nellore collector
-
కలెక్టర్‌ను అభినందించిన సీఎం
సాక్షి, నెల్లూరు : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘స్పందన’ పేరిట తీసుకున్న కార్యక్రమానికి జిల్లాలో చేపట్టిన చర్యలు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబును అభినందించారు. బుధవారం స్పందన కార్యక్రమం అమలుపై సీఎం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జిల్లా కలెక్టర్‌ను శేషు (శేషగిరిబాబు) అని పిలుస్తూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని 24 గంటల్లో సంబంధిత అధికారులకు చేరవేయడంలో చేపట్టిన చర్యలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాలో అమలు చేసిన ప్రక్రియను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శేషు స్పందనకు మీరు తీసుకున్న చర్యలు విశేషంగా ఉన్నాయని, అర్జీదారులు ఇంట్లో కూర్చుని వారికి ఇచ్చిన రశీదు ద్వారా సమస్య పరిష్కారం ఏ రూపంలో ఉందో తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అర్జీలకు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం చూపాలన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్లు అవినీతికి పాల్పడకుండా సక్రమంగా పని చేస్తే కలెక్టర్‌కు పేరు వస్తుందన్నారు. పోలీస్‌స్టేషన్‌లో అవినీతి లేకుండా కేసులు పరిష్కరిస్తే ఎస్పీకి పేరు వస్తుందన్నారు. బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన తరువాత కూడా ప్రజలు అధికారుల పేరు చెప్పుకోవాలన్నారు. ప్రజలకు ఆ విధమైన పాలన అందించాలని సీఎం సూచించారు. మండల స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు అవినీతి, లంచాలు నిరోధించేలా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్, ఎస్పీలు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి పారదర్శకత, విశ్వసనీయత, అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని సీఎం వివరించారు. జిల్లా కలెక్టర్లు మావతా దృక్పథం, సేవాతత్పరణతో తక్షణమే స్పందించి జిల్లాలో మరణించిన అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏక్స్గ్రేషియా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతుల కుటుంబాలకు ఓదార్పునిచ్చి వారిలో ఆత్మస్థైర్యం నింపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీదారులు 550 వినతులు సమర్పించారన్నారు. అర్జీదారులు సమర్పించిన వినతులను సంబంధిత అధికారులకు స్పీడ్‌పోస్టు ద్వారా 24 గంటల్లో అందజేయడం జరిగిందన్నారు. అర్జీదారులకు స్పందనలో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఐదు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విభాగాల వారీగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరిగిందని సీఎంకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో సీ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి రాష్ట్రపతి దంపతుల రాక
సాక్షి, నెల్లూరు(పొగతోట): భారత రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ దంపతులు ఈ నెల 14వ తేదీన షార్కు రానున్నారు. శ్రీహరికోట నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతితోపాటు ఆయన సతీమణి కూడా షార్కు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు శ్రీహరికోట చేరుకుంటారు. ప్రయోగం వీక్షించిన తర్వాత 15వ తేదీ రాష్ట్రపతి తిరుగు ప్రయాణమవుతారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. షార్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతి దంపతుల రాక సందర్భంగా సోమవారం కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్టపతి దంపతులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం షార్కు వస్తున్నారని తెలిపారు. వారికి ఎలాంకి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అవసరమైన మందులు అంబులెన్స్‌తో సిద్ధంగా ఉంచాలన్నారు. షార్‌లోని ఆస్పత్రిలో అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది వివరాలను డీఆర్డీఓకు అందజేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 12వ తేదీన ట్రయల్‌రన్ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, జాయింట్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి, డీఆర్ఓ సి.చంద్రశేఖరరెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ భార్గవి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జీవపుత్రకుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, విద్యుత్‌శాఖ ఎస్ఈ విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
'చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు'
వింజమూరు (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు): స్వార్థం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఉపేక్షించబోమని నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆమె జిల్లాలోని వింజమూరు సమీపంలో ఉన్న న్యూట్రస్ స్పెషాలిటీస్ అనే ఔషధ ఫ్యాక్టరీని సందర్శించారు. ఇటీవల గ్రామస్తుల దాడిలో కర్మాగారానికి కలిగిన నష్టాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలతో ప్రజలకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. గామస్తుల విన్నపం మేరకు నెల క్రితం కర్మాగారం విడుదల చేసే వ్యర్థాలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిందని ఈ సందర్భంగా తెలిపారు. తమ అనారోగ్యానికి ఫ్యాక్టరీ వ్యర్థాలే కారణమంటూ గ్రామస్తులు ఫ్యాక్టరీపై ఇటీవల దాడికి దిగటం దురదృష్టకరమన్నారు. గ్రామానికి చెందిన కొందరు నాయకులు స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొట్టి దాడికి పురిగొల్పారని చెప్పారు. దాడి కేసులో ఇప్పటికే 10 మంది అరెస్టు.. 70 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. అనంతరం గ్రామంలోని వారికి రేషన్, పింఛన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించామని, అయితే వాటిని పునరుద్ధరించే విషయాన్ని పరిశీలించనున్నట్లు గ్రామస్తులకు కలెక్టర్ జానకి హామీ ఇచ్చారు.