ఆటో బోల్తా..ఆరుగురికి గాయాలు
తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని చందుర్తి గ్రామ సమీపంలో 16వ నంబరు జాతీయరహదారిపై గురువారం
తెల్లవారు జామున ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి
విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
(గొల్లప్రోలు)