బెర్ముడా మిస్టరీ వీడింది!
లండన్: ఉత్తర అట్లాంటిక్ సముద్ర జలాల్లో భారీ నౌకలను, విమానాలను సైతం అలవోకగా సముద్రంలోకి లాగేస్తున్న ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతం రహస్యాన్ని దాదాపు ఛేదించామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. న్యూయార్క్ పోస్ట్ శుక్రవారం ప్రచురించిన కథనం ప్రకారం.. సముద్రంలో మయామి, పుయెర్టోరికో, బెర్ముడా ద్వీపం మధ్య భాగంలో ‘బెర్ముడా ట్రయాంగిల్’ ఉంది. ఈ సముద్రప్రాంతంపై అత్యంత శక్తివంతమైన షడ్భుజాకృతిలో గాలి మేఘాలు 32-80 కి.మీ.ల విస్తీర్ణంలో ఏర్పడుతున్నాయి.
గంటకు 273 కి.మీల. వేగంతో దూసుకొచ్చే తుపానులకు ఉండేంత శక్తి ఈ గాలి మేఘాలకు ఉంటుంది. నౌకలను, విమానాలను ఈ గాలి మేఘాలే కిందకు తోసి సముద్రంలో ముంచేస్తున్నట్లు పరిశోధకుడు డాక్టర్ ర్యాండీ కార్వెనీ వివరించారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించాక ఈ నిర్ధారణకు వచ్చారు.