new decision
-
Ugadi 2024: నూతన సంవత్సరంలో.. 2024-25 కాల నిర్ణయమిదే..
ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతాం. ఇది తెలుగువాళ్ల పండుగ. ఈ తెలుగు సంవత్సరాదిలో మన రాశి ఎలా ఉంది. ఈ ఏడాది కర్తరీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ రోజు నవనాయక ఫలితాలు ఎలా ఉంటాయి? వంటివి చూసుకుని గానీ కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెట్టారు. మరీ ఈ ఏడాది డొల్లు కర్తరీ ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే..? డొల్లు కర్తరీ ప్రారంభం.. ది.04.05.2024 ప.12:35లకు చైత్ర బహుళ ఏకాదశీ శనివారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం.. ది.05.11.2024, ఉ.10:27లకు వైశాఖ శుద్ధ చవితి శనివారం రోజు నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. కర్తరీ త్యాగం.. ది.28.05.2024 రా.7:21 వైశాఖ బహుళ పంచమి తత్కాల షష్ఠి మంగళవారం రోజు కర్తరీ త్యాగం. ‘‘మృద్దారు శిలాగహకర్మాణివర్జయేత్’’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించుటకు కర్తరీకాలము సరియగునది కాదు. పై సూత్రం ఆధారంగా వాస్తుకర్మలు నూతనంగా ఈ రోజు నుండి చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట మరియు పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, కప్పు విషయమై పని ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. రాబోవు విశ్వావసు నామ సంవత్సరం (2025–26) కర్తరీ నిర్ణయము 4 మే 2025 వైశాఖ శుద్ధ సప్తమి సుమారు సా.గం.7:00లకు డొల్లు కర్తరీ ప్రారంభం. 11 మే 2025 వైశాఖ శుద్ధ చతుర్దశీ సుమారు సా.గం.5:00లకు పెద్ద కర్తరీ ప్రారంభం. 28 మే 2025 జ్యేష్ఠ శుద్ధ విదియ రోజు సుమారు రా.గం.2:00లకు కర్తరీ త్యాగం. నవనాయక ఫలితాలు (2024– 2025) రాజు కుజుడు: కుజుడు రాజయిన సంవత్సరం అగ్నిభయం, వాయువు చేత అగ్ని రెచ్చ గొట్టబడడం, గ్రామ పట్టణాలలో తరచు అగ్ని భయములు ఉండును. వర్షములు ఉండవు. ధరలు అధికం అవుతాయి. రాజులకు యుద్ధములుండును. మంత్రి శని: వర్షపాతము తక్కువ. పంటలు తక్కువగా ఉంటాయి. సమాజంలో ఎక్కువ పాపకర్మలు ఇబ్బందులు సృష్టిస్తాయి. అన్ని వ్యవహారములు మందఫలములు ఇస్తాయి. తరచుగా సమాజంలో నిరంతరం ఆపదలు ఉంటాయి. గోవులకు ఇబ్బంది. తక్కువ స్థాయిలో ఉన్నవారు అందరూ అభివృద్ధిలోకి వస్తారు. సేనాధిపతి శని: సేనలకు రాజుకు సయోధ్య ఉండదు. ప్రజలు అధర్మ వర్తనులు అగుదురు. నల్లధాన్యములు ఫలించును. రాజులు అధర్మవర్తనులు అగుదురు. ప్రజలు పాప కర్మలు అధికం చేస్తారు. రవాణా సౌకర్యములలో యిబ్బంది ఉంటుంది. సస్యాధిపతి కుజుడు: కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రధాన్యజాతులు, ఎర్ర భూములు మంచి ఫలితాలనిస్తాయి. మెట్ట ధాన్యములు బాగా ఫలిస్తాయి. మాగాణి పంటలు, మధ్యమ ఫలితాలు యిస్తాయి. ధాన్యాధిపతి చంద్రుడు: గోవులు సమృద్ధిగా పాలు ఇచ్చును. వ్యాధులు ఉండవు. దేశము సువృష్టితో సుభిక్షంగా ఉండును. