జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారత ప్రభుత్వం 1986లో జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. 6నుంచి 12వ తరగతి వరకు బాలబాలికలతో ఈ ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో బాయ్స్, గర్ల్స్‌కి వేర్వేరు వసతు లు ఉంటాయి. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తున్నాయి.
భార త ప్రభుత్వం ద్వారా సంపూర్ణ ప్రతిపత్తి గల సంస్థ ఇది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం ఎంపిక పరీక్ష(జేఎన్‌వీఎస్‌టీ) ద్వారా జరుగుతుం ది. ఈ పాఠశాల ల్లో 6నుంచి 8వ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృభాషా మాధ్యమం లో బోధన జరుగుతుంది.అనంతరం విద్యా బోధ న మొత్తం ఆంగ్లంలో ఉంటుంది. 10, 12 తరగతి విద్యార్థులు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహించే పరీక్షకు హాజరవుతారు.
విద్యాలయాల వివరాలు...
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, షిల్లాంగ్, పూణే ఈ 8 రీజియన్ల పరిధిలో 598 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్ కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది. ప్రతి జిల్లాకు ఒక స్కూలు చొప్పున పాఠశాలలను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాకు సంబంధించి వర్గల్‌లో, రంగారెడ్డికి సంబంధించి గచ్చిబౌలిలో నవోదయ విద్యాలయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10, ఆంధ్రాలో 14 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.
ప్రవేశ అర్హత పరీక్ష...
2015-16 విద్యా సంవత్సరానికి గానూ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అడ్మిషన్ దరఖాస్తులను జవహర్ నవోదయ విద్యాలయాలు, ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల నుంచి ఉచితంగా పొందవచ్చు. మన రాష్ట్రంలో నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష రాసే వారు ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 2015 ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 11-30 గంటలకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి స్థానిక ఎంఈఓ కార్యాలయాల్లో హాల్ టికెట్లు పొందవచ్చు.
రిజర్వేషన్ వివరాలు...
ఆరో తరగతి ప్రవేశంలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, మొత్తం సీట్లలో బాలికలకు మూడో వంతు సీట్లను రిజర్వేషన్ల కింద కేటాయించారు. అదే విధంగా అంగవైకల్యం గల పిల్లలకు 3 శాతం రిజర్వేషన్ ఉంది.
స్థానికులే అర్హులు...
జిల్లాకు చెందిన స్థానిక విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ప్రవేశం కోరే అభ్యర్థులు 2002 మే నెల ఒకటో నుంచి 2006 ఏప్రిల్ 31లోపు జన్మించిన వారై ఉండాలి. 2014-15 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. ఈ విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో విధిగా ఉత్తీర్ణులై ఉండాలి.
సీట్ల కేటాయింపు...
పాఠశాలలోని మొత్తం 80 సీట్లలో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో, మిగిలిన 25 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేయాలి. గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ పొందాలంటే అభ్యర్థి 3,4,5 తరగతులు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల ల్లో చదివి ఉత్తీర్ణులై ఉండాలి.
నెగిటివ్ మార్కులు ఉండవు
వంద మార్కులకు ఉండే ప్రవేశ పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలకు 50 మార్కు లు, గణితం 25 మార్కులు, భాషా పరీక్షకు 25 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ప్రతిభకు నవోదయం
Published Sat, Sep 13 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
Advertisement
Advertisement