new mexico desert
-
ఈ వాతావరణంలో చెట్టుచేమలకే తావులేదు. కానీ ఈ అద్భుతం అక్కడిదే..!
సాధారణంగా వసంత సంరంభమంతా చెట్లు చేమలు ఉన్న చోటనే కనిపిస్తుంది. ఎడారుల్లో వసంతరాగం దాదాపుగా వింతే! వసంతకాలంలో ఎడారిలో పూలు పూసిన దృశ్యం కనిపిస్తే ‘ఎడారిలోన పూలు పూచెనెంత సందడి’ అను పాడుకోక తప్పదు. ఈ పొటోలు అమెరికా న్యూమెక్సికోలోని ‘వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్’ ప్రాంతంలో తీసినవి. వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్ ప్రాంతం అంతటా దాదాపు 590 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎటు చూసినా తెల్లని ఇసుక తిన్నెలే కనిపిస్తాయి. ఇది ఎడారి. ఇక్కడ ఏడాది పొడవునా ఎండలు భగభగలాడుతుంటాయి. ఇక్కడి వాతావరణంలో చెట్టుచేమలు పెరగడమే అరుదు. అలాంటిది అక్కడ మొక్కలకు పూలు పూయడమంటే, ఊహాతీతమైన సంగతే! ఈ ఎడారిలోని ఇసుక జిప్సమ్ స్ఫటికాల రేణువులతో నిండి ఉండటంతో చాలా తెల్లగా కనిపిస్తుంది. ఈ ఇసుక తిన్నెలు ముప్పయి నుంచి అరవై అడుగుల ఎత్తులో చిన్న కొండల్లా కనిపిస్తాయి. ఈ ఎడారిలో చాలా అరుదుగా అప్పుడప్పుడు మొక్కలు మొలుస్తుంటాయి. ఇంకా అరుదుగా వసంతంలో అవి పూలు పూస్తుంటాయి. ఇటీవల అలాంటి అరుదైన దృశ్యమే ఈ ఎడారిలో కెమెరాకు చిక్కింది. ఇవి చదవండి: ఈ తవ్వకాల్లో ఏం దొరికాయో తెలుసా..!? -
కొడుక్కి నీళ్లిచ్చి.. ప్రాణాలొదిలిన అమ్మ, నాన్న
వాళ్లంతా ఎడారిలో చిక్కుకుపోయారు. విపరీతమైన దాహం.. వాళ్ల దగ్గర నీళ్ల బాటిళ్లు కొద్దిగానే ఉన్నాయి. భార్య, భర్త, కొడుకు.. ముగ్గురూ ఉన్నారు. దాంతో, ఆ తల్లిదండ్రులు తమ కొడుకు కోసం త్యాగం చేశారు. తమ దాహాన్ని పక్కన పెట్టి.. కన్న కొడుకుకు నీళ్లిచ్చి.. అతడి ప్రాణాన్ని నిలబెట్టారు. చివరకు తాము ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదఘటన న్యూ మెక్సికో ప్రాంతంలో జరిగింది. వాళ్ల మృతదేహాలను స్వస్థలమైన ఫ్రాన్సుకు తరలించారు. ఎంజో అనే తొమ్మిదేళ్ల ఆ పిల్లాడు ప్యారిస్‌లోని చార్లెస్ డిగాల్ విమానాశ్రయంలో తన నాయనమ్మతో కలిసి దిగాడు. న్యూమెక్సికో ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లిన ఆ కుటుంబంలో తండ్రి శవం దగ్గర ఒళ్లు బాగా డీహైడ్రేట్ అయిపోయిన స్థితిలో ఎంజో కనిపించాడు. అయితే అతడిలో కొంతమేర స్పందనలు కనిపించడంతో అధికారులు వెంటనే అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు. ఆ దేహాలకు సమీపంలో అరలీటరు చొప్పున ఉన్న వాటర్ బాటిళ్లు పడి ఉన్నాయి. తల్లిదండ్రులిద్దరూ ఒక బాటిల్ నీళ్లు తాగితే.. కొడుక్కు మాత్రం రెండు బాటిళ్లు ఇచ్చేవారని తెలిసింది. చిన్నవాడు కావడంతో ఆ కొద్దిపాటి నీళ్లు అతడికి సరిపోయాయని, కానీ వాళ్లిద్దరూ దాహార్తి తట్టుకోలేక మరణించారని అధికారులు చెప్పారు.