Nicki Minaj
-
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
అమెరికన్ ప్రముఖ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(41) అరెస్ట్ అయింది. అయితే, కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆమెను విడుదల చేశారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నిక్కీ మినాజ్‌కు ఈవెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమ్స్టర్డామ్లోని షిపోల్ ఎయిర్పోర్ట్ వద్దకు నిక్కీ చేరుకుంది. తన బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమ్స్టర్డామ్ అధికారులు ఆమెను నిర్బంధించారు. దీంతో ఆమె షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సంగీత్ కార్యక్రమం వాయిదా పడింది. ఆమె పాల్గొంటున్న ప్రోగ్రామ్ కోసం సుమారు ఇరువై వేల మంది టికెట్లు కొన్నారు. నిక్కీ వద్ద డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో తనిఖీల పేరుతో ఆమెను కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఉంచారు. ఫైనల్లీ తనవద్ద డ్రగ్స్ లేవని తేలడంతో ఆమెను పోలీసులు వదిలిపెట్టారు. అప్పటికే సమయం గడిచిపోవడంతో ఆమె పాల్గొనాలనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. అయితే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని అభిమానులకు నిక్కీ టీమ్ తెలిపింది. అయితే, పోలీసుల తీరుపట్ల నిక్కీ మినాజ్ అసహనం వ్యక్తం చేసింది. తన వద్ద డ్రగ్స్ లేకున్నా కావాలనే తన ప్రోగ్రామ్ చెడగొట్టేందుకు ఎవరో ఇలాంటి గేమ్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, తొమ్మిది అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Barbie (@nickiminaj) -
రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్
ప్రముఖ ర్యాపర్ నిక్కీ మినాజ్(36) ఎట్టకేలకు తన ప్రియుడు, బ్యాడ్‌బాయ్ కెన్నెత్ పెర్రీని రహస్య వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో ఉన్న పేరును 'మిసెస్ పెట్టీ'గా మార్చారు. అంతేకాక సోమవారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. 'ఒనికా తాన్య మరాజ్-పెట్టీ 10.21.19' అనే క్యాప్షన్‌ను ఇచ్చారు. ఒనికా తాన్య మరాజ్ అనేది నిక్కీ మినాజ్ అసలు పేరు. పెట్టీ అనేది తన ప్రియుడి పేరు. ఇద్దరూ అధికారికంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు అనేలా తేదిని జత చేశారు. ఇప్పటికే పెళ్లితంతు ముగిసిందనే అర్థం వచ్చేలా.. తన పేరుతో పాటు ప్రియుడి పేరు, తేదీను జత చేశారు. ఇక వీడియోలో మిస్టర్ అండ్ మిసెస్ ఉన్న మగ్‌లతో పాటు వధూవరులనే అర్థానిచ్చే రెండు బేస్‌బాల్ క్యాప్‌లు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె ఫ్యాన్స్.. ఆ వెంటనే తేరుకొని నిక్కీ మినాజ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మ్యారేజ్ లైసెన్స్ గడువు ముగియనుండడంతో.. ప్రియుడిని ఉన్నపళంగా వివాహం చేసుకొందని.. మళ్లీ రెండోసారి గ్రాండ్‌గా వివాహం చేసుకోనుందనే పుకార్లు సోషల్‌మీడియాలో గుప్పుమంటున్నాయి. నిక్కీ తాను పెళ్లి చేసుకుంటున్నాను అనే వార్తను.. జూన్ 21న ఒక రేడియోలో అధికారింగా ప్రకటించారు. అందులో ఆమె.. తన బాయ్‌ఫ్రెండ్ మ్యారెజ్ లైసెన్స్ పొందడంతో 90 రోజుల్లోపే పెళ్లి చేసుకోనున్నాని స్పష్టం చేశారు. గతేడాది నుంచి పెట్టీతో డేట్ చేస్తున్న నిక్కీ.. పెట్టీతో ప్రేమలో ఉన్నట్టు తొలిసారిగా గత డిసెంబర్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీకరించారు. లైంగిక ఆరోపణలతో దోషిగా తేలిన కెన్నెత్ పెట్టీను.. నిక్కీ ఏరికోరి వివాహం చేసుకోవడం గమనార్హం. View this post on Instagram 👰🏽🤵🏽😢🙏🏽🎀 Onika Tanya Maraj-Petty 10•21•19 A post shared by Barbie (@nickiminaj) on Oct 21, 2019 at 8:22pm PDT -
నువ్వు మోడలా; నా ఇష్టం వచ్చినట్లు ఉంటా!
