New diseases
-
ప్రియుడు ఫోన్ ఎత్తలేదని.. ఈ కొత్త జబ్బు గురించి తెలుసా?
ఆమె వయసు 18 ఏళ్లు. గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉంది. ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ, ఆ ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆమె ‘లవ్ బ్రెయిన్’ బారిన పడి ఆస్పత్రిలో చేరింది. లవ్ బ్రెయిన్(Love Brain).. మెడికల్ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించని ఒక జబ్బు. అయితే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌లో ఇదొక భాగమని మాత్రం వైద్యులు గుర్తించారు. తాజాగా చైనాలో ఓ యువతి ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తద్వారా దీని గురించి చర్చ నడుస్తోంది.గ్జియాయూ(18) కాలేజీ స్టూడెంట్.గతకొంతకాలంగా తన ప్రియుడి మీదే ఆమె ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తోంది. ఎప్పుడూ తనతో కాంటాక్ట్‌లో ఉండాలని, ఆ యువకుడు తాను ఎప్పుడు.. ఎక్కడ ఉంటున్నాడనే విషయం చెబుతూ ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆ యువకుడు ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఒకరోజు వందకిపైగా ఫోన్ కాల్స్ చేసినా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆమె అతనికి పలు సందేశాలు పంపింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు ఆందోళనకు గురి చేసింది. చివరకు.. ఎలాగోలా ఆమెను నిలువరించి పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు లవ్ బ్రెయిన్ సోకిందని వైద్యులు నిర్ధారించుకున్నారు. ఎవరికి సోకుతుందంటే..ప్రేమలో, రొమాంటిక్ రిలేషన్స్‌లో ఉన్నవాళ్లు ఈ లవ్బ్రెయిన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడమే కాదు.. వాళ్ల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే లవ్ బ్రెయిన్ జబ్బులోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒకస్థాయి దాటి పోతుంటారు దీని బారిన పడ్డవాళ్లు. ఇది బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని.. చివరకు బైపోలార్ డిజార్డర్ బారినపడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కారణాలు.. లవ్ బ్రెయిన్ ఎక్కువ కేసుల ఆధారంగా.. తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు.. చిన్నతనంలో మమకారాలకు దూరమైనప్పుడు.. ఇలాంటి మానసిక సంఘర్షణకు లోను కావొచ్చని వైద్య నిపుణులు గుర్తించారు. మానసికంగా.. భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రేమ ఒక రోగం.. అందునా అతిప్రేమ కూడా ఒక రోగమనేది దీంతో తేలిపోయిందన్నమాట!. -
కెనడాలో వింత వ్యాధి కలకలం.. ఇప్పటికే 48 మంది..
గత రెండు మూడు యేళ్లుగా కోవిడ్ సృష్టించిన కల్లోలం అంతాఇంతాకాదు. ఆ భయం నుంచి ఇంకా తేరుకోకముందే మరో వింత వ్యాధి జనాల్లో వ్యాపిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా వింతగానే ఉన్నాయట.. అంతుచిక్కని ఈ వింత వ్యాధి కెనడాలో కలకలం సృష్టిస్తోంది. బ్రన్స్విక్ ప్రావిన్స్‌లో వెలుగుచూసిన ఈ సంఘటనలో ఇప్పటికే ఈ వ్యాధితో ఆరుగురు మరణించారు. కారణం తెలియని బ్రెయిన్ డిసీజ్‌తో పదుల సంఖ్యలో ప్రజలు ఆనారోగ్యబారీన పడుతున్నారు. అక్కడి ప్రాంతీయ మీడియా కథనాల ప్రకారం 48 మంది ఇప్పటికే ఈ వ్యాధి బారీన పడ్డట్టు సమాచారం. వీరంతా మతిమరుపు, తికమకపడటం వంటి వ్యాధి తాలూకు లక్షణాలతో హాస్పిటల్లలో చేరుతున్నారని తెలిసింది. ఈ గుర్తుతెలియని వ్యాధికి గల కారణాలు డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. తాజా నివేదికల ప్రకారం మరణించిన వారందరూ 18 నుంచి 85 యేళ్ల మధ్య వయసు వారు. మరణించిన వారంతా మానసిక వ్యాధితో మృతిచెందినట్టు నివేదికలో చెప్పబడింది. ఈ వ్యాధి బారీన పడ్డవారిలో ఉద్రేకం, మైకం, భ్రమలు, మతిమరుపు, కండరాల నొప్పులు అధిక స్థాయిలో పెరిగినట్టు గుర్తించారు. అక్కడి అధికారులు దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా గత యేడాది చివరిలో కూడా ఇదే తరహాలో పెద్ద సంఖ్యలో అబ్నార్మల్ న్యూరోలాజికల్ కేసులు బయటపడినట్టు పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా హెచ్చరించింది. మరణించిన వారి మృతదేహాలను పరీక్షించడం ద్వారా దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పటికే రకరకాల వ్యాధులతో విసిగివేసారిపోయిన ప్రజలు.. ఎటునుంచి ఏ కొత్త వైరస్ రూపంలో ఏ వ్యాధి వ్యాపిస్తుందో తెలియక ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకుని క్షణక్షణ గండంగా బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో మెదడుకు సంబంధించిన ఈ కొత్త వ్యాధి ప్రజల్లో భయందోళనలు రేకెత్తిస్తోంది. చదవండి: ఈ హెర్బల్ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా.. -
భవిష్యత్‌లో మరిన్ని వైరస్లు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల నుంచి మనుషులకు కొత్త వ్యాధులు, వైరస్లు సోకే ప్రమాదం గతంలోకంటే ఎన్నో రెట్లు పెరిగిందని, ఈ సమస్యపై సత్వరం అవసరమైన జాగ్రత్తలు చేపట్టకపోతే భవిష్యత్‌లో తీవ్ర నష్టం తప్పదని ‘కోవిడ్–19: అర్జంట్ కాల్ టు ప్రొటెక్ట్ పీపుల్ అండ్ నేచర్’తాజా నివేదికలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇంటర్నేషనల్ వెల్లడించింది. ‘వైరస్‌లతో ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, భద్రతకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని, వన్యప్రాణులకు నష్టం చేయడాన్ని తక్షణం ఆపకపోతే భవిష్యత్‌లో మరిన్ని ప్రాణాంతక, ప్రమాదకరమైన వ్యాధులు, వైరస్లు వ్యాప్తి చెంది మానవాళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. 1990 దశకం నుంచి మనుషుల్లో బయటపడిన 60–70 శాతం కొత్త వ్యాధులు వన్యప్రాణుల నుంచే వచ్చాయి. ఇదే కాలంలో ›ప్రపంచవ్యాప్తంగా 178 మిలియన్ హెక్టార్ల అడవి కనుమరుగైపోయింది. దీనిని బట్టి ఈ రెండింటి మధ్య సంబంధాలు ఏమిటనేది స్పష్టమవుతోంది’అని నివేదికలో ప్రచురించారు. ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు, వైరస్లు–చేపట్టాల్సిన కార్యాచరణపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు. ఆర్థికాభివృద్ధి–పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యం ‘ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధి–పర్యావరణ పరిరక్షణ రెండింటికి తప్పనిసరిగా సమాన ప్రాధాన్యతనివ్వాలి. జంతువుల నుంచి సోకే వ్యాధులు, వ్యాపించే వైరస్ల పట్ల భారత్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వన్యప్రాణులు, జంతువుల్లో అనేక రకాల వైరస్లున్నాయని, వాటి నుంచే మనుషులకు ఆయా వైరస్లు, వ్యాధులు సోకుతున్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్లు జంతువుల శరీరంలోనే ఉంటే నష్టం లేదు. కానీ వన్యప్రాణులు, జంతువులను చంపి వాటి ఆహారాన్ని తినడం, అవి ఉంటున్న ప్రాంతాల్లోకి వెళ్లడం ద్వారా వివిధ రకాల వైరస్లు మనుషులకు సోకే అవకాశాలు పెరిగాయి. వన్యప్రాణులకు మనుషులు ఆహారం పెట్టడం మానుకోవాలి. అవి సొంతంగా ఆహారం సంపాదించుకోగలుగుతాయి. హైదరాబాద్‌లో పెద్దమొత్తంలో పావురాలకు గింజలు దాణాగా వేయడం వల్ల వాటి జనాభా గణనీయంగా పెరిగిపోయి నగరవాసుల్లో శ్వాసకోశ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి’ –డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ జీవ వైవిధ్యమే కీలకం ‘మనుషులు, ప్రకృతి, పర్యావరణం ఒకదానికి ఒకటి సహకరించుకుంటేనే రాబోయే రోజుల్లో తీవ్రమైన సమస్యల బారిన పడకుండా రక్షించుకోగలుగుతాం. ఏ జంతువు శరీరతత్వం ఏమిటి? దాని మాంసం తినొచ్చా లేదా అన్నది తెలుసుకోకుండానే విచక్షణా రహితంగా అన్నింటినీ తినడం ఏమాత్రం మంచిది కాదు. వన్యప్రాణుల నుంచి మనుషులకు వ్యాధులు వ్యాప్తి చెందడం చాలా ప్రమాదకరం. కోవిడ్ వ్యాప్తి ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. అందువల్ల ఆహార అలవాట్లను మార్చుకుని సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముంది. ఒక చెట్టు, జంతువు లేదా పక్షి జాతి అంతరిస్తే దాని ప్రభావం చుట్టుపక్కల ఉన్న జాతులపైనా పడుతుంది. ఈ అంశాలన్నింటినీ గ్రహించి పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు ముందుకు కదలాలి’ – వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ -
మారిన వాతావరణం..వణికిస్తున్న వ్యాధులు
-
హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతుండాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్... ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మారుతున్న జీవనశైలి, పని వేళలు, కాలుష్యం తదితర అంశాల వల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అనారోగ్యం సంభవించినప్పుడు దానికయ్యే ఖర్చుల నుంచి రక్షణ పొందటానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాలసీలు మనకు ఆర్థికంగా బాసటగా నిలుస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటపుడు మన మదిలో మెదిలే తొలి ప్రశ్న.. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? దీనికి సమాధానం ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీని రూ.10 లక్షలకు తీసుకుంటే మంచిది. వార్షిక ఆదాయానికి సమాన మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. కెరీర్ ప్రారంభమైన తొలినాళ్లలో వ్యక్తిగత పాలసీ తీసుకోండి. అటుపై పెళ్లైన తర్వాత ఇద్దరికీ గానూ ఫ్లోటర్ పాలసీని తీసుకోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల బీమా కంపెనీలు పలు రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. మీ అవసరాలకు అనువైన ఒక పాలసీని ఎంపిక చేసుకోండి. పాలసీ ఎంపికలో బీమా కంపెనీ పనితీరు, సేవలు, పాలసీ వివరాలు, ప్రీమియం వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవడం మరువద్దు.