Jawahar Navodaya Vidyalayas
-
రాష్ట్రాలు కోరితేనే నవోదయ విద్యాలయాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు కోరితేనే జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీలు) ఏర్పాటు చేస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నూతన నవోదయ విద్యాలయాల ఏర్పాటును కోరే రాష్ట్రాలు శాశ్వత భవన నిర్మాణాలకు తగిన భూమిని ఉచితంగా సమకూర్చాలని చెప్పారు. శాశ్వత భవనాల నిర్మాణం జరిగే వరకు విద్యాలయం నిర్వహణకు తాత్కాలిక భవనాలను రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఒకటి, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ రోడ్ల నిర్వహణ రాష్ట్రాల బాధ్యతే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారుల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్రాల బాధ్యతేనని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ పథకం కింద నిర్మించే గ్రామీణ రోడ్ల నిర్వహణకు అవసరమైన నిధులు గ్రాంట్ల రూపంలో ఆయా రాష్ట్రాలకు అందించాలని 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఏపీలో పీఎంకేవీవై–ఎస్టీటీలో 91,203 మందికి ప్లేస్మెంట్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై)లో భాగంగా షార్ట్ టర్మ్ ట్రైనింగ్ (ఎస్టీటీ) పొందిన 91,203 మందికి ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. పీఎంఏవై–జీలో 46,718 ఇళ్ల నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ (పీఎంఏవై–జీ) పథకంలో భాగంగా ఏపీలో 46,718 ఇళ్లు నిర్మించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి చెప్పారు. పీఎంజీఎస్వైలో ఏపీకి 3,285 కి.మీ. రహదారులు ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 3,285 కిలోమీటర్ల రహదారులు కేటాయించామని, దీన్లో 2,314 కిలోమీటర్లకు అనుమతి ఇచ్చామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యుడు పరిమళ్ నత్వానీ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. మిగిలిన కిలోమీటర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. -
‘నవోదయ’కు దరఖాస్తుల ఆహ్వానం
చేవెళ్ల: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2014-15 సంవత్సరానికి గాను 6వతరగతిలో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షకు వచ్చేనెల 31తేదీ లోగా ఆసక్తిగల బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని చేవెళ్ల మండల మానవ వనరుల విద్యాకేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రవేశ పరీక్ష వచ్చేసంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ 2015 (శనివారం) నిర్వహించనున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ పరీక్ష రెండు గంటలపాటు ఉంటుంది. ప్రతిభగల బాలబాలికలకు ఇదో సువర్ణావకాశం. ప్రత్యేక వసతులు.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే నవోదయ విద్యాలయాల్లో విద్యార్థులకు ప్రత్యేక అన్ని వసతులు కల్పిస్తారు. బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం, అర్హత, అనుభవం కలిగిన బోధనా సిబ్బంది, విద్యలో సాంకేతిక శాస్త్ర సమాచారం తదితర అంశాలను బోధిస్తారు. తగిన సహ పాఠ్య కార్యక్రమాలు, క్రీడలు, ఆటలు, యోగా ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఉంటుంది. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, భోజన వసతి ఉచితంగా సమకూరుస్తారు. రిజర్వేషన్లు.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం సీట్లు, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు రిజర్వేషన్ ఉంటుంది. వికలాంగులకు 3 శాతం, షెడ్యూలు కులాలవారికి 15 శాతం, షెడ్యూలు తెగలవారికి 7.5 శాతం కనీస రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. దరఖాస్తు విధానం.. జిల్లాలోని పలు విద్యా కేంద్రాల్లో సమాచార సంచిక (ప్రాస్పెక్టస్) దరఖాస్తు ఫారం ఉచి తంగా లభిస్తుంది. జిల్లా విద్యాధికారి కార్యాలయం, మండల విద్యాధికారి కార్యాలయం, 5వ తరగతి ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, ఎక్రిడేటెడ్ సంస్థ, జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ, జవహర్ విద్యాలయ కార్యాలయాలలో దరఖాస్తు ఫారాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ ఫారాన్ని డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.నవోదయ.ఎన్ఐసీ.ఐన్ అనే వెబ్సైట్ నుంచి కూడా పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను జిల్లాలోని సంబంధిత మండల విద్యా శాఖ అధికారి కార్యాలయంలో అక్టోబర్ 31లోగా అందజేయాల్సి ఉంటుంది. అర్హులెవరంటే.. