New York Post
-
రష్దీ జీవించి ఉండడం ఆశ్చర్యమే
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో భారత రచయిత సల్మాన్ రష్దీని కత్తితో పొడిచాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు హదీ మతార్ తన దాడి వెనుక ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. రష్దీ చిత్తశుద్ధి లేని వ్యక్తి అని అందుకే అతనంటే తనకి నచ్చడని చెప్పాడు. తనంతట తానుగానే రష్దీని పొడిచానని వెల్లడించాడు. జైలు నుంచే న్యూయార్క్ పోస్ట్ వార్తాసంస్థకు వీడియో ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. రష్దీ ఇంకా ప్రాణాలతో ఉన్నారన్న విషయం తెలియగానే తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పాడు. రష్డీకి మెడపై 3 కత్తి పోట్లు, కడుపులో నాలుగుసార్లు, కుడి కన్ను, ఛాతీ, కుడి తొడపై కత్తి పోట్లు ఉన్నాయని ఆయనకి చికిత్స చేస్తున్న వైద్యులు వెల్లడించారు. రష్దీ రాసిన నవల ‘ది సటానిక్ వెర్సస్’లో తాను కొన్ని పేజీలే చదివానని, అంతా చదవలేదన్నారు. రష్దీపై ఫత్వా జారీ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ ఆదేశంతో ఈ దారుణానికి పాల్పడ్డావా? అన్న ప్రశ్నకు మతార్ సమాధానం ఇవ్వలేదు. అయతొల్లా అంటే తనకు గౌరవం ఉందని చెప్పాడు. -
పుతిన్ పదవి నుంచి వైదొలగనున్నారా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇకపై పదవిలో కొనసాగబోరనే వార్తలు వినపడుతున్నాయి. పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా పుతిన్ జనవరిలో పదవి నుంచి వైదొలగే వీలుందని వార్తలొచ్చాయి. పుతిన్ ప్రియురాలు 37 ఏళ్ళ ఎలీనా కబేవా, ఆయన కుమార్తెలు పుతిన్‌ని పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు, మాస్కోకి చెందిన రాజకీయ విశ్లేషకులు వలేరి సొలోవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ద డెయిలీ మెయిల్’ఒక కథనాన్ని ప్రచురించింది. పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉండి ఉండవచ్చునని సొలేవే తెలిపారు. పుతిన్ పాదాల కదలికలో తేడాలున్నాయని, ఆయన కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు బయటపడ్డాయని, ఆయన పక్కనున్న కప్పు నిండా మాత్రలున్నాయని ఆయన తెలిపారు. పుతిన్ త్వరలోనే నూతన ప్రధానిని నియమిస్తారని, ఆయనను తన వారసుడిగా తయారు చేస్తారని సొలోవే తెలిపినట్లు న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. ఇదిలా ఉండగా పుతిన్ పదవి నుంచి దిగిపోతారనే ప్రచారాన్ని రష్యా అధికార వర్గాలు తోసిపుచ్చాయి. పదవి నుంచి వైదొలగే అవకాశమే లేదని క్రిమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. -
బెర్ముడా మిస్టరీ వీడింది!
లండన్: ఉత్తర అట్లాంటిక్ సముద్ర జలాల్లో భారీ నౌకలను, విమానాలను సైతం అలవోకగా సముద్రంలోకి లాగేస్తున్న ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతం రహస్యాన్ని దాదాపు ఛేదించామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. న్యూయార్క్ పోస్ట్ శుక్రవారం ప్రచురించిన కథనం ప్రకారం.. సముద్రంలో మయామి, పుయెర్టోరికో, బెర్ముడా ద్వీపం మధ్య భాగంలో ‘బెర్ముడా ట్రయాంగిల్’ ఉంది. ఈ సముద్రప్రాంతంపై అత్యంత శక్తివంతమైన షడ్భుజాకృతిలో గాలి మేఘాలు 32-80 కి.మీ.ల విస్తీర్ణంలో ఏర్పడుతున్నాయి. గంటకు 273 కి.మీల. వేగంతో దూసుకొచ్చే తుపానులకు ఉండేంత శక్తి ఈ గాలి మేఘాలకు ఉంటుంది. నౌకలను, విమానాలను ఈ గాలి మేఘాలే కిందకు తోసి సముద్రంలో ముంచేస్తున్నట్లు పరిశోధకుడు డాక్టర్ ర్యాండీ కార్వెనీ వివరించారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించాక ఈ నిర్ధారణకు వచ్చారు. -
ట్రంప్ భార్య నగ్నఫొటోలపై దుమారం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వంలో ప్రత్యర్థుల ఘాటైన విమర్శలతో పాటు ఊహించని వివాదాలు తెరపైకి వస్తున్నాయి. న్యూయార్క్ పోస్ట్ టాబ్లాయిడ్ రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా నగ్న ఫొటోలను ప్రచురించడం దుమారం రేపింది. 1990ల్లో మెలానియా మోడల్‌గా పనిచేసింది. అప్పటి మెలానియా నగ్న ఫొటోను న్యూయార్క్ పోస్ట్ కవర్ పేజీపై ముద్రించారు. 'అమెరికాకు ప్రథమ మహిళ కావాలనుకుంటున్న ఆమె ఫొటోను ఇలా ఎప్పుడూ చూసుండరు' అని మెలానియా ఫొటో కింద రాసుంది. 1995లో ఓ ఫ్రెంచ్ పురుషుల మేగజైన్ కోసం మెలానియా నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చినట్టు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. కొందరు అరుదుగా చూసిన, ఇతరులు ఎప్పుడూ ప్రచురించని ఫొటోలను తీశారని, వీటిని ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ అలె డి బస్సెవిల్లే తీసినట్టు పేర్కొంది. స్లొవేనియాలో జన్మించిన మెలానియాకు అప్పట్లో 25 ఏళ్ల వయసు ఉంటుంది. మెలానియా ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ ఆనాటి విషయాలను గుర్తుచేసుకుంటూ, నగ్నంగా పొజులివ్వడానికి ఆమె ఎప్పుడూ ఇబ్బందిపడలేదని చెప్పాడు. ట్రంప్ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు. 'అత్యంత విజయవంతమైన మోడల్స్‌లో మెలానియా ఒకరు. మేజర్ మేగజైన్స్, కవర్ పేజీల కోసం ఆమె చాలా ఫొటో షూట్స్ చేసింది. మెలానియా ఫొటోలను ఓ యూరోపియన్ మేగజన్ కోసం తీశారు. యూరప్‌లో ఇలాంటి ఫొటోలు చాలా సాధారణం, ఫ్యాషన్' అని చెప్పారు. ట్రంప్ భార్య చిత్రాలను కవర్ పేజీపై ప్రచురించడం తమకు ఎలాంటి సమస్యాలేదని ఆయన సలహాదారు మిల్లర్ అన్నారు. 2005లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌లో ట్రంప్ ఆమెను పెళ్లి చేసుకున్నారు.