ఆర్మూర్‌లో దర్జాగా అసైన్డ్ భూమి కబ్జా
ఆర్మూర్, న్యూస్‌లైన్: ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంఏ కరీం అలియాస్ రూపాల కరీం అనే వ్యాపారి సుమారు 40 సంవత్సరాల క్రితం ఎన్డీసీసీ బ్యాంకులో ఉద్యోగిగా ఉంటూ కుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో నిజామాబాద్‌కు చెందిన ఎన్డీసీసీ బ్యాం కు అతని ఆస్తులన్నింటిని స్వాధీనం చేసుకుంది. అలా స్వాధీనం చేసుకున్న ఆస్తులలో ఆర్మూర్ ప ట్టణంలోని జర్నలిస్టు కాలనీలో 401/66 సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమి కూడా ఉంది. తర్వాతి కాలంలో బ్యాంకు వారు ఆ స్థలాన్ని బహిరంగ వేలం నిర్వహించారు. కొనుగోలు చేసి న పెర్కిట్ గంగారెడ్డి, రాజ్‌కుమార్ అగర్వాల్ ఆ రెండెకరాల స్థలంలో ప్లాట్లు చేశారు.
ఎల్పీ నెంబ ర్ 39/95తో టౌన్ ప్లానింగ్ అనుమతిని సైతం తీసుకున్నారు. ఈ లేఅవుట్ ప్లాట్లలో తమ వద్ద తనఖాళీగా ఉన్న స్థలానికి సంబంధించి 4వ నం బర్ నుంచి 18వ నంబర్ ప్లాట్‌లో సగం వరకు, 22వ నంబర్ ప్లాట్ ను ంచి 34వ నంబర్ ప్లాట్ల వరకు ఎన్డీసీసీ బ్యాంకువారు ఎన్ఓసీ ఇచ్చారు. రెవె న్యూ అధికారుల ప్రత్యేక ఉత్తర్వుల మేరకు ఆస్తిని కొనుగోలుదారుల పేరిట బదలాయిం చా రు. ఇదే స్థలానికి ఆనుకొని 401/66 సర్వే నంబర్‌లోనే అ దనంగా ఒక ఎకరం అసైన్డ్ భూమి ఉం ది. దీనిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించడానికి రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు.
ఈ స్థలాన్ని ఎంఏ కరీం తన పేరున కా కుండా తన బినామీ అయిన బాలయ్య పేరిట చే యించినట్లు సమాచారం. తర్వాతి కాలంలో ఎంఏ కరీం, బాలయ్య మరణించడంతో వారి కుటుంబాల మధ్య ఈ స్థలం కోసం కోర్టులో వివా దం సాగింది. ప్రభుత్వం బాలయ్య పేరిట ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేసినట్లు రికార్డులు ఉం డటంతో, అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి బాలయ్య కుటుంబ సభ్యులకు మాత్రమే అధికారం ఉంటుందని కోర్టు తీర్పు ఇచ్చింది.
అసైన్డ్ భూమిలో ప్లాట్లు
బాలయ్య కుటుంబ సభ్యులకు వ్యవసాయం చేసుకోవడానికి కేటాయించిన అసైన్డ్ భూమి ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో ఉంది. చుట్టూ ఇళ్ల నిర్మాణం జరగడంతో బహిరంగ మార్కెట్లో రూ. కోట్ల విలువ పలుకుతోంది. రెవె న్యూ చట్టం ప్రకారం అసైన్డ్ భూమిలో వరసగా మూడేళ్ల పాటు వ్యవసాయం చేయకపోతే ప్రభు త్వం ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థలంలో సుమారుగా 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేసిన దాఖలా లు లేవు.
అదే విధంగా అసైన్డ్ స్థలాన్ని కమర్షియ ల్ అవసరాలకు ఉపయోగించడానికి వీలు లేదు. అయితే, ఈ ఎకరం అసైన్డ్ భూమి గురించి తెలిసి న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పథకం రూపొందించారు. బాలయ్య కుటుంబ సభ్యుల తో కలిసి ఆ భూమిలో ప్లాట్లు చేయాలని నిర్ణయిం చారు. గతంలో ఎన్డీసీసీ బ్యాంకు వారు క్లియరెన్స్ ఇచ్చిన స్థలంలో చేసిన ఎల్పీ నెంబర్ 39/95లోనే ఈ స్థలం కూడా ఉందంటూ రికార్డు లు సృష్టించారు. లేఅవుట్‌ను సిద్ధం చేసి, స్థలాన్ని చదును చేసి హద్దు రాళ్లను పాతారు.