మీకు ఎవరు కావాలి ? సినిమా యాక్టరా ? లేక... | hitech prostitution in navyandhra capital | Sakshi
Sakshi News home page

మీకు ఎవరు కావాలి ? సినిమా యాక్టరా ? లేక...

Published Sun, Sep 18 2016 8:58 AM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

మీకు ఎవరు కావాలి ? సినిమా యాక్టరా ? లేక... - Sakshi

మీకు ఎవరు కావాలి ? సినిమా యాక్టరా ? లేక...

  • ఇతర రాష్ట్రాల నుంచి మోడళ్ల దిగుమతి
  • గంటకు రూ.10 వేలకు పైగా వసూలు
  • మంగళగిరి చుట్టుపక్కల జోరుగా వ్యభిచారం
  • టీడీపీ నేత అండతో ఓ మహిళ నిర్వాకం
  • ‘సాక్షి’ చేతికి చిక్కిన ఫోన్ సంభాషణ
  •  
    ‘మీకు ఎవరు కావాలి? ముంబయి మోడళ్లా..? ఢిల్లీ భామలా..? లేక సినిమా ఆర్టిస్టులా..? లేదా బుల్లితెర అందగత్తెలా..? ఎవరైనా సిద్ధం.. విందు వినోదాలకు కూడా అమ్మాయిలు రెడీ... ఎవరి రేటు వారిదే... కర్ణాటక, తమిళనాడు, పూణే, నాగాలాండ్ ప్రాంతాలకు చెందిన అందమైన అమ్మాయిలూ సిద్ధంగా ఉన్నారు... మీరు సరే అనడమే ఆలస్యం...’ ఇదీ... మంగళగిరి ప్రాంతంలోని పలువురు ధనవంతుల సెల్‌ఫోన్లకు వస్తున్న మెసేజీల సారాంశం.

    రాజధాని నేపథ్యంలో ఖరీదైన ప్రాంతంగా మారిన ఇక్కడ అంతే కాస్ట్లీవ్యభిచారం సాగుతోంది. అధికార పార్టీ నేత అండతో ఓ మహిళ ఈ వ్యవహారాన్ని నడిపించడం గమనార్హం. రాజధానిగా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోక మునుపే ఇటువంటి వికృతాలకు కేంద్రం కావడం దురదృష్టకరం.
     
    సాక్షి, అమరావతి  : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని మంగళగిరి కేంద్రంగా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. ముంబయి మోడళ్లు, తెలుగు సినీ ఆర్టిస్టులు, బుల్లితెర నటులు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తున్న వ్యభిచార కేంద్రాల నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నారు. ధనవంతులను ఎంపిక చేసుకుని వారి ఫోన్లకు వాట్సప్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పంపించి వారిని ముగ్గులోకి దించి నిత్యం లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
     
    టీడీపీ ముఖ్య నేత అండతోనే.. !
    ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో హైటెక్ వ్యభిచార గృహాలు నిర్వహించడంలో ఓ మహిళ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె గతంలో బీజేపీలో ఉన్నారు. అప్పట్లో మంగళగిరి ఇందిరానగర్‌లో కొంతకాలం అసాంఘిక కార్యకలాపాలు జరిపిస్తుండగా, పోలీసులుకేసులు కూడా నమోదు చేశారు.
     
     అప్పట్లో ఆమె ఓ బీజేపీ నాయకుడి అం డతో వ్యభిచార గృహం నడిపేవారు. అయితే ఆ నాయకుడు పోలీసులను మ్యానేజ్ చేయలేకపోవడంతో ఏకంగా ఆమె బీజేపీని వీడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నియోజకవర్గ నేత పంచన చేరారు. ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో ఆమె హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రతిఫలంగా ఆ నాయకుడికి నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు తెలిసింది. బోనస్‌గా అందమైన అమ్మాయిలను పంపిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ఖరీదైన వ్యక్తులు.. మరోవైపు అధికార పార్టీ నేత అండ ఉండడంతో ఆమెను పోలీ సులు ఏమీ చేయలేక నెలకు రూ.లక్ష వరకు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు సమాచారం.
     
    సినీ, టీవీ ఆర్టిస్టుల రాక..
    ముంబయి మోడళ్లతోపాటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పూణే, నాగాలాండ్ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ, టీవీ ఆర్టిస్టులను కూడా ఆమె పిలిపించి వ్యాపారం చేయిస్తున్నారు. మోడళ్లను ప్రత్యేకంగా పిలిపించి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల వద్దకు పంపిస్తున్నారు. ఇందుకు సంబంధించి గంటకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఖరీదైన వ్యక్తులకైతే వారి విందు, వినోదాలకు పంపించి లక్షలాది రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. చాలా మంది రాజకీయ నాయకులు తమ విందు, వినోదాలకు మోడళ్లను పంపాలని సదురు మహిళను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది.
     
    అపార్టుమెంట్లలో యథేచ్ఛగా...
    విజయవాడ, గుంటూరు నగరాలకు మధ్యలో ఉన్న మంగళగిరి రాజధాని ప్రాంతంలో కీలకమైంది. ఆ ప్రాం తంలో రియల్ భూమ్ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు నివాసాలు ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అసాంఘిక కార్యకలాపాల జోరు కూడా ఈ ప్రాంతాల్లో పెరిగింది. జాతీయ రహదారి సమీపాన మంగళగిరి, సీతానగరం, తాడేపల్లి ప్రాంతాల్లో ఖరీదైన అపార్ట్‌మెంట్లు అద్దెకు తీసుకుని హైటెక్ వ్యభిచారం సాగిస్తున్నారు.
     
    టెక్నాలజీతోనే వ్యాపారం..
    హైటెక్ వ్యభిచారానికి టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలు రాగానే వారి ఫొటోలను తమ కస్టమర్లకు వాట్సప్ ద్వారా పంపిస్తారు. వారు నచ్చారని తిరిగి మెసేజ్ పంపితే, ఆ తర్వాత రేటు చెబుతారు. యువతి అందచందాలను బట్టి రేటు నిర్ణయిస్తారు.
     
    నచ్చితేనే అపార్ట్‌మెంటు వద్దకు వాలిపోవాలి. అపార్ట్‌మెంటు వద్దకు వెళ్లి యువతులను చూసి వస్తానంటే అంగీకరించరు. ఆన్ లైన్‌లోనే వ్యాపారం సాగి స్తారు. ఒకవేళ నచ్చిన అమ్మాయిని బయట ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే ఆ మహిళా నేత భర్తే వాహనం సమకూరుస్తారు. ఆయనే డ్రైవర్ అవతారమెత్తి కస్టమర్ చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్తాడు. వ్యభిచారం నిర్వాహకులు ఓ వ్యక్తితో  వ్యాపారంపై జరిపిన ఫోన్ సంభాషణ ‘సాక్షి’ చేతికి చిక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement