new evms
-
కసరత్తు షురూ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసన సభ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ముసాయిదా ఓటరు జాబితా విడుదలకు కసరత్తు చేస్తూనే.. మరోవైపు జిల్లాలోని ఈవీఎం పరిశీలనతోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఈ క్రమంలో వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన విధుల్లో నిమగ్నమయ్యారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఓటరు జాబితా ముసాయిదా ప్రకటన కోసం అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతుండగా.. రాష్ట్ర శాసన సభ రద్దు కావడం.. ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుండటంతో ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి సిద్ధంగా ఉండేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల పనుల తీరుపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సాగుతోంది. ఇది వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. అదేరోజు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనున్నారు. అనంతరం 8వ తేదీన పూర్తిస్థాయి ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఇతర పనులను కూడా అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో ఎఫ్ఎల్సీ.. త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు చేరాయి. వీటిని కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాం లో భద్రపరిచారు. ఇక్కడ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. గత నాలుగు రోజుల క్రితం జిల్లాకు చేరిన ఈవీ ఎంలు, వీవీ ప్యాట్లను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో కలిసి కలెక్టర్ ఈవీఎంలను ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) చేశారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులకు ఈవీఎంల పనితీరుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు గురించి వివరించారు. అలాగే తమ ఓటు ఎవరికి వేశామనే విషయా న్ని తెలుసుకునేందుకు వీవీ ప్యాట్లు కూడా ఉంటాయ ని పార్టీల నాయకులకు వివరించారు. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ స్వయంగా గోదాం వద్దకు వచ్చి ఈవీఎంలను పరిశీలించారు. అలాగే జాయింట్ కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా అక్కడే ఉండి.. ఈవీఎంలు, వీవీ ప్యాట్ వద్ద అధికారులు చేస్తున్న పనిని పరిశీలిస్తున్నారు. అమలులోకి నియమావళి.. జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీనిని తూచ తప్పకుండా అధికారులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ పార్టీల నాయకులు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలను అధికార యంత్రాంగం తొలగిస్తోంది. తాజాగా ఖమ్మం నగరం, కొణిజర్ల, వైరా, ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులను తొలగించారు. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించారు సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అమలులోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఇప్పటి నుంచే అమలు చేసేందుకు జిల్లా అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం ముఠాపురం, ముజ్జుగూడెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో మంత్రి పర్యటన రద్దయినట్లు సమాచారం. దీంతో ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదే రీతిన జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని.. నియమావళికి అనుగుణంగా వ్యవహరించని వారికి సంబంధించి తక్షణమే సమాచారం అందించాలని నియోజకవర్గ, మండలస్థాయి అధికారులకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. -
కొత్త ఈవీఎంలొచ్చాయ్..
సాక్షి ప్రతినిధి నిజామాబాద్: ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలుండటంతో జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు చక చక ఏర్పాట్లు చేస్తోంది. కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను చేపట్టిన ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణకు అవసరమైన చర్యలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లాకు ఆదివారం కొత్త ఈవీఎంలు వచ్చాయి. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నుంచి 1,890 వీవీ ప్యాట్లు, 1,750 కంట్రోల్ యూనిట్లు, 2,240 బ్యాలెట్ యూనిట్లు జిల్లా కేంద్రంలోని ఎన్నికల సంఘం గోదాముకు చేరుకున్నాయి. వీటిని అధికారులు సరిచూసుకుని గోదాముల్లో భద్రపరిచారు. పోలీసుశాఖ ఇక్కడ భద్రతను మరింత పెంచింది. కొత్తగా వచ్చిన ఈవీఎంలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రామ్మోహన్రావు పరిశీలించారు. పొలింగ్‌లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు ఎన్నికల సంఘం ఈసారి వీవీ పీఏటీ (ఓటరు వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) యూనిట్లను సపోర్టు చేయగల ఈవీఎంలను వినియోగించాలని నిర్ణయించిన విషయం విదితమే. జిల్లాలో ఉన్న పాత ఈవీఎంలు వీవీ ప్యాట్లకు సపోర్టు చేయవు. దీంతో పాత ఈవీఎంల స్థానంలో వీవీప్యాట్ యూనిట్లకు సపోర్టు చేయగల అప్డేటెడ్ ఈవీఎంలను వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లాలో ఉన్న పాత ఈవీఎంలను హైదరాబాద్‌లోని ఈసీఐఎల్, బెంగళూరులోని బీఈఎల్ సంస్థలకు పంపాలని రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి ఆదేశాలందాయి. దీంతో గత ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల పోలింగ్ కోసం వి నియోగించిన 20,826 పాత ఈవీఎంలను ఈసీఐఎల్, బీఈఎల్‌లకు పంపుతున్నారు. ఇటీవల 3,400 పాత ఈవీఎంలను ఆయా సంస్థలకు పం పారు. మిగిలినవి కూడా విడతల వారీగా పంపనున్నారు. వీటి స్థానంలో వీవీ ప్యాట్ యూనిట్లు సపోర్టు చేయగల అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పిస్తున్నారు. తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,142 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చే యాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఎన్నికలకు అ వసరమైన యూనిట్లు సమకూర్చుకుంటున్నారు. ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు: కలెక్టర్ ఓటరు జాబితాలో పేరు లేని వారు పేరు నమోదు చేసుకునేందుకు కేవలం రెండు రోజులే గడువు ఉందని, 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రామ్మోహన్రావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు ద్వారానే మంచి అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే, ఇప్పటికే ఓటరు కార్డు ఉన్నవారు జాబితాలో తమ పేరును సరిచూసుకోవాలని, నివాస ప్రాంతం, చిరునామా, నియోజక వర్గాలు వంటి వాటిల్లో ఏమైనా మార్పులుంటే సరిచేయించుకోవాలని తెలిపారు. మరణించిన వారు, డూప్లికేట్ పేర్లుంటే తొలగించుకోవాలని కోరారు. ఓటర్ల వివరాలను ఠీఠీఠీ. nఠిటp. జీn వెబ్సైట్లో సరిచేసుకోవాలని సూచించారు. -
నిఘా నీడన ఈవీఎంలు
‘ముందస్తు’ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లలో వేగం పెంచింది. ఎన్నికల్లో కీలక భూమిక పోషించే ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలు జిల్లాకు చేరాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల నిర్వహణ మొదలు ఈవీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించింది. బెంగళూర్ నుంచి జిల్లా కేంద్రానికి చేరిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంలో సీసీ కెమెరాల నిఘా, పోలీసు బందోబస్తు నడుమ భద్రపరిచారు. కరీంనగర్‌సిటీ: జిల్లా వ్యాప్తంగా 1,142 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే.. బెంగళూర్ నుంచి 1,430 కంట్రోల్ యూనిట్లు, 1,830 బ్యాలెట్ యూనిట్లు, 1,540 వీవీ ప్యాట్ పరికరాలు జిల్లాకొచ్చాయి. పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే ఇవి అదనం. సాంకేతిక సమస్యలు వస్తే అదనపు పరికరాలను వినియోగించనున్నారు. జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాలలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు వీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే గోదాముల్లో నిల్వ ఉన్న ఈవీఎంలను హైదరాబాద్‌లోని ఈసీఎల్ కంపెనీకి తరలించారు. 13,221 బీయూలు, 8,631 సీయూలను తరలించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులతోపాటు 18 ఏళ్లు నిండిన వారి పేర్లను జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణపై దృష్టి సారించింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల పెంపు, అవసరమున్న చోట కుదింపు, ప్రాంతాల మార్పు వంటి ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద గల పరిస్థితులు, బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం రెవెన్యూ, పోలీసులతో కలిసి సంయుక్తంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎం గోదాం వద్ద 24 గంటల నిరంతర భద్రతకు ప్రత్యేకంగా సాయుధ పోలీసులను మోహరించారు. ఈవీఎం గోదాం చుట్టూ ప్రత్యేక రక్షణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ పనితీరుపై అవగాహన ఈవీఎంల పనితీరుపై వివిధ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఈవీఎంలకు అనుసంధానంగా వీవీ ప్యాట్ యంత్రాలు (ఓటు నిర్ధారణ) ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ ఓటు ఏ గుర్తుపై పడిందో తెలుసుకునే అవకాశముంది. అయితే.. రశీదులు మాత్రం ఎన్నికల సిబ్బంది తీసుకునే అవకాశముంది. చివరగా ఈవీఎంలో వేసిన ఓటు కంట్రోల్ యూనిట్‌తోపాటు వీవీ ప్యాట్లలో వచ్చిన రశీదుల సంఖ్యను చూపనున్నారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలకు వీవీ ప్యాట్ సౌకర్యం లేదు. వీవీ ప్యాట్ ఉన్న ఈవీఎంలను వచ్చే ఎన్నికల్లో వినియోగించనున్నారు. జిల్లాకు వచ్చిన ఈవీఎంల గుర్తింపు సంఖ్యను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఆన్లైన్లో నమోదు అనంతరం అవి పనిచేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అనంతరం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరును వివరిస్తారు. పట్టణ, గ్రామాల్లోనూ ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అవగాహన కల్పించనున్నారు. స్వయంగా యంత్రాలలో ఓటు వేసి చూపించనున్నారు. కొత్త ఈవీఎంలు రావడంతో వీటి పనితీరు వినియోగంపై బెల్ కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ సిబ్బంది జిల్లా అధికారుల సమక్షంలో ఫస్ట్‌లెవల్ చెకింగ్ చేపట్టనున్నారు. అక్టోబర్ 1న సిబ్బంది జిల్లాకు రానున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారి సమక్షంలోనే రాజకీయ ప్రతినిధులకు వాటి పనితీరుపై స్వయంగా ఓటు వేసి చూపుతూ అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే వీవీప్యాట్ల పనితీరుపై జిల్లాలో మొదట జ్యూడీషియల్ అధికారులు, పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. మలిదశలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు. నియోజకవర్గాల వారీగా నెల రోజుల పాటు ఓటర్లకు అవగాహన కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 9 సీసీ కెమెరాల ఏర్పాటు జిల్లాకు చేరుకున్న ఈవీఎంలను కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంలో భద్రపరిచారు. గోదాం చుట్టూ ప్రత్యేక రక్షణ కల్పించారు. 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈవీఎంల పర్యవేక్షణకు మెప్మా పీడీ పవన్‌కుమార్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అక్కడ 24 గంటల నిరంతర భద్రతకు ప్రత్యేకంగా సాయుధ పోలీసులను మోహరించారు. గోదాములోకి వెళ్లే ప్రతీ ఒక్కరిని మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. సాయుధ బలగాల రక్షణలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎన్నికలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈవీఎంలు నిల్వ చేసిన గోదాము వద్ద పోలీస్, రెవెన్యూ శాఖలు లాగ్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ లాగ్ పుస్తకంలో వివరాలు రాసి సంతకం చేయాల్సి ఉంటుంది. పేరు, హోదా, ఎందుకు వచ్చారు? ఏం పనిచేశారు? ఏ సమయంలో వచ్చి ఏ సమయంలో వెళ్లారు? అనే వివరాలు నమోదు చేస్తున్నారు. ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్ ఈవీఎం గోదామును శనివారం సాయంత్రం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తనిఖీ చేశారు. జిల్లాకు బెంగళూర్ నుంచి ఈవీఎంలు వచ్చాయని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల పనితీరు పరిశీలించేందుకు గోదాములలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై రాజకీయ పార్టీలకు పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. రాజకీయ పార్టీలకు ఈవీఎంల అవగాహన కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ చేయించాలని అధికార్లను ఆదేశించారు. ఆయన వెంట డీఆర్వో బిక్షూనాయక్, మెప్మా పీడీ పవన్‌కుమార్ ఉన్నారు. -
