nifty up
-
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల అంచనాలతో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్134 పాయింట్లు ఎగిసి 30, 322 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 9445 వద్ద ముగిశాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాలనార్జించాయి. డా. రెడ్డీస్, గ్రాసిం, ఏసియన్ పెంయింట్స్, బోష షేర్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా అవంతి ఫీడ్స్ 130శాతం ఎగిసి భారీ లాభాలతో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఐడియా 8 శాతం, గ్లెన్‌మార్క్ 6 శాతం నష్టంతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఫలితాల నేపథ్యంలో కోల్గేట్ నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రుపీ మరింత బలపడింది. 0.20 పైసల లాభంతో రూ. 64.11 వద్ద ఉంది.ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 35 రూ.లుఎగిసి రూ. 28,040 వద్ద ఉంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో్ ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 218.91పాయింట్ల లాభంతో 27,677.55 దగ్గర, నిఫ్టీ 59.15 పాయింట్ల లాభంతో 8,400.55 దగ్గర ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఎనభైవేల మార్క్‌ను దాటి ట్రేడవుతోంది. బ్యాంకింగ్, కాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్ , మెటల్, పవర్, సెక్టార్లో కొనుగోళ్ల ట్రెండ్ కనిపిస్తోంది. దాదాపు అన్నిషేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్స్ క్స్ 337.50 పాయింట్ల లాభంతో 28,959.62 దగ్గర, నిఫ్టీ 94.05పాయింట్ల లాభంతో 8,779,95 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో ఇండియన్ మార్కెట్లు పాజిటివ్‌గా రియాక్టవుతున్నాయి. దాదాపు అన్ని షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. బ్యాంకింగ్ క్యాపిటల్ గూడ్స్, ఆటో, హెల్త్‌కేర్ రంగంలోని లాభాలు మార్కెటును ప్రభావితం చేస్తున్నాయి.