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార ధరలు సరసముగా ఉండును అని గ్రంథాంతర వచనము. అర్ఘాధిపతి శని: అర్ఘాధిపతి శని అయినచో మహాభయములు కలుగును. వర్షములు తగ్గును. రోగ, చోర, అగ్ని భయములు కలుగును. ఆహార సౌకర్యములు తగ్గును. ప్రజలలో భయము పెరుగును. పాఠాంతరంలో నల్లభూములు, నల్లధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మవస్తువులు, ఇనుము, తారు, నల్లమందు ధరలు సరసముగా ఉండును. మేఘాధిపతి శని: వర్ష ప్రతిబంధకములు ఎక్కువ. రాజులకు ధనము లోటు ఉండును. చలిబాధలు ప్రజలకు జ్వరములు, ఆహార ధాన్యం కొరత. వ్యాధులు ప్రబలును. నల్ల ధాన్యములు బాగా పండును. రసాధిపతి గురువు: గురువు రసాధిపతి అయినచో చందన, కర్పూర, కంద మూలములు సులభముగా దొరకును. కుంకుమ పువ్వు మొదలగు ఇతర రస వస్తువులు దొరకవు. అన్ని పంటలకు అనుకూల వర్షములు ఉంటుంది. వృక్షజాతులు ఫలించును. ఆరోగ్యములు బాగుంటాయి. పాఠాంతరంలో బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. నీరసాధిపతి కుజుడు: పుష్ప వృక్షములు, ఫల వృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉండును. బంగారం, మణులు, రక్తచందనము, కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి ధరలు పెరిగి నిలబడును. దానిమ్మ వంటివి బాగా ఫలించును. ఇవి చదవండి: Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..! -
ఏంటి? మీకిలా జరుగుతోందా..! బహుశా ఇందువల్లేనేమో..!!
కాలంతోపాటు సాగుతున్న మానవ జీవితంలో.. కొందరు వారు తీసుకునే నిర్ణయాలను బట్టే ఫలితాలు వస్తాయని మర్చిపోతుంటారు. చిన్న ఆపద రాగానే బెంబేలెత్తుతుంటారు. దీనికి కారణం నువ్వే అంటూ తాఫీగా ఇతరులపై తప్పును నెట్టేస్తుంటారు. అసలు కారణం ఏంటో తెలుసా..! ఆ సమయానికి, సాగుతున్న క్రమానికి, అనుసరిస్తున్న విధానాలకి సరైన పొంతన లేకపోవడమే. ప్రశాంతంగా ఆలోచించకపోవడమే. మరి వాటిని అధిగమించడానికి ఏం చేయాలో చూద్దాం. ప్రయాణ నియమాలు.. 1. ప్రయాణానికి ఇంటి దగ్గర బయల్దేరిన దగ్గర నుంచి తొమ్మిదవ రోజున తిరుగు ప్రయాణమవకూడదు. 2. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు శుభశకునాలు చూసుకోవాలి. 3. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం చేసిన తర్వాత వారశూల దోషాలు తగ్గుతాయి. 4. రాత్రి సమయాలలో చేయు ప్రయాణ విషయాలలో వారశూల పట్టింపు ఉండదు. కాని ఆడపిల్లలను పంపే విషయంలో శుక్ర, మంగళవారాల పట్టింపు ఉన్నది. 5. నూతన వితంతువును మంగళ, శుక్ర వారాల్లో చూడరాదు. ఆ రోజులలో చూడటానికి బయల్దేరడం కూడా పనికిరాదు. 6. అశుభకార్య నిమిత్తంగా ప్రయాణం చేసినట్లయితే వెంటనే తిరుగు ప్రయాణం చేయాలి లేదా దేవాలయంలో నిద్రచేసి వేరొక నిమిత్తంగా వెళ్ళవచ్చు. సాధారణ నియమములు.. "స్వగృహే ప్రాక్ఛిరాః కుర్యా శ్యాశుర్యే దక్షిణౌశిరాః ప్రత్యక్షిరాః ప్రవాసేషు నకదాచిదుదక్ఛిరాః" స్వగహమునందు తూర్పువైపున శిరస్సు, అత్తవారింట దక్షిణ శిరస్సు, ఇతరుల ఇంట పడమర శిరస్సు ఉంచి నిదురించాలి. ఉత్తర దిశలో శిరస్సు ఉంచి ఎక్కడా నిదురించకూడదు. వాస్తుశాస్త్ర రీత్యా దక్షిణ శిరస్సు కూడా విశేషమే! దోషం – శాంతి మంత్రం.. ఆరోగ్య సమస్యలు ఉన్నా, పిల్లలకు దృష్టిదోషం ఉన్నా, గర్భిణీస్త్రీలకు గర్భరక్షణ కోసం, మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నా విభూది చేతపట్టుకొని ఈ కింది శ్లోకాన్ని 41 సార్లు పారాయణ చేసి విభూది ముఖమున ధరించిన శాంతి లభించును. "శ్రీమత్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చికజలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవేనమస్తే!" పిల్లలకు మాటలు రాగానే ఈ శ్లోకం నేర్పి వారిచేత నిత్యం పారాయణ చేయిస్తే, దృష్టిదోషం, నరఘోష, భూత, ప్రేత, పిశాచ బాధలు దగ్గరకు రావు. రజస్వలకు మంచి కాలము.. అశ్వని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి ప్రథమ రజస్వలకు మంచి నక్షత్రాలు. గ్రహణకాలం సంధ్యాకాలం, వర్జ్యకాలం మంగళవారం, అమావాస్య రోజులలో అయినట్లయితే శాంతి చేయించుకొనవలెను. జన్మ నక్షత్రానికి నైధనతార రోజున రజస్వల అయినచో శాంతి అవసరం. ఇవి చదవండి: అమ్మో.. కుజదోషం! పెళ్లే అవదా? అని భయపడుతున్నారా..! -
వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
సాక్షి, విజయనగరం : సచివాలయాలకు మహర్దశ పట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటికి పెద్ద పీట వేస్తున్నారు. గ్రామాల్లోని అన్ని సేవలు సచివాలయాల ద్వారా అందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీటిలో పని చేసేందుకు కావాల్సిన సిబ్బంది నియామకం కూడా పూర్తి కావచ్చింది. అంతకుముందే సచివాలయాలకు అనుసంధానంగా పనిచేసేందుకు వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయమూ విధితమే. దీనికోసమే ఇప్పటికే ఉన్న పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చారు. లేని చోట అదనపు భవనాలను నిర్మించేందుకు రూ.25లక్షల చొప్పున విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారం.. సచివాలయాల్లో అన్ని శాఖల అధికారులు అం దుబాటులో ఉండి, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. ఆ లక్ష్యాన్ని అందుకోవడం కోసమే సీఎం జగన్ సచివాలయాలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకడుగు వేయడం లేదు. వాటికి మంచి భవనాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పంచాయతీ భవనాలు ఉన్నవాటికి అదనంగా భవనాలు నిర్మించేందుకు రూ.25 లక్షల నిధులను విడుదల చేస్తున్నారు. శిథిలావస్థలో భవనాలు ఉన్న చోట రూ.40 లక్షలతో భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారుల నుంచి భవనాల స్థితిగతులు, జియోట్యాగింగ్ వివరాలను అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. దీంతో మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా అధికారులు వివరాలను జియోట్యాగింగ్ చేయిస్తున్నారు. అయితే జిల్లాలో అదనపు భవనాలు నిర్మించాల్సిన సచివాలయాల సంఖ్య 392 ఉండగా, శిథిలాలవస్థకు చేరి కొత్త భవనాలు నిర్మించాల్సినవి 272గా ఉన్నాయి. -
అనుష్క కొత్త నిర్ణయం!
గ్లామర్‌తో యూత్‌కి కిక్ ఎక్కించిన అనుష్కకు క్షణం తీరికలేదు. లేడీ ఓరీయంటెడ్ మూవీలతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇటు టాలీవుడ్‌ని అటు కోలీవుడ్‌ని ఈ గద్వాల్ రాణి ఏలేస్తోంది. కింగ్ నాగార్జున సరసన 'సూపర్' సినిమాలో నటించి అనుష్క టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక వైపు గ్లామర్ రోల్స్‌లో నటిస్తూ మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి చేరుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్‌లో అనుష్క నటిస్తోంది. సినిమాల షూటింగ్‌ల కోసమే కాకుండా, ఆ పాత్రల కోసం రిహార్సల్స్ కోసం తెగ శ్రమిస్తూ క్షణం తీరికలేకుండా పని చేస్తోంది. టాలీవుడ్లో బాహుబలి, రుద్రమదేవి, కోలీవుడ్‌లో లింగా, అజిత్-గౌతమ్ మీనన్ సినిమాలతో అనుష్క బిజీబిజీగా ఉంది. భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో నటనకు ఆస్కారమున్న పాత్రలు, తమిళంలో గ్లామర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించాలని నిర్ణయం తీసుకుందట. తన మనసులోని మాటను దర్శకులకు, నిర్మాతలకు కూడా చెప్పేసినట్లు సమాచారం. ఇక నుంచి దర్శకనిర్మాతలు అనుష్కతో సినిమా తీయాలంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. **