తప్పులు మానకపోతే తప్పవు తిప్పలు
కొద్ది కాలానికి రాజకీయ నేతలందరూ అపకీర్తి పొందవచ్చు. గాంధీలతో విసుగెత్తిపోయిన ప్రజలకు కొంత కాలం తర్వాత మోదీపై కూడా విసుగు పుట్టవచ్చు. అలాంటి పరిస్థితి ఎవరికి అనుకూలం? రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలకు మాత్రం కాదు.
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాలను గందరగోళంలోకి నెట్టేశాయి. బీజేపీ ఘన విజయం సాధిస్తే, కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ రెండు కీలక రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంగా పాలిస్తోంది. బీజేపీ ఇప్పుడు రెండు చోట్లా అధికారం చేపట్టబోతోంది. కాంగ్రెస్ బతికి బట్ట కట్టగలగాలంటే సరికొత్త వ్యూహాలను కనిపె ట్టాల్సి ఉంటుంది. జపాన్ వాళ్లు తమ ఫ్యాక్టరీలలో ‘సున్నా తప్పులు’ విధానాన్ని అనుసరించి తప్పులు జరిగే అవకాశమే లేకుండా చూసుకుంటారు. కానీ తాను మారాల్సిన అవసరం లేదని తనకు ప్రత్యా మ్నాయమేమీ లేదనే భావనను కలిగించాలని కాం గ్రెస్ చూస్తోంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
పార్లమెంటు ఎన్నికల అనంతరం తాను తప్పులు చేశా నని, సరిదిద్దుకుంటానని అంటూ ఒక్క ప్రకటనైనా చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వాన్ని పదేపదే తిట్టిపో స్తోంది. కాంగ్రెస్, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తమ పాలనపై ఏమాత్రం విచారం వెలిబుచ్చి ఎరుగరు. గత పదేళ్లూ దేశం అద్భుతంగా ఉందని అంటారు. ఇది ఆ పార్టీ అతి పెద్ద తప్పు.
కాంగ్రెస్ 2014 ఎన్నికల ప్రచారమంతా నరేంద్రమోదీకి వ్యతిరేకంగానే సాగించింది. మోదీ పట్ల ప్రజల్లో అనుమా నాలను రేకె త్తిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఓటు చేస్తారని అది భావించింది. కానీ బీజేపీ పార్లమెంటులో మెజారిటీ సాధిం చింది. వెంటనే కాంగ్రెస్ మోదీపై వ్యక్తిగత విమర్శలను కట్టిపెట్టాల్సింది. మోదీ విదేశీ పర్యటనలు విజయవంత మయ్యాయని, విదేశాల్లో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశా యని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. అయినా కాంగ్రెస్ ఆయనను ప్రశంసించలేదు.
అమెరికాలోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశానికి మంచి స్పందన వచ్చింది. ఎన్ఆర్ ఐలు భారతదేశం పట్ల అంత గొప్ప సౌహార్ద్రతను చూపినందుకు కాంగ్రెస్ అభినందించి ఉండాల్సిం ది. కానీ కాంగ్రెస్, మోదీపై దాడి చేసి సమయాన్ని వృథా చేసుకుంది.
ఇందిరాగాంధీ హయాంలో, ఏ నేతా అతి శక్తి మంతుడు కాకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడేది. హర్యా నాలో సీఎం హూడా పార్టీపై సంపూర్ణ అజమాయిషీ చలాయించేందుకు సోనియాగాంధీ అనుమతించా రు. ఫలితం.. తాజా ఎన్నికల్లో హర్యానాలోని 90 స్థానాల్లో కాం గ్రెస్ కేవలం 15 సీట్లను గెల్చుకుంది. పైగా హర్యానాలో కాంగ్రె స్కు అతిపెద్ద సమస్య సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా. అతడి భూదందాకు హుడా ప్రభుత్వం అనుమతించిందని ప్రతి పక్షం దునుమాడుతుంటే వాద్రాకు కాంగ్రెస్ మద్దతివ్వడం హర్యానా ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. తన అల్లుడు ఇబ్బం దుల్లో ఇరుక్కుంటాడన్న భయంతో సోనియాగాంధీ, సీఎం హూడా కోరిందల్లా కట్టబెట్టడానికి అంగీకరించారు. వాద్రా వ్యవహారం గాంధీ కుటుంబం పరువును గంగలో కలిపింది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ గత 15 ఏళ్లుగా శరద్‌పవార్ పార్టీ ఎన్సీపీతో పొత్తు సాగిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ చేజేతులా పొత్తును జారవిడుచుకుంది. తనకు మరిన్ని స్థానాలు కావాలని ఎన్సీపీ చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించి మూల్యం చెల్లించింది. బీజేపీ, శివసేన కూటమి విడిపోయినప్పుడు సీట్ల విషయంలో రాజీపడి ఉంటే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఎన్ని కల్లో మంచి అవకాశం లభించేది. శరద్‌పవార్‌ను కోల్పోవడం కాంగ్రెస్ చేసిన అతి పెద్ద పొరపాటు. ఈ రెండు పార్టీల మధ్య చీలికే బీజేపీ అవకాశాలను అమాంతంగా పెంచివేసింది. గతం లో ఎన్నడూ 119 స్థానాలకు మించి పోటీ చేయని బీజేపీ అసెం బ్లీ ఎన్నికల్లో 124 స్థానాలను సొంతంగా గెల్చుకుంది.
