New programs
-
SBI: కస్టమర్లకు మరిన్ని సేవలే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురష్కరించుకుని తన కస్టమర్లకు సేవలను మరింత విస్తృతం చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పదకొండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు వివరించింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లను మెరుగుపరచడం, తన వ్యవసాయ రుణ పోర్ట్‌ఫోలియోలో నష్టాలను తగ్గిండానికి 35 కొత్త వ్యవసాయ కేంద్రీకృత ప్రాసెసింగ్ సెల్‌లను ప్రారంభించడం ఇందులో ఉన్నాయి. కస్టమర్ల బ్యాంకింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడానికి, సేవల విస్తృతికి ఈ 11 చొరవలు దోహదపడతాయని బ్యాంక్ ప్రకటన ఒకటి పేర్కొంది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. → తన డిజిటల్ చెల్లింపుల సౌలభ్యతను గణనీయంగా మెరుగుపరచుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. బీహెచ్ఐఎం ఎస్బీఐ పే యాప్‌లో ట్యాప్–అండ్–పే, అలాగే యోనో యాప్‌లో మ్యూచువల్ ఫండ్స్‌పై ఎండ్–టు–ఎండ్ (పూర్తిస్థాయి) డిజిటల్ లోన్లు వంటి రెండు అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొంది. → ఎస్బీఐ సూర్య ఘర్ లోన్ విషయంలో పూర్తి డిజిటలైజేషన్ మరో కీలకమైన చొరవగా బ్యాంక్ వివరించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్‌లను ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారులు రుణాలను పొందవచ్చని పేర్కొంది. 10 కేవీ సామర్థ్యం వరకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి. ఎంఎన్ఆర్ఈ/ఆర్ఈసీ పోర్టల్‌లో దరఖాస్తుదారుల నమోదు నుండి లోన్ పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ ఎస్బీఐ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపింది. → దేశం వృద్ధి చక్రాన్ని రూపొందించడంలో భారతీయ ప్రవాసుల గణనీయమైన సహకారాన్ని గుర్తించిన బ్యాంక్... పంజాబ్‌లోని పాటియాలాలో రెండవ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంటర్ (జీఎన్సీ) ప్రారంభించింది. ఎన్ఆర్ఐ ఖాతాదారుల కు సేవలను మెరుగుపరచడానికి బ్యాంక్ డే రోజున పాటియాలాలో ఈ రెండవ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంటర్‌ను చైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. ఈ సెంటర్లు గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీతో బ్యాంక్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయి. ఎక్సలెన్స్ హబ్‌లుగా పనిచేస్తాయి. ఎన్ఆర్ఐ కస్టమర్లకు ప్రత్యేక సేవలను అందిస్తాయి. భారతదేశంలో 434 ప్రత్యేక ఎన్ఆర్ఐ శాఖల నెట్వర్క్, 29 దేశాలలో విదేశీ కార్యాలయాలు, జీసీసీ ఆరు దేశాలలో (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్– బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 45 ఎక్సే్ఛంజ్ హౌస్‌లు, 5 బ్యాంకులతో భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎన్ఆర్ఐ ఖాతాదారులకు సమగ్ర సేవలను అందించడానికి బ్యాంక్ సన్నద్దమైంది. → న్యాయవాదుల కోసం సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో పూర్తి సదుపాయాలతో కూడిన హైకోర్టు శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. న్యాయవాదులు, న్యాయ నిపుణుల అవసరాలను ప్రత్యేకంగా తీర్చడానికి ఈ శాఖలు దోహదపడతాయి. → గృహ రుణాలకు సంబంధించిన ప్రాసెస్ మరింత పారదర్శకం కానుంది. గృహ రుణ గ్రహీతలు ఇప్పుడు వివిధ ప్రాసెసింగ్ దశల్లో వారి రుణ దరఖాస్తు స్థితికి సంబంధించి ఆటోమేటెడ్ ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు అందుకుంటారు. → వినియోగదారు పూర్తి సంతృప్తి, సౌలభ్యత లక్ష్యంగా ఆధునికీకరించిన ఈ నూతన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు బ్యాంక్ వివరించింది. -