ఓ మహిళ ఆధునిక వస్త్రాలు ధరించి ఠీవీగా నడుస్తోంది. హై హీల్స్ వేసుకున్న ఆమె అడుగుల శబ్దం అంతకంతకూ పెరుగుతోంది. ఇంతలో ఆమె పక్కగా నడుస్తున్న ఉన్న మహిళల బృందంలో గుసగుసలు మొదలయ్యాయి. అందరూ ఆమెను వింతగా చూడసాగారు. ఇంతలో ఆ గుంపు నుంచి బయటికి వచ్చిన ఓ మహిళ.. ఆతురత పట్టలేక... ఆధునిక వేషధారణలో ఉన్న సదరు మహిళ దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. ఏమ్మా నువ్వేమైనా సెలబ్రిటీవా?... ఊహూ..ఆమె నుంచి సమాధానం. మరి మోడల్‌వా మరో ప్రశ్న.. అబ్బే అదేం లేదండీ. మరి అలా అయితే ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు బయటకు వచ్చావు?...అదేంటండీ...ఇది నా జీవితం.. నా ఇష్టం..నాకు నచ్చినట్లుగా ఉంటా..ఇందులో తప్పేముంది ఈసారి ఎదురు ప్రశ్నించింది సదరు ‘ఆధునిక మహిళ’ . ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక అక్కడి నుంచి మెల్లగా జారుకుంది తనను ప్రశ్నించిన మరో మహిళ. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఆధునిక వస్త్రాలు ధరించి మహిళ పేరు మాషల్ అల్-జలౌద్(33). సౌదీ అరేబియాకు చెందిన హ్యూమన్ రీసోర్సెస్ ప్రొఫెషనల్ ఆమె. అబయ, హిజాబ్ ధరించకపోతే తనను ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నా సరే ఆమె తన వైఖరి మార్చుకోలేదు. తనే కాదు తన లాంటి ఎంతో మంది నవ యుగపు మహిళలు గత కొంతకాలంగా అబయా(ముస్లిం మహిళలు ధరించే సంప్రదాయ ముసుగు) లేకుండానే బయటికి వస్తున్నారు. అనాదిగా వస్తున్న రాచరికపు సంప్రదాయాలు, కట్టుబాట్లకు అలవాటు పడిన మహిళ నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తూనే..వారిని కూడా చైతన్యవంతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కట్టుబాట్లకు మారుపేరైన ఎడారి దేశం సౌదీలో గత కొంతకాలంగా ఆహ్వానించదగ్గ మార్పులు చోటుచేసుకుంటున్నాయనే మాట బలంగా వినిపిస్తోంది. ‘సౌదీ అరేబియా విజన్- 2030’ కార్యక్రమంలో భాగంగా సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్.. లింగ వ్యత్యాసాన్ని తొలగించే దిశగా, మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు... సౌదీ ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించడం, పరుగు పందాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. కో- పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లుగా మహిళలకు అవకాశమిస్తున్నట్లుగా పలు సౌదీ ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. అంతేకాదు సాయంకాలపు బులెటిన్ చదివేందుకు కూడా మహిళా జర్నలిస్టులకు సౌదీ కేంద్రంగా పనిచేసే కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇదంతా నిజంగా నిబంధనల సడలింపులో భాగమేనా అని ప్రశ్నిస్తే మాత్రం భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. నాపై దాడి జరగడం ఖాయం.. కేవలం ఆంక్షలు సడలించినంత మాత్రాన పౌరుల్లో మార్పు రావడం లేదని...సంప్రదాయవాదుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినపుడు మాత్రమే తమకు నిజమైన స్వేచ్ఛగా లభిస్తుందంటోంది పాతికేళ్ల యువతి మనహల్ అల్-ఒతైబీ. ‘ నాలుగు నెలలుగా అబయా ధరించకుండానే రియాద్‌లో సంచరిస్తున్నా. ఎటువంటి ఆంక్షలు లేకుండా.. నాకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులు ధరిస్తున్నా. నాకు ఇష్టంలేని పనులు చేయమని ఆదేశించే హక్కు ఎవరికీ లేదు. అయితే అబయ ధరించకుండా ఉండే విషయమై ఎటువంటి స్పష్టమైన చట్టాలు లేవు. కాబట్టి నేను రిస్క్ చేస్తున్నట్లే. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు నాపై దాడి చేయవచ్చు కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జూలైలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. అబయా ధరించని కారణంగా ఓ మాల్ నిర్వాహకులు నన్ను లోపలికి అనుమతించలేదు. నాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అబయ ధరించే విషయంలో నిబంధనలు సులభతరం చేసే అవకాశం ఉందంటూ గతేడాది వ్యాఖ్యలు చేసిన సౌదీ రాజు సల్మాన్....వీడియోను వాళ్లకు చూపించాను. మహిళలు సౌకర్యవంతంగా, హుందాగా ఉండే దుస్తులు ధరిస్తే తనకేమీ ఇబ్బంది లేదని ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా వాళ్లలో ఏ మార్పులేదు’అని చెప్పుకొచ్చారు. అయితే మనహల్ చెప్పేదంతా అబద్ధం.. కేవలం ప్రచారం పొందేందుకే ఆమె ఇలా చేశారని సదరు మాల్ నిర్వాహకులు కొట్టిపడేశారు. అది వేరే విషయం అనుకోండి. కన్సర్ట్ రద్దు చేసుకున్న మినాజ్.. ఇక సామాజిక, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని భావించిన సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్... 