New Rules Propose
-
నవంబర్ నుంచి కొత్త రూల్స్ ఇవే
-
వాహనదారులకు బిగ్ రిలీఫ్.. టోల్ వసూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం!
హైవేలపై టోల్ ఫీజు వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్ల ప్రక్రియ మరింత సమర్ధంగా ఉండే విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో, వాహనదారులకు కొంత మేరకు ఉపశమనం కలుగనుంది. వివరాల ప్రకారం.. ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. వాహనం సైజు, రోడ్డుపై అది ప్రయాణించిన దూరం ఆధారంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే కొత్త టోల్ విధానానికి అనుగుణంగా వాహనం హైవేలపై ఎంత సమయం, ఎంత దూరం ప్రయాణించిందనే దాని ఆధారంగా టోల్ వసూలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. టోల్‌ప్లాజా వసళ్ల విషయంలో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతీ 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే కలెక్షన్ పాయింట్స్ వద్ద టోల్ ట్యాక్స్ వసూలు చేయబోరని గడ్కరీ స్పష్టం చేశారు. కాగా, 60 కిలోమీటర్ల మధ్యలో ఉండే టోల్‌బూత్‌లను వచ్చే మూడు నెలల్లో మూసివేస్తామని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా స్పష్టం చేశారు. Pay as you go: Centre plans toll collection revamp based on vehicle’s size, distance travelled#vehicles #government #infrastructure https://t.co/vayGcK6Tu0 — ET NOW (@ETNOWlive) October 4, 2022 -
లాక్డౌన్.. కొత్త మార్గదర్శకాలు విడుదల
-
గ్రీన్‌కార్డు ఆశావహులకు షాక్
వాషింగ్టన్: వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తూ.. వారి భవితవ్యంతో ఆడుకుంటున్న ట్రంప్ సర్కారు మరో కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహారం, నగదు సాయం రూపంలో ప్రభుత్వ లబ్ధి పొందిన, పొందుతున్న వలసదారులకు గ్రీన్‌కార్డుల్ని నిరాకరించాలన్న ఆలోచనలో ఉంది. ఇది కార్యరూపం దాల్చితే అమెరికాలో నివసిస్తోన్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ›ప్రభావం పడనుంది. ఈ ప్రతిపాదిత నిబంధనపై సెప్టెంబర్ 21న అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)కార్యదర్శి సంతకం చేశారు. ఆ శాఖ వెబ్సైట్లో వివరాల్ని అందుబాటులో ఉంచారు. కాగా అమెరికాలోని ప్రముఖ ఐటీ సంస్థలు, రాజకీయ నాయకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. 3.82 లక్షల మందిపై ప్రభావం ‘నివాస హోదా మార్పు లేదా వీసా కోరుకునేవారు.. అలాగే అమెరికాలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వలసదారులు.. ఇంతకు ముందెన్నడూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని నిరూపించుకోవాలి’ అని కొత్త నిబంధన పేర్కొంటోంది. భారతీయులపై ప్రభావం చూపనున్న హెచ్–4 వీసా వర్క్ పర్మిట్ల రద్దుపై 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఫెడరల్ కోర్టుకు ట్రంప్ సర్కారు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆహార సాయం, సెక్షన్ 8 కింద ఇచ్చే హౌసింగ్ వోచర్లను వాడుకుంటున్న వలసదారులకు గ్రీన్ కార్డులు నిరాకరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆహారం, నివాసం కోసం అమెరికాలో లక్షలాది మంది వలసదారులు ప్రభుత్వ సాయంపై ఆధారపడ్డారు. ఆ దేశంలో చట్టబద్ధంగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు వీలుగా గ్రీన్ కార్డు పొందాలంటే ఇప్పుడు వారంతా ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయాన్ని ఆశించకూడని తప్పని పరిస్థితిని కల్పించారు. మెడికేర్ కింద తక్కువ ఖర్చుతో మందులు అందుకుంటోన్న వలసదారులకు కూడా వీసా నిరాకరించే అవకాశముంది. ఇప్పటికే గ్రీన్‌కార్డులు పొందిన వారిపై ఈ నిర్ణయం ప్రభావం ఉండదు. న్యాయబద్ధంగా నివాస హోదా సాధించుకున్న వలసదారులు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చూసేందుకే ఈ నిర్ణయమని అమెరికా న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే ఏడాదికి 3.82 లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశముంది. శాశ్వత నివాస హోదా కోరుకుంటున్న వారు, తాత్కాలిక వీసాలపై ఉంటూ శాశ్వత ఆశ్రయాన్ని ఆశిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువ ప్రభావితం కానున్నారు. ఆర్థికంగా తమను తాము పోషించుకోగలమని నిరూపించుకుంటేనే గ్రీన్‌కార్డు జారీ విధానాన్ని ఇంతవరకూ అమెరికా అమలుచేస్తోంది. -
1.4 కోట్ల మందిపై నిఘా!
