Negative marks
-
జేఈఈ మెయిన్–2022 నిబంధనల్లో మార్పులు.. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 నిబంధనల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పు చేసినందున విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో అన్ని సెక్షన్ల ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్‌ను అమలు చేయనున్నామని ఎన్టీఏ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నందున అభ్యర్థులు సరైన సమాధానాలను మాత్రమే గుర్తించాలని, తప్పుడు సమాధానాలు గుర్తిస్తే మార్కుల్లో కోత పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో సెక్షన్–ఎ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బి లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్‌తో పాటు బీఆర్క్‌కు సంబంధించిన పేపర్ 2ఏలోని సెక్షన్–బిలో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. ప్రశ్నల్లో విద్యార్థులకు చాయిస్ కరోనా కారణంగా కాలేజీలు ఆలస్యంగా తెరచుకోవడంతో 2021–22 విద్యా సంవత్సరంలోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను కుదించాయి. అయితే ఎన్టీఏ సిలబస్ కుదించలేదు. అయితే విద్యార్థులకు ఉపశమనంగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్1, పేపర్ 2ఏ, 2బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్‌ను ఇచ్చింది. ఆయా విభాగాల్లో తమకు వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులు జవాబు ఇవ్వవచ్చు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా ఉంటాయి. ప్రాంతీయ భాషా ప్రశ్న పత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే అందిస్తారు. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్ తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందస్తు దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది హాజరు జేఈఈ మెయిన్‌ను 2021లో నాలుగు విడతలుగా నిర్వహించగా ఈసారి రెండు విడతలకే పరిమితం చేశారు. తొలి విడత ఈనెల 20 నుంచి 29 వరకు, మలివిడత జూలై 21 నుంచి 30 వరకు జరుగుతుంది. ఈనెల 1 నుంచి ప్రారంభమైన మలివిడత దరఖాస్తు ప్రక్రియ 30వ తేదీతో ముగియనుంది. తొలి విడతకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది వరకు హాజరవుతారని భావిస్తున్నారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది మెయిన్ రాసే అవకాశం ఉంది. చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రం కేటాయింపు ఈసారి అభ్యర్థి చిరునామాను అనుసరించి మాత్రమే సమీపంలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశమిచ్చిన ఎన్టీఏ.. వాటిలో ఒకదానిని కేటాయిస్తుంది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలను కూడా ఎంపిక చేసుకొనే విధానముండేది. అయితే 2021 మెయిన్‌లో కొందరు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడడం, మాస్ కాపీయింగ్ జరగడంతో సీబీఐ విచారణ, అరెస్టులు కూడా చోటుచేసుకున్నందున ఈసారి ఆ విధానాన్ని మార్చారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 334 నుంచి 514కు ఎన్టీఏ పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో 29 పరీక్ష కేంద్రాల్లో ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు ఇవీ అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం -
నేనేం రోబోను కాదు.. మనిషినే!: ఎలన్ మస్క్
ఎలన్ మస్క్.. ఈ వ్యక్తి మీద రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కొంతమంది ఈయన్ని తిక్కలోడుగా భావిస్తుంటే.. ఎక్కువ మంది మాత్రం ఆయన్నొక మేధావిగా భావిస్తుంటారు. అయితే యువతకు మాత్రం ఆయనొక ఫేవరెట్ ఐకాన్. ఎవరేమీ అనుకున్నా.. తాను చేసేది తాను చేసుకుంటూ పోవడం ఆయన నైజం. ఈ క్రమంలో ఆయన వ్యక్తిత్వం మీద పలువురికి అనుమానాలు కలగవచ్చు. అయితే అందరిలా తనకూ భావోద్వేగాలు ఉంటాయని అంటున్నారు ఎలన్ మస్క్. ట్విటర్‌ను సొంతం చేసుకున్నాక తొలిసారి ఎలన్ మస్క్ జనం మధ్యకు వచ్చాడు. న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా వార్షికోత్సవానికి ఈ అపర కుబేరుడు తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చాడు. అయితే తనపై వచ్చే విమర్శలను భరించేంత గుణం తనలో లేదని వ్యాఖ్యానించాడాయన. మీడియా, ఇంటర్నెట్లో నా మీద వ్యతిరేకత విపరీతంగా కనిపిస్తుంటుంది. కానీ.