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న బాల బాలికలు అర్హులు. 01-05-2002 నుంచి 30-04-2006లో మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో 3,4 తరగతులు ఉత్తీర్ణులై ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న వారు అర్హులు. పోటీ పరీక్షకు సబ్జెక్టులు.. ఈ పోటీ పరీక్షకు ఆయా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. 50 శాతం మేధాశక్తి, 25శాతం గణిత ం, 25 శాతం భాషకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల వ్యవధితో 100 మార్కుల ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థి తాను ఐదో తరగతిలో ఏ భాషా మాధ్యమంలో అభ్యసిస్తున్నారో అదే భాషా మాధ్యమంలో పరీక్ష ఉంటుంది. మంచి భవిష్యత్తు కలిగిన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో చేరేందుకు ఆసక్తిగల బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. -
ప్రతిభకు నవోదయం
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారత ప్రభుత్వం 1986లో జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. 6నుంచి 12వ తరగతి వరకు బాలబాలికలతో ఈ ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో బాయ్స్, గర్ల్స్‌కి వేర్వేరు వసతు లు ఉంటాయి. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తున్నాయి. భార త ప్రభుత్వం ద్వారా సంపూర్ణ ప్రతిపత్తి గల సంస్థ ఇది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం ఎంపిక పరీక్ష(జేఎన్వీఎస్టీ) ద్వారా జరుగుతుం ది. ఈ పాఠశాల ల్లో 6నుంచి 8వ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృభాషా మాధ్యమం లో బోధన జరుగుతుంది.అనంతరం విద్యా బోధ న మొత్తం ఆంగ్లంలో ఉంటుంది. 10, 12 తరగతి విద్యార్థులు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహించే పరీక్షకు హాజరవుతారు. విద్యాలయాల వివరాలు... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, షిల్లాంగ్, పూణే ఈ 8 రీజియన్ల పరిధిలో 598 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్ కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది. ప్రతి జిల్లాకు ఒక స్కూలు చొప్పున పాఠశాలలను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాకు సంబంధించి వర్గల్లో, రంగారెడ్డికి సంబంధించి గచ్చిబౌలిలో నవోదయ విద్యాలయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10, ఆంధ్రాలో 14 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశ అర్హత పరీక్ష... 2015-16 విద్యా సంవత్సరానికి గానూ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అడ్మిషన్ దరఖాస్తులను జవహర్ నవోదయ విద్యాలయాలు, ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల నుంచి ఉచితంగా పొందవచ్చు. మన రాష్ట్రంలో నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష రాసే వారు ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 2015 ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 11-30 గంటలకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి స్థానిక ఎంఈఓ కార్యాలయాల్లో హాల్ టికెట్లు పొందవచ్చు. రిజర్వేషన్ వివరాలు... ఆరో తరగతి ప్రవేశంలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, మొత్తం సీట్లలో బాలికలకు మూడో వంతు సీట్లను రిజర్వేషన్ల కింద కేటాయించారు. అదే విధంగా అంగవైకల్యం గల పిల్లలకు 3 శాతం రిజర్వేషన్ ఉంది. స్థానికులే అర్హులు... జిల్లాకు చెందిన స్థానిక విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ప్రవేశం కోరే అభ్యర్థులు 2002 మే నెల ఒకటో నుంచి 2006 ఏప్రిల్ 31లోపు జన్మించిన వారై ఉండాలి. 2014-15 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. ఈ విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో విధిగా ఉత్తీర్ణులై ఉండాలి. సీట్ల కేటాయింపు... పాఠశాలలోని మొత్తం 80 సీట్లలో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో, మిగిలిన 25 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేయాలి. గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ పొందాలంటే అభ్యర్థి 3,4,5 తరగతులు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల ల్లో చదివి ఉత్తీర్ణులై ఉండాలి. నెగిటివ్ మార్కులు ఉండవు వంద మార్కులకు ఉండే ప్రవేశ పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలకు 50 మార్కు లు, గణితం 25 మార్కులు, భాషా పరీక్షకు 25 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.