాలం. ఆరు దశాబ్దాల పాటు ప్రజోద్యమాల సైదోడుగా నిలిచిన తొలితరం ప్రజాగాయకుడు గోపాలం 1927లో ఇప్పటి నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరులో బొడ్డు రామదాసు, మంగమ్మ దంపతు లకు జన్మించారు. హరికథలు చెప్పే తండ్రి తాను పాడే పాటలు, పద్యాల పట్ల గోపాలంలోని ఆసక్తిని గమనించి విజయవాడలోని ప్రముఖ వయొలిన్ విద్యాంసులు వారణాసి బ్రహ్మయ్యశాస్త్రి వద్ద సంగీ త శిక్షణకు చేర్పించారు. తర్వాత దుగ్గిరాలకు చెందిన కొండపనేని బలరామయ్య ప్రోత్సాహంతో గుంటూ రు జిల్లా ప్రజానాట్యమండలిలో చేరారు. వేముల పల్లి శ్రీకృష్ణ రచించిన ‘చేయెత్తి జైకొట్టు తెలు గోడా!’, పులుపుల శివయ్య రాసిన ‘పలనాడు వెల లేని మాగాణిరా’ గేయాలను అనేక సభల్లో వయొలి న్‌తో గోపాలం పాడుతుంటే ప్రజలు ఉర్రూతలూగే వారు. నాటి సభల్లో గోపాలం పాట, షేక్ నాజర్ బుర్రకథ తప్పక ఉండేవి. నాజర్ తన తంబుర వాయిద్యం తో బుర్రకథను కొత్తమలుపు తిప్పగా.. గోపాలం సామాజిక చైతన్యం కలిగిన అనేక పాటలకు నవ్యరీతిలో బాణీలు కట్టేవారు. 1943లో విజయవాడలో అఖిల భారత రైతు మహాసభలో ఫిడే లు వాయిస్తూ.. ‘స్టాలినో నీ ఎర్ర సైన్యం’ పాటలో సోవియెట్ యూని యన్ మూకలను ఎలా చెండాడిందో ఉద్రేకంతో పాట పాడి లక్ష మంది ప్రేక్షకుల ప్రశంశ లందుకున్నారు గోపాలం. 1948 నుంచి విజయ వాడ ఆకాశవాణిలో ఎంకి-నాయుడుబావ, భక్త రామదాసు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ధనుర్దాసు, విశ్వ నాథ సత్యనారాయణ సంగీత రూపకాలు.. ఇంకా అనేక గేయాలు పాడారు. ఆ సమయంలో రేణుక అనే గాయనితో ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసింది. వారిది కులాంతర వివాహం. ప్రముఖ సినీదర్శకులు తాతినేని ప్రకాశరావు ఆహ్వానం మేరకు గోపాలం 1951 డిసెంబర్లో ఇప్పటి చెన్నైకు వెళ్లారు. మధురగాయకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు వద్ద సహాయకునిగా చేరి పల్లెటూరు, బతు కుదెరువు, పరోపకారం సినిమాలకు పనిచేశారు. పల్లెటూరు సినిమాలో ఎన్టీ రామారావుపై చిత్రీకరించిన ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ గేయా న్ని ఘంటసాల.. గోపాలం కట్టిన ట్యూన్‌తోనే పాడడం విశేషం! సి.నాగ భూషణం రక్తకన్నీరు, బికారిరాముడు నాటకాలకు సంగీతం సమకూర్చారు. నలదమయం తి, బికారిరాముడు, మునసబుగారి అల్లుడు, రౌడీ రంగడు, పెద్దలు మారాలి, విముక్తి కోసం తదితర 30 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు సంగీత దర్శ కత్వం వహించారు. సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వర రావుతో ‘రంగులరాట్నం, బంగారు పంజరం’, జోస ఫ్తో కలిసి ‘కరుణామయుడు’ సినిమాలకు పనిచే శారు. రంగులరాట్నంలో ‘నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో’, కరుణామయుడు లోని ‘దావీదు తనయా హోసన్నా’ ‘ కదిలింది కరు ణ రథం’, బికారి రాముడులో ‘నిదురమ్మా’ రామాం జనేయ యుద్ధంలో ‘రామనీల మేఘశ్యామ’ తదితర పాటలకు గోపాలం కట్టిన బాణీలు నేటికీ అఖిలాం ధ్ర ప్రేక్షకులను అలరించడం విశేషం. అందాలనటులు శోభన్‌బాబు, హరనాథ్, చలం, కన్నడ రాజ్‌కుమార్ తదితరులకు ప్లేబ్యాక్ పాడారు. కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్ వెం పటి చినసత్యం కలిసి విదేశాల్లోనూ ప్రోగ్రాములు ఇచ్చారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, పి.సుశీల, వాణీజయరాం, బొంబాయి సోదరీమణులు పాడిన అనేక భక్తిగీతాల క్యాసెట్లకు సంగీతం సమకూర్చారు. వం దేమాతరం శ్రీనివాస్ సంగీత మెలకువలు నేర్చుకు న్నది గోపాలం వద్దే. 