ndia
-
భారత్ చరిత్రను రిపీట్ చేసేనా?
లక్నో:జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో మరోసారి చరిత్ర సృష్టించేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. 15 ఏళ్ల క్రితం చివరిసారి జూనియర్ వరల్డ్ కప్ హాకీ టైటిల్‌ను సాధించిన భారత్.. ఆ తరువాత ఇంతవరకూ ఆ ట్రోఫీని గెలవలేదు. తాజాగా సొంతగడ్డపై జరుగుతున్న జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత జట్టు గత చరిత్రను పునరావృతం చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం గం.6.00లకు నగరంలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆరంభమయ్యే మ్యాచ్‌లో బెల్జియంతో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సన్నద్ధమైంది. జూనియర్ వరల్డ్ కప్ టోర్నీలో స్పెయిన్ ను క్వార్టర్ ఫైనల్ ఓడించిన భారత్.. సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దాంతో హర్జిత్ సింగ్ అండ్ గ్యాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టైటిల్ వేటలో భారత్ విజయం సాధిస్తుందనే ధీమాతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మన్దీప్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, ఆర్మాన్ ఖురేషీ, సంతా సింగ్‌లతో కూడిన జట్టు భారత యువ జట్టు బలంగా కనిపిస్తోంది. దాంతో 2001 నుంచి భారత్ ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఎలాగైనా తెరదించాలని భారత్ భావిస్తోంది. ఇప్పటివరకూ ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమి అనేది లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. దాంతో తుదిపోరు మరింత ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ ఈ టైటిల్ వేటలో భారత్ విజయం సాధించిన పక్షంలో మన జాతీయ క్రీడ హాకీకు ఎంతో కొంత పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. -
టీమిండియా తొలిసారి..
మొహాలి:ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 271/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు 417 పరుగుల వద్ద ఆలౌటై మ్యాచ్ పై పట్టు సాధించింది. కాగా, ఇదే క్రమంలో ఒక మైలురాయిని కూడా భారత క్రికెట్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడు, అంతకంటే కిందవచ్చిన ఆటగాళ్లు మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఘనతను భారత్ తొలిసారి సొంతం చేసుకుంది. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రవి చంద్రన్ అశ్విన్(72;113 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన రవీంద్ర జడేజా(90;170 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకం సాధించాడు. మరొకవైపు తన కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్ (55;141 బంతుల్లో 4 ఫోర్లు) తొమ్మిదో స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున ఒక టెస్టులో ఇలా ముగ్గురు కిందస్థాయి ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి. రవీంద్ర జడేజా బెస్ట్ ఇదే ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆలౌ రౌండర్ రవీంద్ర జడేజా(90;170 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్) తృటిలో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో జడేజా అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అంతకుముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 87. ఈ రోజు ఆట మొదటి సెషన్లో అశ్విన్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. అనంతరం రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.జయంత్ యాదవ్ తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే సెంచరీకి 10 పరుగుల దూరంలో జడేజా అవుటయ్యాడు. కాగా, ఆ తరువాత ఉమేశ్ యాదవ్‌తో కలిసి జయంత్ యాదవ్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి 33 పరుగులు జత చేసిన తరువాత జయంత్ తొమ్మిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కాసేపటికి ఉమేశ్(12) కూడా అవుట్ కావడంతో భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ కు 134 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఐదు వికెట్లు, రషిద్ నాలుగు వికెట్లు సాధించారు. -
'భారత్‌ది అతిపెద్ద అణు కార్యక్రమం!'
వాషింగ్టన్: అతిపెద్ద అణుశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్న అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ కూడా ఒకటి అని అమెరికాకు చెందిన మేధోసంస్థ పేర్కొంది. 2014నాటికి 75 నుంచి 125 అణ్వాయుధాలు తయారుచేసుకోగల ప్లూటోనియం నిల్వలు భారత్ వద్ద ఉన్నాయని పేర్కొంది. 'భారత్ వద్ద ఉన్న ఆయుధ స్థాయి ప్లూటోనియం బట్టి.. దానివద్ద ఉన్న అణ్వాయుధ సంపత్తిని అంచనా వేయవచ్చు. దీనిని ఆధారంగా భారత్ వద్ద 110 నుంచి 175 అణ్వాయుధాలు ఉండే అవకాశముందని, దాదాపు 138 అణ్వాయుధాలు ఉండవచ్చునని అంచనా వేయవచ్చునని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే వేపన్ గ్రేడ్ ప్లూటోనియం నిల్వల నుంచి భారత్ తయారుచేస్తున్న అణ్వాయుధాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేయవచ్చునని, వేపన్ గ్రేడ్ యూరేనియం నిల్వల నుంచి 70శాతం మాత్రమే అణ్వాయుధాలు కోసం వాడి ఉంటుందని భావించవచ్చునని ఆ సంస్థ తన నివేదికలో అభిప్రాయపడింది. ఈ నివేదికను రూపొందించిన రచయితల్లో ఒకరైన డేవిడ్ అల్ బ్రైట్ గతంలో అణు కార్యక్రమం విషయంలో భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడ్డాడు. భారత్-అమెరికా అణు ఒప్పందం కుదరకుండా ప్రయత్నాలు చేసిన అమెరికా సంస్థల్లో ఈ మేధో సంస్థ కూడా ఉంది. -
వన్డేకు భద్రత కట్టుదిట్టం
ఉప్పల్: రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆదివారం భారత్, శ్రీలంక మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మ్యాచ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను వెల్లడించారు. 1500 మంది పోలీస్ సిబ్బంది, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్‌తో పాటు పరిసరాల్లో 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను మరింత పటిష్టం చేసినట్లు చెప్పారు. మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు మైదానంలోకి సెల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగ్‌లు, తినుబండారాలవంటి ఎలాంటి వస్తువులు తీసుకు రావద్దని కమిషనర్ సూచించారు. మ్యాచ్ సందర్భంగా వాహనాల పార్కింగ్ వివరాలను కూడా ఆయన ప్రకటించారు. మెట్రో పనులు జరుగుతున్న దృష్ట్యా హబ్సిగూడ టు ఉప్పల్ రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి పార్కింగ్‌కు అనుమతి లేదని చెప్పారు. హబ్సిగూడ వైపు వచ్చే భారీ వాహనాలకు, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపునకు, ఎల్బీనగర్‌నుంచి హబ్సిగూడ, ఉప్పల్ నుంచి హ బ్సిగూడ వెళ్లే మార్గంలో భారీ వాహనాలకు కూడా మ్యాచ్ రోజున అనుమతి లేదని తెలిపారు. పార్కింగ్ ప్రాంతాలు ఇవే... గేట్-2, గేట్-3 అండ్ గేట్ -11 ద్వారా వెళ్లేవారు రామంతాపూర్ రోడ్డుకు ఇరువైపులా తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. వికలాంగులు, గేట్-3 ద్వారా స్టేడియంలోకి వెళ్లేవారు రామంతాపూర్ రోడ్డులోనే పార్కు చేసుకోవాలి. ప్రత్యేక పార్కింగ్ కు అనుమతి ఉన్న వారు, గేట్ -4 అండ్ 9 ద్వారా వెళ్లేవారు హబ్సిగూడ నుంచి ఏక్ మినార్ మజీద్ ద్వారా ప్రవేశించాలి. కాంప్లిమెంటరీ పాస్‌లు ఉన్నవారు రామంతాపూర్ రోడ్డులో ఎల్జీ గోడౌన్ ప్రాంతంలో పార్కింగ్ చేసుకోవాలి.