నెట్లింక్స్ ఎండీగా రోహిత్ లోకారెడ్డి
హైదరాబాద్: ఇంటర్నెట్ సేవల సంస్థ నెట్లింక్స్ ఎండీగా, అదనపు డెరైక్టరుగా రోహిత్ లోకారెడ్డి నియమితులయ్యారు. ప్రధానంగా ఆయన జీడీఆర్లు, ఇతరత్రా నిధుల సమీకరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితర అంశాలపై దృష్టి సారిస్తారని సంస్థ చైర్మన్ మనోహర్ లోకారెడ్డి వెల్లడించారు. మరోవైపు స్వతంత్ర అదనపు డెరైక్టర్లుగా సుబ్రహ్మణ్యేశ్వరరావు కాకరాల, కిరణ్ కాకరాల నియమితులైనట్లు నెట్లింక్స్ తెలిపింది.