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. నేనేం రోబోను కాను.. అందరిలా మనిషినే అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు ఆయన. ఆ టైంలో నాకూ బాధ అనిపిస్తుంటుంది. కానీ, వాటిని తేలికగా తీసుకునే ప్రయత్నం చేస్తానని, ప్రత్యేకించి ఆన్లైన్ ట్రోల్స్ విషయంలో అని ఆయన అన్నారు. అన్నట్లు.. ప్రపంచంలో అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్.. చాడ్విక్ బోస్మాన్ నివాళి ట్వీట్ కాగా, రెండో స్థానంలో నిలిచింది ఎలన్ మస్క్ ఈ మధ్య ‘కోకా-కోలా’ను కొనుగోలు చేస్తానని ప్రకటిస్తూ చేసిన ట్వీట్. చదవండి: ఆ పని చేస్తే నాకు నష్టం.. ఐనా పర్లేదు- ఎలన్ మస్క్ -
ప్రతిభకు నవోదయం
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారత ప్రభుత్వం 1986లో జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. 6నుంచి 12వ తరగతి వరకు బాలబాలికలతో ఈ ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో బాయ్స్, గర్ల్స్‌కి వేర్వేరు వసతు లు ఉంటాయి. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తున్నాయి. భార త ప్రభుత్వం ద్వారా సంపూర్ణ ప్రతిపత్తి గల సంస్థ ఇది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం ఎంపిక పరీక్ష(జేఎన్వీఎస్టీ) ద్వారా జరుగుతుం ది. ఈ పాఠశాల ల్లో 6నుంచి 8వ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృభాషా మాధ్యమం లో బోధన జరుగుతుంది.అనంతరం విద్యా బోధ న మొత్తం ఆంగ్లంలో ఉంటుంది. 10, 12 తరగతి విద్యార్థులు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహించే పరీక్షకు హాజరవుతారు. విద్యాలయాల వివరాలు... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, షిల్లాంగ్, పూణే ఈ 8 రీజియన్ల పరిధిలో 598 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్ కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది. ప్రతి జిల్లాకు ఒక స్కూలు చొప్పున పాఠశాలలను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాకు సంబంధించి వర్గల్లో, రంగారెడ్డికి సంబంధించి గచ్చిబౌలిలో నవోదయ విద్యాలయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10, ఆంధ్రాలో 14 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశ అర్హత పరీక్ష... 2015-16 విద్యా సంవత్సరానికి గానూ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అడ్మిషన్ దరఖాస్తులను జవహర్ నవోదయ విద్యాలయాలు, ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల నుంచి ఉచితంగా పొందవచ్చు. మన రాష్ట్రంలో నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష రాసే వారు ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 2015 ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 11-30 గంటలకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి స్థానిక ఎంఈఓ కార్యాలయాల్లో హాల్ టికెట్లు పొందవచ్చు. రిజర్వేషన్ వివరాలు... ఆరో తరగతి ప్రవేశంలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, మొత్తం సీట్లలో బాలికలకు మూడో వంతు సీట్లను రిజర్వేషన్ల కింద కేటాయించారు. అదే విధంగా అంగవైకల్యం గల పిల్లలకు 3 శాతం రిజర్వేషన్ ఉంది. స్థానికులే అర్హులు... జిల్లాకు చెందిన స్థానిక విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ప్రవేశం కోరే అభ్యర్థులు 2002 మే నెల ఒకటో నుంచి 2006 ఏప్రిల్ 31లోపు జన్మించిన వారై ఉండాలి. 2014-15 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. ఈ విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో విధిగా ఉత్తీర్ణులై ఉండాలి. సీట్ల కేటాయింపు... పాఠశాలలోని మొత్తం 80 సీట్లలో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో, మిగిలిన 25 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేయాలి. గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ పొందాలంటే అభ్యర్థి 3,4,5 తరగతులు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల ల్లో చదివి ఉత్తీర్ణులై ఉండాలి. నెగిటివ్ మార్కులు ఉండవు వంద మార్కులకు ఉండే ప్రవేశ పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలకు 50 మార్కు లు, గణితం 25 మార్కులు, భాషా పరీక్షకు 25 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.