Nazir
-
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
కొలీజియంలో విభేదాలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జడ్జీల నియామకప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య సర్వామోదం సన్నగిల్లింది. నూతన జడ్జీల ఎంపికకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చేపట్టిన ‘సర్కులేషన్’ పద్ధతిపై కొలీజియంలోని ఇద్దరు జడ్జీలు భిన్న స్వరం వినిపించడం తెలిసిందే. ఆ ఇద్దరి పేర్లను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. 11 మంది నూతన జడ్జీల నియామకం కోసం సెప్టెంబర్ 26న సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల కొలీజియం భేటీ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ హాజరుకాలేదు. 10 మంది జడ్జీల నియామక ప్రక్రియ కోసం నలుగురు జడ్జీలకు సీజేఐ లేఖలు రాశారు. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ జస్టిస్ కిషన్ అక్టోబర్ ఒకటిన, జస్టిస్ జోసెఫ్ అక్టోబర్ ఏడున సీజేఐకు ప్రతిలేఖలు రాశారు. లేఖలు రాసే పద్ధతిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం తెలపాలని అక్టోబర్ రెండున మరోసారి కోరినా స్పందించలేదు. సాధారణంగా కొలీజియంలో వ్యక్తమయ్యే బేధాభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపిన జడ్జీల పేర్లను వెల్లడించరు. కానీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ పేర్లను బయటపెడుతూ కొలీజియం ప్రకటన విడుదలచేసింది. ఇక నవంబరు 9న కొత్త సీజేఐ వచ్చాకే కొలీజియం సమావేశం కానుంది. జస్టిస్ దీపాంకర్ గుప్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం విదితమే. -
పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి.. యువకుడు దుర్మరణం
⇒చిలంకూరులో విషాధం ⇒ఈ నెల 16న పెళ్లి ఎర్రగుంట్ల : తన వివాహానికి సంబంధించిన పెళ్లి పత్రికలను బంధువులు, స్నేహితులకు పంచేందుకు వెళుతూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరో నాలుగు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమా దం సంభవించి మృత్యువాతపడడంతో చిలంకూరులో విషాధం అలుముకుంది. మండలంలోని చిలంకూరుకు చెందిన వీరనారాయణకు ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరు ప్రేమ్ నజీర్. ఇతను డిప్లమో వరకు చదువుకున్నారు. ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నజీర్‌కు పులివెందులకు చెందిన అమ్మాయితో వివాహ సంబంధం కుదిరింది. ఈనెల 16,17తేదీలలో వివాహం చేయాలని ఇరుకుటుంబాల వారు నిశ్చయించారు. అందరూ బంధువులు, స్నేహితులు, కావాల్సిన వారిని పిలిచే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. నజీర్ కూడా సోమవారం అనంతపురం జిల్లా కదిరికి వెళ్లి అక్కడ స్నేహితులకు పెళ్లి పత్రికలు ఇచ్చారు. తర్వాత బెంగళూరుకు పోవడానికి కదిరిలో బస్సు ఎక్కి వెనుక సీటులో కూర్చున్నారు. ముత్యాల చెరువు వద్దకు వెళ్లే సరికి లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో నజీర్ దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలియగానే చిలంకూరులో విషాధం చోటు చేసుకుంది. కుటుంబీకులు బోరును విలపించారు. నాలుగు రోజుల్లో వివాహం జరగాల్సిన ఉండగా మృత్యువాత పడడంతో బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాధంలో మునిగిపోయారు. సోమవారం సాయంత్రం కదిరి నుంచి మృతదేహం రాగానే అంత్యక్రియలు నిర్వహించారు.