1995లో చెన్నై నుంచి వచ్చిన తరువాత గోపాలం అనుబంధం మంగళగిరితో పెన వేసుకుంది. చిరునవ్వే ఆభరణంగా చరమాంకాన్ని గడిపిన గోపాలం 2004 సెప్టెంబర్ 22న కాలధర్మం చెందారు. పలు సామాజిక చైతన్య గీతాలతో అశేష జనవాహిని హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదిం చిన తొలి తరం ప్రజాగళం బి.గోపాలం. - (నేడు ప్రజాగాయకుడు, సినీ సంగీత దర్శకుడు బి.గోపాలం 11వ వర్ధంతి ) అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి -
నవ్యాంధ్రలో ఆధునిక భవనాలు
నవ్యాంధ్రకు నూతన హంగులు.. ఆధునిక సాంకేతిక విధానాలు.. ఉరకలేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. మెట్రో సిటీలకు దీటుగా నూతన భవనాలు వంటి ఎన్నెన్నో శుభ పరిణామాలు రాజధాని ప్రాంతం గుంటూరులో చోటు చేసుకుంటున్నాయి.. రాజధాని నేపథ్యంలో నగర ముఖచిత్రం పూర్తిగా మారనుంది.. బహుళ అంతస్తులు శరవేగంతో రూపుదిద్దుకుంటున్నాయి.. ఆధునిక హుందాతో నగరం నలుదిశలు వ్యాపిస్తున్నాయి.. కార్పొరేట్ సంస్థలు తమదైన పంథాలో నగరంలో వివిధ సంస్థలు నెలకొల్పి నగరవాసులను ఆకట్టుకోనున్నాయి.. వీకెండ్ సరదాలకు, నిరంతరం బిజీగా జీవించే వారు ఉత్సాహంగా గడపటానికి ప్రత్యామ్నాయ వనరులు ఏర్పడనున్నాయి. - కార్పొరేట్ సంస్థల ఆసక్తి - చురుగ్గా నిర్మాణ పనులు - నగరవాసులకు వినోద సౌకర్యాలు గుంటూరు కల్చరల్ నవ్యాంధ్ర రాజధాని నూతన సాంకేతిక పరిజ్ఞానం దిశగా అడుగులేస్తోంది. మెట్రోసిటీల వసతులకు తీసిపోని విధంగా రూపొందుతోంది. గుంటూరు నగరంలో బహుళ అంతస్తుల సముదాయాలు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. వినోదాలకు మల్టీఫ్లెక్స్ థియేటర్లు, టైంపాస్‌కు షాపింగ్ కాంప్లెక్స్‌లు, విశ్రాంతికి హోటళ్లు, ఉల్లాసానికి స్విమింగ్ పూల్స్, శరీర వ్యాయామానికి ఇండోర్ జిమ్,ప్లే గ్రౌండ్లు వంటి వి ఒకే భవనంలో నగర వాసులను ఆకట్టుకోనున్నాయి. కార్పొరేట్ దిగ్గజాలు ఒక్కొక్కటిగా నగరంలోకి అడుగిడుతున్నాయి. లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఇప్పటికే నూతన హంగులతో థియేటర్లు, భారీ సముదాయాల్లో వస్త్ర, నగల దుకాణాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు కొలువుదీరాయి. కళానికేతన్ వారి భారీ బహుళ అంతస్తు ఈ రోడ్డులో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. విశాలమైన ఆరు అంతస్తుల్లో వస్త్ర, వజ్రాభరణాలు, కిడ్స్ వినోద శాలలు ఇక్కడ నెలకొల్పనున్నారు. రింగ్‌రోడ్డుల్లో ఓ ప్రైవేట్ యాజమాన్యం వారు చేపట్టినా ఒకే బహుళంతస్తు భవనంలో హైదరాబాద్ మహానగరంలో ఐమాక్స్ థియేటర్లకు దీటుగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, భవనం టాప్‌లో స్విమ్మింగ్ పూల్స్, సాంకేతిక పరిజ్ఞానంతో ఐమాక్స్ థియేటర్లు వంటివి ఈ భవనంలో కొలువు దీరనున్నాయి. విడిది కేంద్రాలు ఇవిగో.. నగరవాసులకు వీకెండ్ విశ్రాంతికి నగరం శివారు ప్రాంతాలు సిద్ధమౌతున్నాయి. అమరావతి రోడ్డు, మంగళగిరి రోడ్డు, గుజ్జనగుండ్ల, చిలకలూరిపేట బైపాస్ వంటి నగర శివారు ప్రాంతాలలో వినోదాలకు, విలాసాలకు కొన్ని ప్రైవేట్ సంస్థలు విడిది కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి రోడ్డులో ఇప్పటికే మెట్రో నగరాలకు దీటుగా ఓ ప్రైవేట్ యాజమాన్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో థియేటర్‌ను పునరుద్ధరించి ఆకట్టుకుంటోంది. సిటీకి ప్రప్రథమంగా డాల్బీ అట్మాస్ సౌండ్ వ్యవస్థను థియేటర్ల్లో ఏర్పాటు చేసి ప్రేక్షకులను అలరిస్తోంది. గుంటూరు 1 టౌన్లో నాలుగు థియేటర్లలో, టూ టౌన్ నాలుగు ధియేటర్లలో 2 కె విజువల్స్‌తో సాంకేతికతో కూడిన డీటీఎస్ సౌండ్‌ను పునరుద్ధరించారు. -