35 ఏళ్ళ సుదీర్ఘ నిషేధం తర్వాత గతేడాది ఏప్రిల్‌లో మొదటి సినిమా థియేటర్‌ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. సౌదీ ప్రేక్షకులతో పాటు మరికొంత మంది విదేశీ ప్రేక్షకులను థియేటర్లోకి అనుమతించిన నిర్వాహకులు...దేశ ఆధునిక సాంస్కృతిక చరిత్రకు నాంది పలికామని ప్రకటన చేశారు. ఇందుకు కొనసాగింపు అన్నట్లు టాప్ మ్యుజిషియన్లు సైతం తమ దేశంలో ప్రదర్శన ఇచ్చేందుకు సౌదీ అనుమతించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాపర్‌గా గుర్తింపు పొందిన బోల్‌్డ లేడీ నిక్కీ మినాజ్‌తో కన్సర్ట్ నిర్వహించేందుకు సన్నాహాకాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అంతలోనే మినాజ్ తన సౌదీ కన్సర్ట్ను రద్దు చేసుకున్నారని...మానవ హక్కుల ఉల్లంఘనలో సౌదీకి ఉన్న రికార్డు చూసిన తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జలౌద్, ఒతైబీ వంటి యువతులు అబయా ధరించకుండా పెద్ద రిస్కే తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అభిమానులకు షాకిచ్చిన గాయని
ప్రముఖ అమెరికన్ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(36) తన అభిమానులకు షాకిచ్చింది. ఇంకపై సంగీత ప్రపంచం నుంచి దూరంగా వుంటాలనుకుంటున్నానని వెల్లడించారు. నిక్కీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించగానే కోట్లాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక పై తాను కుటుంబ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు నిక్కీ తెలిపారు. సంగీత పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇకపై తాను కుటుంబ జీవితం గడపాలని అనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు. అయితే తన తాను చనిపోయేంతవరకు అభిమానులు తనను అభిమానిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. 2 కోట్ల అభిమానులను సంపాదించుకున్న నిక్కీ మినాజ్ తన బాయ్ ఫ్రెండ్ జూ పెటీని రహస్యంగా పెళ్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ట్విటర్ అకౌంట్ పేరును మిసెస్ పెటీగా మార్చుకోవడం విశేషం. పెటీని పెళ్లాడబోతున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, ఆరు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకున్నారు. I’ve decided to retire & have my family. I know you guys are happy now. To my fans, keep reppin me, do it til da death of me, ❌ in the box- cuz ain’t nobody checkin me. ✅ Love you for LIFE 😘♥️🦄 — Mrs. Petty (@NICKIMINAJ) September 5, 2019 -
'మృత్యుపు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చా'
లాస్ ఏంజిల్స్: అమెరికన్ సింగర్, లిరిక్స్ రైటర్ నిక్కీ మినాజ్ తన చిన్ననాటి జ్జాపకాలను ఒకసారి గుర్తుచేసుకుంది. ప్రత్యేకంగా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు తాను మృత్యుపు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన సంగతిని తాజాగా జ్ఞప్తికి తెచ్చుకుంది. దీనికి టీనేజ్ లో తాను చేయించుకున్న అబార్షనే ప్రధాన కారణమని మనసులోని మాటను బయటపెట్టింది. టీనేజ్ లో ఉన్నప్పుడు హెచ్. లగుర్డియా హైస్కూల్ లో మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్లినపుడు తాను డేటింగ్ చేసి గర్భం దాల్చానని.. అయితే ఆ సమయంలో తాను ఒక బిడ్డకు జన్మనిచ్చి చూసుకునే సామర్థ్యం తనలో లేకపోవడం వల్ల అబార్షన్ చేయించుకున్నాని నిక్కీ స్పష్టం చేసింది. అప్పుడు తాను మృత్యువుతో పోరాడి బయటకు వచ్చానని తెలిపింది. అంతటి బాధను జీవింతలో ఇంతవరకూ ఎప్పుడూ చవిచూడలేదని నిక్కీ పేర్కొంది. -
కారుపై కోపం..!
వద్దన్నా వదిలేసి వెళ్లిపోయాడనో... ఫ్లాష్‌బ్యాక్‌లో మరేదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చిందో... మొత్తానికి బాయ్‌ఫ్రెండ్ శామ్యూల్‌పై కోపంతో అతని మెర్సిడెజ్ కారును తుక్కు చేసింది స్టార్ ర్యాపర్ నికీ మినాజ్. తన జతగాడితో అప్పటివరకూ తీవ్రంగా కొట్లాడి, విడిపోయిన ఈ అనకొండ సింగర్.. అదే టెంపోను కంటిన్యూ చేసింది. పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌ను పట్టుకుని... ముద్దుగా ఉన్న కారును చెత్తగా మార్చేసింది. కసి తీరలేదేమో.. అతగాడి డ్రెస్స్టూ తీసుకెళ్లి గార్బేజీలో పడేసింది!