వాషింగ్టన్: నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లాలనుకునేవారు దరఖాస్తు సమయంలో గత ఐదేళ్ల సోషల్ మీడియా, ఫోన్, ఈ మెయిల్ వివరాలు వెల్లడించాలన్న ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం ఏడాదికి దాదాపు 1.47 కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. టూరిజం, వైద్య చికిత్స, వ్యాపారం కోసం జారీచేసే వీసాలు, హెచ్–1బీ, స్టూడెంట్ వీసాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. అమెరికా విదేశాంగ శాఖ రూపొందిస్తున్న కొత్త నియమావళి ప్రకారం వీరంతా తమ వ్యక్తిగత వివరాల్ని అమెరికాకు బహిర్గతం చేయడం తప్పనిసరి. సోషల్ మీడియా వివరాలు, పాస్‌పోర్ట్ నంబర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, విదేశీ ప్రయాణాల వివరాలూ చెప్పాలి.ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసేవారిని సోషల్ మీడియా వివరాల్ని అడుగుతామని, ఈ నిర్ణయం ఏడాదికి 7 లక్షలపై ప్రభావం చూపనుందని గత సెప్టెంబర్‌లో అమెరికా వెల్లడించింది. అయితే ఆ ప్రతిపాదనను మరింత విస్తరించి 1.4 కోట్ల నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు వర్తింపచేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం దరఖాస్తుదారుడు మొత్తం 20 సోషల్ మీడియా ఫ్లాట్‌పాంల ఖాతాల వివరాలు తెలపాలి. వాటిలో అమెరికా నుంచి నడుస్తున్న ఫేస్బుక్, ఫ్లికర్, గూగుల్ ప్లస్, ఇన్‌స్ట్రాగాం, లింక్డిన్, మై స్పేస్, పింట్రెస్ట్, రెడిట్, టంబ్లర్, ట్విటర్, వైన్, యూట్యూబ్‌లు ఉండగా.. చైనా సైట్లు డౌబన్, క్యూక్యూ, సైనా వైబో, టెన్సెంట్ వైబో, యుకు, రష్యా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వీకే, ట్వూలు ఉన్నాయి. క్షుణ్నంగా తనిఖీలు.. క్షుణ్నంగా తనిఖీ చేశాకే అమెరికాలోకి అనుమతిస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ పగ్గాలు చేపట్టాక.. గతేడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని కాన్సులేట్ కార్యాలయాల్లో దరఖాస్తుల తనిఖీని మరింత కట్టుదిట్టం చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. ఇప్పుడు వ్యాపార అవసరాలతో పాటు టూరిస్ట్ పర్యటనకు అమెరికా వెళ్లాలనుకునే వారికి కూడా ఈ తనిఖీల్ని కట్టుదిట్టం చేయనున్నారు. ఈ నిర్ణయం భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికోలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీసా లేకుండా అమెరికాలోకి ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న 40 దేశాలపై ఈ నిబంధనలు ఎలాంటి ప్రభావం చూపబోవు. వీటిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలున్నాయి. నిష్ఫల ప్రయత్నం.. తాజా నిబంధనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది మంది వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా వివరాలు సేకరించాలనుకోవడం నిష్ఫల, సమస్యలు సృష్టించే ప్రయత్నమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ డైరెక్టర్ హినా షంషీ అన్నారు. ఇది వ్యక్తిగత అంశాల్లోకి చొరబడడమే కాకుండా అర్థరహిత నిర్ణయమని డ్రెక్సెల్ యూనివర్సిటీలో అసోసియేట్ లా ప్రొఫెసర్ అనిల్ ఖాల్హన్ చెప్పారు. ప్రైవేటు ఖాతాల సమాచారం ఇవ్వాలని బలవంతం చేయడానికి తాము వ్యతిరేకమని ఇంతకు ముందే చెప్పామని అందులో ఎలాంటి మార్పులేదని ఫేస్బుక్ పేర్కొంది. -
పెద్దనోట్లపై మరో షాకింగ్ న్యూస్..!
న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, రూ.1000 లకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. నవంబరు 8న అత్యధిక చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దుచేసి సంచనం సృష్టించిన కేంద్ర ప్రభుత్వం మరో సంచలన ఆర్డినెస్స్ జారీ చేయనుందట. ఈ కొత్త చట్టం ప్రకారం నిషేధిత రూ.500 ,రూ.1000 రూపాయి నోట్లను రూ.10,000పైగా కలిగి ఉండటం ఇకమీదట నేరంగా పరిగణిస్తారు. రూ. 10 వేలకు పైగా రద్దయిన పాత నోట్లను కలిగి వుంటే భారీ జరిమానా విధించనుంది. రూ.50వేల జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదు రెట్లు జరిమానా విధించనుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురపాలక మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారించి, జరిమానాను నిర్ణయిస్తారు. అలాగే డిసెంబర్ 30తరువాత రద్దయిన నోట్లను నేరుగా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో డిపాజిట్ చేయవచ్చు. దీనికి సంబంధించిన గ్రేస్ పీరియడ్ ను తరువాత ప్రకటించనుంది. డిసెంబర్30లోపు ఈ ఉత్తర్వులను విడుదల చేసేందుకు యోచిస్తోందట. కాగా 80 శాతం చెలామణిలో రూ. 15.44 లక్షల కోట్ల నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ 13 నాటికి 12.44 లక్షల కోట్ల డిపాజిట్ అయినట్టు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిసెంబర్ 30 గడువు లోపల మొత్తం డిపాజిట్లు రూ.13-13.5 లక్షల కోట్లగా ఉండనుందని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. పెద్దనోట్ల డిపాజిట్ల గడువు ఈ నెల 30తో ముగియనున్న సంగతి తెలిసిందే.