nerve disease
-
శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీలా మారిపోయాడు!
లైమ్‌రిక్ (ఐర్లాండ్): ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యతో శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీగా మారిపోయాడు. ఒకట్రెండు రోజులుగా జరిగినవేవీ జ్ఞాపకానికి రాక కిందా మీదా పడ్డాడు. 66 ఏళ్ల ఆ వ్యక్తి భార్యతో గడిపిన 10 నిమిషాలకు మొబైల్లో తేదీ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ ముందు రోజే వాళ్ల పెళ్లి రోజు. అంత ముఖ్యమైన విషయం మర్చిపోయానే అంటూ బాధపడిపోయాడు. నిజానికతను భార్యతో, కూతురితో కలిసి ముందు రోజు సాయంత్రం పెళ్లి రోజును చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ అవేమీ అతనికి గుర్తు లేకుండా పోయాయి. దాంతో, పెళ్లి రోజున సరదాగా గడిపామని భార్య, కూతురు ఎంత చెప్పినా ఓ పట్టాన నమ్మలేదు. ‘‘నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? నేను ఏమేం చేశాను? ఒక్కటీ వదలకుండా చెప్పండి’’ అంటూ వారిని పదేపదే అడిగాడు. పోనీ జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందా అంటే తన పేరు, వయసు వంటి పాత విషయాలన్నీ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి. ఇక లాభం లేదని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలన్నీ చేయించినా సాధారణంగా మతిమరుపుకు దారితీసే నరాల సమస్య వంటివేమీ లేవని, అంతా మామూలుగానే ఉందని తేలింది. మరి ఈ తాత్కాలిక మరుపేమిటో అర్థం కాక డాక్టర్లు కూడా అయోమయానికి గురయ్యారు. కాసేపటికే ముందు రోజు జ్ఞాపకాలన్నీ తిరిగి రావడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఐరిష్ మెడికల్ జర్నల్ మే సంచికలో వ్యాసంగా పబ్లిషైంది. అతని సమస్యను ఒక రకమైన షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌గా గుర్తించినట్టు వ్యాసకర్త వివరించారు. ‘‘సాధారణంగా స్ట్రోక్ తదితరాల వల్ల తలెత్తే నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా (టీజీఏ)గా పేర్కొనే షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కు కారణమవుతుంది. కానీ అలాంటివేవీ లేకుండానే కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుంది. ప్రస్తుత కేసు అలాంటిదే’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారముంటుందన్నారు. ‘‘శారీరకంగా బాగా శ్రమ పడ్డా, అతి చల్లని, లేదా బాగా వేడి నీళ్లలో చాలాసేపు మునిగినా, ఎమోషనల్ స్ట్రెస్‌కు, బాధకు గురైనా, అరుదుగా కొన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాక ఇలా స్వల్పకాలిక మతిమరుపు వచ్చి పడుతుంది. ఫలితంగా తాజా సంఘటనలు ఎవరో చెరిపేసినట్టుగా జ్ఞాపకాల్లోంచి మాయమైపోతాయి. కొందరేమో ఏడాది క్రితం జరిగినవి మర్చిపోతుంటారు. చాలామటుకు కొద్ది గంటల్లోనే ఆ జ్ఞాపకాలన్నీ తిరిగొచ్చి మళ్లీ మామూలైపోతారు’’ అని వివరించారు. కొసమెరుపు ఈ ఉదంతంలోని కథానాయకునికి 2015లోనూ ఇలాంటి తాత్కాలిక మతిమరుపు వచ్చిందట. అది కూడా ఎప్పుడో తెలుసా? భార్యతో సన్నిహితంగా గడిపిన 10 నిమిషాలకే! -
నరాల వ్యాధితో నరకయాతన