ఈవీఎం ఎక్చేంజ్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మ రం చేసింది. ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అధికారులు.. ఇప్పు డు ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లపైనా దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న పాత ఈవీఎంల స్థానంలో కొత్తవాటిని తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పుడున్న ఈవీఎంల టెక్నాలజీ వీవీపీఏటీ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రాయల్)కి సపోర్టు చేయదు. దీంతో వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేసేలా అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసీఐఎల్, బీఈఎల్‌లకు 3,400 ఈవీంలు ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సంఘం ప్రత్యేక గోదాములు నిజామాబాద్‌లో ఉన్నాయి. గత ఎ న్నికల్లో పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎం లను ఇందులో భద్రపరిచారు. మొత్తం 20,826 ఈవీఎంలు ఉన్నాయి. వీటిలో కొన్ని హైదరాబాద్‌కు చెందిన ఈసీఐఎల్ సంస్థ తయారు చేసినవి కాగా, మరికొన్ని బెంగుళురులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేయని వీటి స్థానంలో వీవీపీఏటీ యూనిట్లకు అనుసంధానించేలా అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 3,400 ఈవీఎంలను ఆయా సంస్థలకు పంపారు. మిగిలినవి కూడా విడతల వారీగా పంపుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాలకు వీవీపీఏటీ యూనిట్లు సపోర్టు చేయగల అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పిస్తున్నారు.ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 2,142 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వీటికి అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో.. ఈవీఎంలో ఏ గుర్తు మీట నొక్కినా ఒకే అభ్యర్థికి ఓటు పడుతుందనే అపోహ.. ఈవీఎంల పనితీరుపై పలు రాజకీయ పార్టీల అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సం ఘం ఈ ఎన్నికల్లో వీవీపీఏటీ యూనిట్లను వినియోగించాలని నిర్ణయించింది. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారనేది ఈ వీవీపీఏటీ యూనిట్లలో నిక్షిప్తం అవుతుంది. ఓటరుకు తన ఓటు ఏ గుర్తుకు వేశామనేది ఈ యూ నిట్‌లో కనిపిస్తుంది. ఓటు వేసిన అనంతరం 7 సెకన్ల వరకు ఈ సమాచారం ఓటరు అం దుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే పోలింగ్ అధి కారులను అడిగి కూడా తన ఓటు ఏ గుర్తుకు పడిందనేది ఈ యూనిట్ల ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఆయా వీవీపీఏటీ యూనిట్లలో పోలింగ్‌కు సంబంధించిన సమాచారం ఐదేళ్ల వరకు నిక్షిప్తంగా ఉం టుందని అధికారులు పేర్కొంటున్నారు. -
వచ్చే ఎన్నికలకు 16 లక్షల కొత్త ఈవీఎంలు
దాదాపు రెండేళ్ల తర్వాత.. 2019 సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం పేపర్ ట్రయల్‌తో కూడిన 16 లక్షల కొత్త ఈవీఎంలు సిద్ధం అవుతున్నాయి. వీటి కొనుగోలు కోసం కేంద్ర మంత్రివర్గం రూ. 3వేల కోట్లను మంజూరుచేసింది. 2018 సెప్టెంబర్ నాటికల్లా కొత్త ఈవీఎంలను సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. వాటిని బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ సంస్థలు తయారుచేస్తాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు తగినంత ముందుగానే వీవీపాట్లను సిద్ధం చేయాలని, వీటి ఉత్పత్తిని కమిషన్ చాలా జాగ్రత్తగా గమనిస్తుందని ఈసీ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఈవీఎం వద్ద వీవీపాట్లు ఏర్పాటుచేస్తామని వివరించాయి. పేపర్ ట్రయల్ లేకుండా ఈవీఎంలను ఉపయోగించడం వల్ల ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ వద్ద మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 16 పార్టీలు ఈసీ వద్దకు వెళ్లి.. పారదర్శకత ఉండాలంటే పేపర్ బ్యాలెట్ పద్ధతిని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరాయి. వీవీపాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) మిషన్లను ఏర్పాటుచేయాలని 2013లోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకు కనీసం 11 సార్లు ప్రభుత్వాలకు నిధులివ్వాల్సిందిగా కూడా తెలిపింది. ఎట్టకేలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు ఈ మిషన్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేసింది. మిషన్ ఎలా పనిచేస్తుంది వీవీపాట్ మిషన్ ఉన్నప్పుడు.. ఈవీఎంలో ఎవరికి ఓటేశామో తెలియజేసేలా ఒక కాగితం స్లిప్ వస్తుంది. అది ఏడు సెకండ్ల పాటు ఓటర్లకు కనిపించి, ఆ తర్వాత ఒక బాక్సులో పడిపోతుంది. అంటే ఓటర్లు తాము ఎవరికి ఓటేశామో వారికే పడిందో లేదో చూసుకోవచ్చు గానీ.. ఆ స్లిప్‌ను బయటకు తీసుకెళ్లడానికి మాత్రం కుదరదన్న మాట.