Negative public reaction
-
చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్న తీరు.. ప్రజా కూటమిపై ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూపబోతోందని సీపీఎం అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని పేర్కొంది. మొదట్లో కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉండొచ్చునని భావించినా తెలంగాణ అనుకూల సెంటిమెంట్ పెరగడంతో ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. శనివారం మఖ్దూమ్ భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, బీఎల్ఎఫ్కున్న అవకాశాలను గురించి సమీక్షించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, 17 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చార్జీలు హాజరయ్యారు. వివిధ వర్గాల ప్రజలకిచ్చే పింఛను డబ్బును పెంచడం, రైతుబంధు పథకం, సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వారి కోసం సంక్షేమ పథకాల అమలు, ఏదో ఒకరూపంలో లబ్ధి చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాలు టీఆర్ఎస్కు ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాయని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావించినందువల్లే.. ఆ పార్టీకే మళ్లీ పట్టంగడుతున్నారని విశ్లేషించారు. మైనారిటీల ఓట్లు పెద్ద సంఖ్యలో పడటం కూడా టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తెరపైకి... తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, ఆయన వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణలో మరోసారి చంద్రబాబు వేలుపెడితే ఇక్కడి రాజకీయాలు, పరిస్థితుల్లో కూడా ప్రతికూల మార్పులొస్తాయనే ప్రజలు భావించారని అభిప్రాయపడింది. కూటమిని మొత్తం తన చుట్టే తిప్పుకోవడం, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడం మొదలుకుని, తానే ముందుండి నడిపించడం కూడా ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైందని అంచనా వేసింది. ఎన్నికలకు ముందు చివరి 4,5 రోజుల పాటు చంద్రబాబు నిర్వహించిన విస్తృత ప్రచారం, ప్రస్తావించిన అంశాలు కూటమిపై ప్రతికూల ప్రభావం చూపాయని అభిప్రాయపడింది. సీపీఎంగా పోటీచేసిన భద్రాచలం, మిర్యాలగూడలలో, బీఎల్ఎఫ్ అభ్యర్థులున్న నారాయణ్‌పేట్, మధిరలలో కనీసం ఒక్కోస్థానంలోనైనా గెలిచే అవకాశాలున్నాయని భావిస్తోంది. -
భారత్ పర్యటనే ట్రూడో కొంప ముంచబోతుందా?
ఒట్టావా : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పర్యటన ఆయన కొంప ముంచబోతోందా? అంటే.. అవుననే సర్వేలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గనుక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ ఓటమి పాలు కావటం ఖాయమని చెబుతున్నారు. తాజాగా అక్కడ నిర్వహించిన ఓ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. కెనడియన్ నెట్వర్క్ అయిన గ్లోబల్ న్యూస్ తాము నిర్వహించిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. ట్రూడో ఎనిమిది రోజుల భారత పర్యటన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవటానికి కారణమని తెలిపింది. అందులో ఫెడరల్ ఎన్నికలు జరిగితే లిబరల్ పార్టీకి కేవలం 33 శాతం ఓట్లను మాత్రమే కైవసం చేసుకుని ఓటమి పాలవుతుందని తేల్చేసింది. మొత్తం పోలింగ్‌లో పాల్గొన్నవారిలో 40 శాతం ప్రజలు భారత్‌తో సంబంధాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కేవలం 16 శాతం మాత్రమే ఇరు దేశాల మైత్రిపై ఆసక్తి చూపినట్లు సర్వేలో తేలిందని గ్లోబల్ న్యూస్ సీఈవో, సీనియర్ రాజకీయ విశ్లేషకుడు డార్రెల్ల్ బ్రిక్కర్ వెల్లడించారు. అంతేకాదు ఓటింగ్‌లో ట్రూడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 54 శాతం ప్రజలు ఓటేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యతిరేకంగా ఎన్నికల దాకా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బ్రిక్కర్ అభిప్రాయపడ్డారు. 2019 అక్టోబర్‌లో కెనెడా ఫెడరల్ ఎన్నికలు జరగనున్నాయి. -
‘చేతు’లు కాలాక..!
- పార్టీ పరిస్థితిపై సమీక్షకు కాంగ్రెస్ సిద్ధం - ప్రభుత్వంపై పోరాటంలోనూ వెనుకంజ - ఓటమి భారం నుంచి ఇంకా తేరుకోని పార్టీ - సమావేశంపై నేతలు, కార్యకర్తల్లో అనాసక్తి - నేడు పీసీసీ చీఫ్ సమక్షంలో సమావేశం శ్రీకాకుళం: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికార పార్టీ స్థాయి నుంచి సున్నా స్థాయికి పడిపోయిన ఆ పార్టీకి ఓటమిపై సమీక్షతోపాటు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గొంతెత్తడానికి రెండు నెలల తర్వాత గానీ తీరికి చిక్కలేదు. ఓటమి షాక్ నుంచి తేరుకోకపోవడమూ దీనికి కారణం. ఆలస్యంగానైనా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో శనివారం శ్రీకాకుళం నిర్వహించనున్న పార్టీ జిల్లాస్థాయి సమీక్ష సమావేశంపై నాయకులు, కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఓటమి కారణాలను సమీక్షించడంతో పాటు పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా మండల, గ్రామస్థాయి కమిటీలను పునరుద్ధరించడం సమావేశం ప్రధాన ఎజెండా. అలాగే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటంం, మేనిఫెస్టోలోని హామీల అమలులో టీడీపీ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టడం, రాజధాని ఎంపికలో ఎడతెగని జాప్యంపై ప్రశ్నించడం వంటి అంశాలను కూడా ఎజెండాలో చేర్చారు. అయితే ఇప్పట్లో పార్టీని పునరుజ్జీవింపజేయడం కష్టమని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. పోరాట బాటలోనూ వెనుకంజ... ఓటమిని ముందే గ్రహించిన కాంగ్రెస్ నేత లు ఎన్నికలకు ముందు టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందున ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీపై మొదటి సంతకం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పటివరకు మాఫీ అమలుపై స్పష్టత ఇవ్వకపోయినా కాంగ్రెస్ నేతలు నోరు విప్పడం లేదు. ఎన్నికల అనంతరం ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన వైఎస్సార్సీపీ మొదటి నుంచి ప్రజల పక్షాన ఉండి ప్రజలతో కలిసి పోరాట బాట పట్టడమే కాకుండా ఇటీవల నరకాసుర వధ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించగలిగింది. కానీ నిన్నటివరకు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ ప్రజల్లోకి రాలేకపోతోంది. అలాగే చెన్నైలో గత నెలల్లో జరిగిన రెండు దుర్ఘటనల్లో మృతి చెందిన వారిని కాంగ్రెస్ నాయకులు కనీసం పరామర్శించలేకపోయారు. కార్యకర్తలు ‘చే’జారకుండాఉండేందుకేనా.. ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ కార్యకర్తలు పూర్తిగా మానసిక స్థైర్యాన్ని కోల్పోయారు. చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఉన్న కార్యకర్తలనైనా కాపాడుకునేందుకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ సమీక్ష సమావేశం పెట్టినట్లు కనిపిస్తోంది. ఒక కేంద్ర మంత్రి, ఇద్దరు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఉండి కూడా జిల్లాను అభివృద్థి పథంలో నడపలేకపోయారు. అధికారం ఉన్నప్పుడే ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ప్రజలకు అండగా ఎలా నిలుస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.