2004లో రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్‌కి తెలిసిందల్లా అధికారమే. తన మాటే శాసనం. తను కోరుకున్నదల్లా జరిగిం ది. పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ యువ రాహు ల్కు దాదాపు కింది ఉద్యోగిలా వ్యవహరించారు. అంత అధికా రాన్ని ఇప్పుడు కోల్పోయాక, రాహుల్‌కి ఏం చేయాలో, ఎలా స్పందించాలో కూడా తెలియటం లేదు. అధికారం ఉన్నప్పుడు అణకువను కోల్పోవడం సహజమే కావచ్చుకానీ, దాన్ని కోల్పో యాక మాత్రం పరిస్థితులతో సర్దుబాటు కావలసి ఉంటుంది. బదులుగా మోదీ, బీజేపీలపై రాహుల్ అపరిణత విమర్శలకు లంకించుకున్నారు. అధికారానికి దూరంగా ఉండేందుకు ఆయ న అలవాటుపడాలి. ఇతర ప్రతిపక్ష నేతలతో కలిసి కూర్చోవ డం తను నేర్చుకోవాలి. శరద్‌పవార్ సైతం రాహుల్ ప్రవర్తనను తప్పుపట్టారు. వినాశకాలే విపరీత బుద్ధి అని మన పూర్వీకులు చెప్పారు. కష్టకాలం ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలని దానర్థం. నీ శత్రువులు తప్పులు చేస్తున్నప్పుడు వారిని ఎన్న డూ అడ్డుకోవద్దు అన్నాడు నెపోలియన్ చక్రవర్తి. బీజేపీ, నరేం ద్రమోదీ తప్పులు చేయడానికి కాంగ్రెస్ అవకాశమివ్వాలి. వారికి కాస్త సమయాన్ని ఇవ్వాలి.
ఏదో ఒక సందర్భంలో మీరు ప్రజలను మోసగించవచ్చు కానీ అన్ని వేళల్లో మోసగించలేరని అబ్రహాం లింకన్ 175 ఏళ్ల క్రితం చెప్పారు. కాని తెలివిగా జిత్తులకు దిగితే విజయం సాధించవచ్చని సోనియా గాంధీ విశ్వసిస్తుంటారు. దీనికి అతి పెద్ద ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ విభజన. అయినా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 42 ఎంపీ సీట్లకు ఆ పార్టీ సాధించింది 2 స్థానాలు మాత్రమే (నాగర్‌కర్నూలు, నల్లగొండ). యూపీఏ పదేళ్ల కాలంలో నిరుద్యోగంపై, మధ్యతరగతిపై సోనియా గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇది పెద్ద ఎత్తున జనం వ్యతిరేకమవడానికి దారితీసింది.
అపకీర్తి పొందిన వారసత్వ పాలకులు ప్రజారంజక నేత లకు పగ్గాలప్పగించే ఇండోనేసియా తరహా నమూనాను రాజ కీయ పండితులు ఫ్రాంచైజింగ్ డైనాస్టీస్ అంటున్నారు. పాకి స్థాన్, బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాల్లో ఇది ఇప్పటికే కొనసా గుతోంది. సోనియా, రాహుల్ కాంగ్రెస్ రాజకీయ అభ్యర్థులను ఇలా ఫ్రాంచైజ్ చేయడం ద్వారా మనుగడ సాధించవచ్చు. ప్రజాదరణ ఉన్న నేతను ఎన్నుకుని, తాము గెలిస్తే వారే ప్రధాన మంత్రి అవుతారని ప్రకటించవచ్చు. గాంధీ కుటుంబం తప్ప కుండా వెనక్కుతగ్గి ఇతర అభ్యర్థులను ఎంచుకోవలసి ఉంటుం ది. వారు రిమోట్ కంట్రోల్‌గా మాత్రమే ఉంటారు. గాంధీలు మారరని, వారు పాఠాలు నేర్చుకోరని, ఇతరులు తమకు పాఠా లు చెప్పడాన్ని అనుమతించరని హర్యానా, మహారాష్ట్ర ఎన్ని కలు మనకు బాగా చూపించాయి. ఆల్కహాల్ కంటే ముఖస్తుతి మరింత మత్తు గొలుపుతుంది. దీనికి ఇండోనేసియా తరహా రాజకీయ ప్రాంచైజీ నమూనా ఒక పరిష్కారం కావచ్చు.
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లరావు