ఉట్టిపడిన తెలుగుదనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నవ్యాంధ్ర రాజధానిలో తెలుగు సంస్కృతి తొణికిసలాడింది. కళారూపాల్లో సంప్రదాయం ఉట్టిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం తుళ్లూరు మండలం అనంతవరంలో నిర్వహించిన ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు తంగిరాల వెంకట పూర్ణప్రసాద్ పంచాంగ శ్రవణం చేయగా, వ్యవసాయ, ఉద్వానవన పంచాంగాల ఆవిష్కరణ జరిగింది. కూచిపూడి విశిష్టతను తెలియపరిచే కూడిపూడి నాట్యారామం వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. తొలుత ముఖ్యమంత్రి అనంతవరం కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ముగించి వేదిక వద్దకు 10.35 గంటలకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఐవైఆర్ కృష్ణారావు అనంతరంలో ఉగాది వేడుకలు నిర్వహణలోని ఆవశ్యకతను వివరించారు. కృష్ణానదికి సమీపంలో ఏర్పాటు కానున్న నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు వలన నదికి ఇరువైపులా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని టీటీడీ పండితులు తంగిరాల పేర్కొన్నారు. వర్షపాతం తక్కువుగా ఉన్నప్పటికీ పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం లభిస్తుందని పేర్కొన్నారు. వృవసాయం, క్షీర సంపద వృద్ధి.. అనంతరం వ్యవసాయ పంచాంగాన్ని గుంటూరు హిందూ కళాశాల అధ్యాపకులు డీఎన్ దీక్షితులు చదవి వినిపించారు. రానున్న సంవత్సరంలో వ్యవసాయ అభివృద్ధి, క్షీరసంపద అధికంగా జరుగుతుందని తెలిపారు. ఆ తరువాత ఉద్యానవన పంచాంగం, కూచిపూడి విశిష్టతను తెలియపరిచే వెబ్సైట్, జర్నలిస్టుల డైరీల ఆవిష్కరణలు జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, సిద్దా రాఘవరావు, మాణిక్యాలరావు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు ప్రసంగించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా మంత్రులంతా కృతజ్ఞతులు తెలిపారు. ముఖ్యమంత్రిపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు అన్ని వేళలా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణం, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు, రైతులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను వివరించారు. రాజధాని శంకుస్థాపన, నిర్మాణ పనుల ప్రారంభం తదితర వివరాలను వెల్లడించారు. పురస్కారాల ప్రదానం ఈ సందర్భంగానే 32 మందికి కళారత్న(హంస), 67 మందికి ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రదానం చేసింది. ప్రముఖ వాగ్గేయకారులు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు వెలుగు విశిష్ట పురస్కారాన్ని అందించి సత్కరించారు. పురస్కారంలో భాగంగా రూ. లక్ష నగదు, జ్ఞాపికను ప్రదానం చేశారు. హంస పురస్కార గ్రహీతలకు రూ. 50, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. విచ్చేసిన ఆహూతులకు ఉగాది పచ్చడి, ఆల్పాహారం, లస్పీ, మంచినీటి సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఉగాది వేడుకల ఆవరణ ప్రారంభంలో వెలవెల బోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించే ఆనవాయితీ ఉండటంతో పూజలు పూర్తయిన తరువాతగాని వేడుక వద్దకు ప్రజలు రాలేదు. సుమారు 50 వేల మందికి ఈ ఆవరణలో సౌకర్యాలు కల్పించినా, కార్యక్రమం ప్రారంభంలో ఐదారువేలకు మించి ప్రజలు లేరు. దీనితో అధికారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటిన ఆర్టీసీ బస్‌లను గ్రామాల్లోకి పంపి డ్వాక్రా గ్రూపు సభ్యులను కార్యక్రమానికి వచ్చే ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఉగాది వేడుకల కార్యక్రమం వైభవంగానే పూర్తికావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, శాసన సభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌లు వేడుకల ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
‘స్టార్' తిరుగుతోంది
ఆతిథ్య రంగం ‘స్టార్'తిరుగుతోంది. గుంటూరు జిల్లాలో నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు కానుండటంతో ఈ ప్రాంతంపై ఆతిథ్య రంగ దిగ్గజాలు దృష్టి సారించారు. గుంటూరు, విజయవాడల్లో అధునాతన వసతులతో ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకు కసరత్తును ముమ్మరం చేశారు. కొన్ని సంస్థలు ఇప్పటికే స్థలాలు కొనగోలు చేశాయి. మరికొన్ని రామవరప్పాడు నుంచి మంగళగిరి మధ్య తమ బ్రాంచ్‌ల ఏర్పాటుకు స్థలాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో ఆతిథ్య రంగంలో ఆదాయం పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లబ్బీపేట: ఆతిథ్య రంగ దిగ్గజాలు ఐటీసీ.. మారియేట్.. నోవాటెల్.. గ్రీన్‌పార్క్.. కీస్(కేఈవైఎస్) వంటి అనేక స్టార్ హోటళ్లు నగర పరిసర ప్రాంతాలకు రానున్నాయి. ఇప్పటికే రామవరప్పాడు వద్ద మారియేట్ హోటల్ ఏర్పాటు ఖరారైంది. బెంజిసర్కిల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన నోవాటెల్ హోటల్ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. గుంటూరులో ఐటీసీ హోటల్ ఏర్పాటు కానుంది. కీస్ హోటల్‌ను నగరంలోని బందరురోడ్డులో ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నారు. గ్రీన్పార్క్తోపాటు మరికొన్ని అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా స్థలాల అన్వేషణలో ఉన్నాయి. విజయవాడ-మంగళగిరి మధ్యే... నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆతిథ్య రంగానికి చెందిన సంస్థలు మాత్రం తొలుత విజయవాడకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆ తర్వాత విజయవాడ-మంగళగిరి మధ్య ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలు భాగా అభివృద్ధి చెందడంతోపాటు జాతీయ రహదారి పక్కన ఉండటం, ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలకు అనువుగా ఉండటంతో ఈ ప్రాంతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో ఐదారేళ్లలో తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు నగరంలో కలిసిపోయే అవకాశం ఉండటం కూడా మరో కారణమని ఆతిథ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరగనున్న ఆదాయం, ఉపాధి అవకాశాలు... ప్రస్తుతం నగరం గ్రేడ్-3 సిటీగా ఉంది. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుతో పరిధి పెరిగి గ్రేడ్-1కు అప్‌గ్రేడ్ అవుతుంది. దీంతో ఆతిథ్య రంగంలో చార్జీలు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో నాలుగు నక్షత్రాల హోటళ్లు ఫార్చ్యూన్ మురళీపార్క్, తాజ్ గేట్‌వే, డీవీ మనార్ ఉన్నాయి. వీటితోపాటు త్వరలోనే ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో ఆతిథ్యరంగంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే నగరానికి కార్పొరేట్ సంస్థల నిర్వాహకులు, ఉద్యోగుల రాక పెరిగింది. దీంతో హోటల్స్‌కు ఆదాయం కూడా పెరిగింది. ముంబయికి చెందిన ఓ ఫార్మసీ కంపెనీ గతంలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేది. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఆంధ్రలో వ్యాపారం చేస్తోంది. ఇలా పలు ఫార్మసీ కంపెనీలు, ఇతర సంస్థలు వ్యాపార విస్తరణ కోసం నగరంలో కాన్ఫరెన్స్‌లు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో గత ఆరు నెలలుగా హోటల్స్ ఆదాయం 30 నుంచి 40 శాతం పెరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వ సమావేశాలూ హోటళ్లలోనే.. రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశాల నిర్వహణకు అనువైన కార్యాలయాలు, వసతులు నగరంలో లేనందున ప్రభుత్వం కూడా హోటళ్లనే వేదికగా ఎంపిక చేస్తోంది. రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాలను హోటల్స్‌లోనే నిర్వహిస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంది నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడ పరిసరాల ప్రాంతాలను ఎంపిక చేయడంతో నగర పరిధి పెరగుతుంది. ఇప్పటికే ఆతిథ్య రంగానికి చెందిన అనేక సంస్థలు నగరంలో హోటల్స్ ఏర్పాటుకు స్థల సేకరణలో ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు నక్షత్రాల హోటల్స్‌కే పరిమితం కాగా, ఐదు, ఏడు నక్షత్రాల హోటల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఉన్న హోటల్స్ కూడా అప్ గ్రేడ్ అవుతాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆతిథ్య రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. - ముత్తవరపు మురళీకృష్ణ, ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్, ఎండీ -
రింగ్.. రింగా
- బెజవాడ చుట్టూ రియల్ సిండికేట్ల భూ దందా - తనఖా భూములపై కన్ను - వేలం ప్రక్రియ ద్వారా కారుచౌకగా సొంతం - రింగ్ అయిన వ్యాపారులు - సిండికేట్ల ఉచ్చులో ప్రభుత్వ అధికారులు రూ. 32 కోట్ల విలువైన భూమి వేలంలో రూ. 7.25 కోట్లకే.. సాక్షి, విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని విజయవాడ చుట్టుపక్కల సరికొత్త భూదందా మొదలైంది. నగరం చుట్టూ భూముల ధరలు చుక్కలనంటుతుండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం తనఖా ఉన్న ఆస్తులను వేలం పేరుతో కారుచౌకగా కాజేస్తున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని భీమవరంలో ఇటీవల జరిగిన వేలం ఉదంతమే ఇందుకు నిదర్శనం. భీమవరం గ్రామంలో 65వ నంబరు జాతీయ రహదారి సమీపాన సర్వే నంబర్లు 307/2, 307/3లలో 13.19 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 20 ఏళ్ల క్రితం కొందరు ఈస్ట్ ఇండియా గ్రానైట్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ నిర్వాహకులు 15 ఏళ్ల క్రితం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నుంచి రూ.4 కోట్లు రుణం పొందారు. ఇందుకోసం కంపెనీని మార్ట్గేజ్(తాకట్టు) చేశారు. దీని ప్రకారం రుణం చెల్లించకపోతే సదరు కంపెనీ ఆస్తిపై సర్వ హక్కులూ ఎస్ఎఫ్సీకి ఉంటాయి. ఈస్ట్ ఇండియా గ్రానైట్ కంపెనీ నిర్వాహకులు వ్యాపారం సాగించి ఎస్ఎఫ్సీకి రుణం తిరిగి చెల్లించలేదు. ఏడేళ్ల క్రితం కంపెనీని కూడా మూసివేశారు. రుణం చెల్లించాలని ఎస్ఎఫ్సీ అధికారులు ఆ కంపెనీ నిర్వాహకులకు మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. చివరి ప్రయత్నంగా రుణం కోసం ష్యూరిటీగా చూపిన కంపెనీ, 13.19 ఎకరాల భూమిని వేలం వేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ కంపెనీ నిర్వాహకుల నుంచి స్పందన లేదు. దీంతో సదరు ఆస్తిని వేలం వేసే బాధ్యతను హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన పృథ్వీ ఎస్టేట్స్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ కంపెనీ లిమిటెడ్‌కు అప్పగించారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలు.. ఈస్ట్ ఇండియా గ్రానైట్ కంపెనీ ఆస్తులను వేలం వేసేందుకు పృథ్వీ ఎస్టేట్స్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ కంపెనీ లిమిటెడ్ సంస్థ పత్రికల్లో ప్రకటన విడుదల చేసింది. వేలంపాటలో పాల్గొనే వారు గత నెల 23న సదరు కంపెనీ తనఖా పెట్టిన ఆస్తిని పరిశీలించే వెసులుబాటు కల్పించారు. ఆ మరుసటి రోజు(24) నుంచి 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సీల్డ్ టెండర్లు స్వీకరించారు. ఈ క్రమంలో ఆస్తిని సులభంగా వేలం వేసేందుకు రెండుగా విభజించారు. మొదటి లాట్లో కంపెనీ మిషనరీ, షెడ్లు పేర్కొన్నారు. రెండో దానిలో కంపెనీ ఉన్న స్థలాన్ని కేటాయించారు. లాట్-1కు రూ.30 లక్షలు రిజ్వర్ ధర నిర్ణయించారు. టెండరుతోపాటు పది శాతం మొత్తం రూ. 3లక్షలు చెల్లించేలా నిబంధన విధించారు. లాట్-2లోని ఆస్తి రిజర్వు ధరను రూ.5.5కోట్లుగా నిర్ణయించారు. దీనికి రూ.55 లక్షలను టెండరుతోపాటే సమర్పించేలా షెడ్యూల్ ప్రకటించారు. లాట్-2లో పేర్కొన్న భూమిని పొందేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పక్కాగా పథకం రచించారు. ముందుగానే అందరూ రింగ్ అయ్యారు. పథకం ప్రకారం జిల్లాకు చెందిన ఏడుగురు రియల్టర్లు ముందుగానే మాట్లాడుకుని దానికి అనుగుణంగా టెండర్లు దాఖలు చేశారు. దీంతో బహిరంగ మార్కెట్లో రూ.32 కోట్లకు పైగా ధర పలికే 13.19 ఎకరాల స్థలాన్ని కేవలం రూ.7.25 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎస్ఎఫ్సీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎకరా విలువ రూ.2.5 కోట్లుపైగానే... ప్రస్తుతం భీమవరం వద్ద జాతీయ రహదారి సమీపంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్ర విభజనకు ముందు ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ లక్షల రూపాయల్లోనే పలికేది. విజయవాడను రాజధానిగా ప్రకటించిన తర్వాత కోట్ల రూపాయలకు చేరింది. ఒక దశలో ఎకరం రూ. 5కోట్లకు పైగా పలికింది. ప్రస్తుతం రూ.2.5 కోట్లు చెబుతున్నారు. ఈ లెక్కన 13.19 ఎకరాలు రూ. 32.5 కోట్లు ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ.7.25 కోట్లకే పొందడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ ఎక్కడ! ప్రస్తుతం రాజధానికి భూసేకరణకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో వీజీటీఎం ఉడా పరిధిలో లేఅవుట్లకు అనుమతులు నిలిపివేశారు. క్రయవిక్రయాలపై కొన్నిచోట్ల నిషేధం విధించారు. ఇలా అనేక మార్గాల్లో ధరలను నియంత్రించటంతోపాటు భూముల క్రయవిక్రయాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. కానీ, భీమవరంలో 13.19 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు వేలంలో సొంతం చేసుకుని ప్రత్యక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినా అధికారులెవరూ పట్టించుకోకపోవటం గమనార్హం. -
రెడ్ మార్క్ !