US midterm elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రిపబ్లికన్లు 218 సీట్లు, అధికార డెమొక్రాట్లు 211 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్షం మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. బైడెన్ నిర్ణయాలు, చర్యలను ప్రతిపక్షం నిలువరించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభలో రిపబ్లికన్ పార్టీ బలం పుంజుకోవడంతో అధ్యక్షుడి దూకుడుకి అడ్డుకట్ట పడనుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ప్రతినిధుల సభ స్పీకర్‌గా రిపబ్లికన్లు తమ నాయకుడు కెవిన్ మెక్కర్తీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ ఉన్నారు. కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని, రిపబ్లికన్లు వారిని ముందుకు నడిపించబోతున్నారని మెక్‌కర్తీ ట్వీట్ చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన మెక్కర్తీకి ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఉద్ఘాటించారు. రా బోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెనేట్‌పై డెమొక్రాట్ల పట్టు మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని చెప్పారు. ధరలు, జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. జనం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్‌లోని మరో సభ అయిన సెనేట్‌లో అధికార డెమొక్రాట్లు పట్టు నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 100 స్థానాలకు గాను, వారు ఇప్పటిదాకా 50 స్థానాలు దక్కించుకున్నారు. జార్జియా రాష్ట్రం కూడా వారి ఖాతాలో పడనుంది. దీంతో సెనేట్‌లో మెజారిటీ సాధించబోతున్నారు. -
ఆధ్యాత్మిక సంపద మన సొంతం
తిరుపతి సిటీ : భారతీయులుగా మనకున్న ఆధ్యాత్మిక, ధార్మిక సంపద ప్రపంచంలో ఏ దేశానికీ లేదని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎంజీ.గోపాల్ ఉద్ఘాటించారు. శుక్రవారం ఉదయం స్థానిక టీటీడీ పరిపాలన భవనం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం పరేడ్ ఇన్చార్జి కూర్మారావు నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల మీద ప్రమాణం చేసి న్యాయస్థానాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటే భారతీయుల ఆధ్యాత్మిక సంపద ఎంత ప్రాశస్త్యమైందో అర్థమౌతుందున్నారు. శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులకు, అంకిత భావంతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రానున్న ఏడాది కాలంలో నూతనంగా అమలు చేయనున్న వాటిని వివరించారు. చేపట్టనున్న నూతన కార్యక్రమాలు.. శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా 18 వేల రూ.300 శీఘ్రదర్శన టికెట్లను ఈ-దర్శన్, ఇంటర్నెట్ ద్వారా కేటాయింపు. తిరుమలలో రూ.50 కోట్లతో సువిశాలమైన కారు పార్కింగ్ ఏర్పాటు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్మెంట్లలో 108 అంగుళాల ప్లాస్మా టీవీలు, భక్తుల భద్రతను పటిష్ట పరిచేందుకు 2 వేల సీసీ కెమెరాల ఏర్పాటు. తిరుచానూరులో నూతన అన్నదాన భవనం, యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం. శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో రూ.70 కోట్ల వ్యయంతో ప్రత్యేక వసతి సముదాయం. దేశవాళీ గోజాతిని అభివృద్ధి పరిచేందుకు పలమనేరు వద్ద 450 ఎకరాల్లో థీమ్‌పార్క్ ఏర్పాటు. ఆకట్టుకున్న విన్యాసాలు.. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో పరేడ్‌లో నిర్వహించిన కవాతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు చేపట్టిన గుర్రపుస్వారీ, టీటీడీ డాగ్ స్క్వాడ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన డాగ్‌షో విశేషంగా ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులు, అధికారులకు ఈవో ఎంజీ గోపాల్ వెండి డాలర్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డీఎల్వో నాగార్జున, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖరరెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఇతర విభాగాధిపతులు, ఉగ్యోగులు పాల్గొన్నారు. -