మదనపల్లె టౌన్ : ఈ ఫొటోలో మంచానికే పరిమితమై వున్న వ్యక్తి పేరు సంకారపు శ్రీనివాసులు(51). వైఎస్ఆర్ జిల్లా చిన్నమండ్యం మండలం, దేవగుడిపల్లె పంచాయతి, కొండమూలపల్లె. బతుకుదెరువు కోసమని 32 ఏళ్లక్రితం ఊరుగాని ఊరు రొచ్చాడు. మదనపల్లె పట్టణం చంద్రాకాలనీ సమీపంలోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్నారు. ఇతనికి భార్య శారద, ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు. రాత్రింబవళ్లు భార్య ఒక చోట తనొకచోట కూలి మాగ్గాలు నేస్తూ శ్రమించారు. రంగురంగుల చీరలనేసి ప్రశంసలు అందుకున్నారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2006లో పేదలకు ఇళ్లను మంజూరు చేయడంతో సొంతింటి కల నెరవేర్చుకున్నాడు. ఆ అన్యోన్య దంపతులను చూసి దేవుడు ఓర్వలేక పోయాడు. తొమ్మిదేళ్ల క్రితం చీరలు నేస్తుండగా హైబీపీ రావడంతో కింద పడిపోయాడు. తిరుపతి, చెన్నై, బెంగుళూరు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. అయితేనరాల్లో కదలిక లేదని, ప్రతి రోజు ఫిజియోథెరపీ చేయిస్తే కొంతమేర మెరుగైన పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటికే నెలకు మందులకు రూ.5 వేలపైనే ఖర్చు చేస్తుండడంతో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన మంచానికే పరిమితమై కుటుంబాన్ని చూసి కుమిలిపోతున్నాడు. చదువుకోవాల్సిన 13 ఏళ్ల కొడుకు హోటల్లో ›పనిచేసే తెచ్చే కూలి డబ్బుతో బతుకు ఈడ్చుతూ దాతల చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు 63042 77828ను సంప్రదించాలని వేడుకుంటున్నారు. నీరుగట్టువారిపల్లె శాఖ ఆంధ్రాబ్యాంకు ఖాతా నంబర్: 209910100020445, ఐఎఫ్ఎస్సికోడ్ నెంబర్: ఏఎన్‌డిబీ 0002099.కు దాతలు జమ చేయవచ్చు. ఆపరేషన్ చేస్తేమామూలు స్థితికి చేరుకోవచ్చు కళ్లు తిరిగి కింద పడడంతో తలలో రక్త నాళాలు చిట్లి పక్షవాతం వచ్చింది. అంతేకాకుండా వెన్నెముక దెబ్బతినడం వల్ల కాళ్లు చేతులు పనిచేయకుండా పోయాయి. ఎమ్మార్ఐ స్కానింగ్ తీసి, వీలును బట్టి ఆపరేషన్ చేస్తే తిరిగి మామూలు స్థితికి చేరుకోవచ్చు. ఇది కాస్త ఖర్చుతో కూడిన వైద్యం.–డాక్టర్ సాయికిషోర్,మదనపల్లె జిల్లా ఆస్పత్రి వైద్యులు -
పేద గిరిజన కుటుంబానికి కేటీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: తీవ్ర కష్టాల్లో చిక్కుకొని దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న గిరిజన కుటుంబానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అభయహస్తమిచ్చారు. మంత్రి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అండగా నిలిచారు. నల్లగొండ జిల్లా పెద్దపూర మండలంలోని మల్లోనికుంట తండాకి చెందిన హమాలీ రమావత్ బిచ్చా దంపతులు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తెతో కలసి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఈ పేద కుటుంబాన్ని అనారోగ్యం పట్టిపీడిస్తోంది. కుమారులు రవినాయక్, బాబునాయక్, కుమార్తె లక్ష్మీ శరీరం అంతుబట్టని నరాల వ్యాధితో చచ్చుబడిపోయింది. కొద్దిరోజుల కింద తండ్రి సైతం అనారోగ్యంపాలవడంతో కుటుంబ పోషణ భారం తల్లిమీద పడింది. వైద్య ఖర్చులు లేక పూట గడవక ఈ కుటుంబం పడుతున్న వేతనను ఇటీవల కొందరు ట్విట్టర్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశం మేరకు జిల్లా వైద్యాధికారి, ఆర్డీవో, తహసీల్దార్ వెళ్లి కుటుంబాన్ని కలిశారు. వారి వైద్యానికి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తామన్నారు. కుటుంబ బాగోగులు చూస్తున్న అటెండెంట్‌కి ఉద్యోగం కల్పిస్తామన్నారు.