సాక్షి ప్రతినిధి,గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న సర్వేలో ప్రభుత్వ భూముల వివరాలతోపాటు కొందరు రియల్టర్ల అక్రమాలూ వెలుగులోకి వస్తున్నాయి. చెరువులు, అసైన్డ్భూములను కొందరు ఆక్రమిస్తే, సామాజిక స్థలాలను మరి కొందరు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న భూముల సర్వేలో ఇవన్నీ వెలుగులోకి వస్తుండటంతో అక్రమార్కుల వెన్నులో చలిపుడుతోంది. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే’ రీతిలో ఇరవై ఏళ్ల నాటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్థలాల జాబితాను రూపొందించిన రెవెన్యూ శాఖ వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించడంతో అప్పటి కొనుగోలుదారులు పూర్తిగా నష్టపోతున్నారు. వీరంతా అప్పట్లో 200 చదరపు గజాల స్థలాన్ని రూ. ఆరు వేల నుంచి 60 వేలకు కొనుగోలు చేసినా, ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని రియల్టర్లపై ఒత్తిడి చేస్తున్నారు. అప్పట్లోనే రియల్ భూమ్.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల కంటే గుంటూరు జిల్లాలో ఇరవై సంవత్సరాల కిందట రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికంగా జరిగింది. వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేసిన కొన్ని ప్రముఖ కంపెనీలు స్థలాలు విక్రయించాయి. ఆ సమయంలో తమ వ్యవసాయ భూములకు సరిహద్దునే ఉన్న చెరువులు, అసైన్డ్ల్యాండ్స్ను కలుపుకుని వెంచర్లు వేశాయి. ఈ లేఅవుట్లకు వీజీటీఎం ఉడా అనుమతి ఇవ్వడంతో స్థలాలు వేగంగానే అమ్ముడు పోయాయి. ఇలా అనుమతి ఇచ్చిన లే అవుట్‌లోని సామాజిక స్థలాలనూ కొందరు రియల్టర్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. గుంటూరుకు సమీపంలోని పెదకాకాని, కాజ, మంగళగిరి, తెనాలిలో ఈ తరహా స్థలాల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. రాజధానికి నిర్మాణం కోసం జరుగుతున్న సర్వేలో ఆక్రమణకు గురైన చెరువులు, అసైన్డ్ భూముల వివరాలను రెవెన్యూశాఖ సేకరించింది. వీటిల్లో వేసిన వెంచర్లకు సంబంధించిన స్థలాలపై రెడ్ మార్కు పెట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ చేయకూడదని నిషేధం విధించింది. మరో వైపు అక్రమ లేఅవుట్లపై వీజీటీఎం ఉడా దృష్టి సారించింది. ఒక్క తెనాలి, గుంటూరు డివిజన్లలో సుమారు 12 వేల అనధికార లే ుట్లను గుర్తించి వాటి వివరాలను రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అందజేసింది. దీంతో ఈ స్థలాలను కొత్తగా ఎవరైనా కొనుగోలు చేసినా, వాటి రిజిస్ట్రేషన్లు మాత్రం జరగడం లేదు. వీటిని అమ్మిన ప్రముఖ కంపెనీలు, రియల్టర్లపై కొనుగోలుదారుల ఒత్తిడి పెరిగింది. కొందరిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిరా్యాదు చేస్తున్నారు.