ఇక ‘డ్రైవర్ కమ్ ఓనర్’
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు కొత్త కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ మరో కొత్త పథకాన్ని అతిత్వరలో లాంఛనంగా ప్రారంభించనుంది. ‘డ్రైవర్ కమ్ ఓనర్’ (డీసీఓ)అనే పథకం ద్వారా 105 మంది లెసైన్సు కలిగిన డ్రైవర్లకు బ్యాంకు సహకారంతో కొత్త కార్లను అందజేయనుంది. ఈ పథకంలోని లబ్ధిదారులు తమ వాహనాలను జీహెచ్ఎంసీ అధికారులకే హయ్యర్పై నడపనున్నారు. తద్వారా వారికి ఉపాధితోపాటు, బ్యాంకు రుణం తీరిపోగానే కార్లు వారి సొంతం కానున్నాయి. ఇప్పటి వరకు ట్యాక్సీలకు డ్రైవర్లుగా పనిచేస్తున్నవారికి.. సొంత వాహనం కొనుక్కోలేక అద్దెకార్లకే డ్రైవర్లుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగనుంది. తద్వారా డ్రైవర్లే కార్ల ఓనర్లు కానున్నారు. ఇదీ విధానం.. దాదాపు రూ. 7 లక్షల విలువైన కార్లను బ్యాంకు రుణం ద్వారా ఇప్పిస్తున్నారు. మొత్తం వ్యయంలో లబ్ధిదారు వాటాగా 25 శాతం చెల్లించాల్సి ఉంది. మిగతా 75 శాతం సొమ్మును జీహెచ్ఎంసీ ఎస్బీహెచ్ నుంచి బ్యాంకు రుణంగా ఇప్పిస్తుంది. ఎస్సీ/ఎస్టీలకు చెందిన వారైతే కేవలం 10 శాతం లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. మిగతా 90 శాతం సొమ్మును జీహెచ్ఎంసీ బ్యాంకు రుణంగా ఇప్పిస్తుంది. నెలనెలా వాయిదాల పద్ధతిలో బ్యాంకు రుణం తీర్చాల్సి ఉంది. కాగా బడుగు బలహీనవర్గాలకు చెందిన వారికి పరిశ్రమలశాఖ ద్వారా సబ్సిడీ ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇలా 105 మందికి కొత్త కార్లు ఇప్పించే ప్రక్రియ పూర్తయిందని, త్వరలో (పంధ్రాగస్టులోగా) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. -
ఇక ‘డ్రైవర్ కమ్ ఓనర్’
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నూతన పథకం త్వరలో ప్రారంభించనున్న సీఎం సాక్షి,సిటీబ్యూరో: ఇప్పటికే పలు కొత్త కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ మరో కొత్త పథకాన్ని అతిత్వరలో లాంఛనంగా ప్రారంభించనుంది. ‘డ్రైవర్ కమ్ ఓనర్’ (డీసీఓ)అనే పథకం ద్వారా 105 మంది లెసైన్సు కలిగిన డ్రైవర్లకు బ్యాంకు సహకారంతో కొత్త కార్లను అందజేయనుంది. ఈ పథకంలోని లబ్ధిదారులు తమ వాహనాలను జీహెచ్ఎంసీ అధికారులకే హయ్యర్పై నడపనున్నారు. తద్వారా వారికి ఉపాధితోపాటు, బ్యాంకు రుణం తీరిపోగానే కార్లు వారి సొంతం కానున్నాయి. ఇప్పటి వరకు ట్యాక్సీలకు డ్రైవర్లుగా పనిచేస్తున్నవారికి.. సొంత వాహనం కొనుక్కోలేక అద్దెకార్లకే డ్రైవర్లుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగనుంది. తద్వారా డ్రైవర్లే కార్ల ఓనర్లు కానున్నారు. ఇదీ విధానం.. దాదాపు రూ. 7 లక్షల విలువైన కార్లను బ్యాంకు రుణం ద్వారా ఇప్పిస్తున్నారు. మొత్తం వ్యయంలో లబ్ధిదారు వాటాగా 25 శాతం చెల్లించాల్సి ఉంది. మిగతా 75 శాతం సొమ్మును జీహెచ్ఎంసీ ఎస్బీహెచ్ నుంచి బ్యాంకు రుణంగా ఇప్పిస్తుంది. ఎస్సీ/ఎస్టీలకు చెందిన వారైతే కేవలం 10 శాతం లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. మిగతా 90 శాతం సొమ్మును జీహెచ్ఎంసీ బ్యాంకు రుణంగా ఇప్పిస్తుంది. నెలనెలా వాయిదాల పద్ధతిలో బ్యాంకు రుణం తీర్చాల్సి ఉంది. కాగా బడుగు బలహీనవర్గాలకు చెందిన వారికి పరిశ్రమలశాఖ ద్వారా సబ్సిడీ ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇలా 105 మందికి కొత్త కార్లు ఇప్పించే ప్రక్రియ పూర్తయిందని, త్వరలో (పంధ్రాగస్టులోగా) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.