దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల అంచనాలతో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్134 పాయింట్లు ఎగిసి 30, 322 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 9445 వద్ద ముగిశాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాలనార్జించాయి. డా. రెడ్డీస్, గ్రాసిం, ఏసియన్ పెంయింట్స్, బోష షేర్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా అవంతి ఫీడ్స్ 130శాతం ఎగిసి భారీ లాభాలతో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఐడియా 8 శాతం, గ్లెన్‌మార్క్ 6 శాతం నష్టంతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఫలితాల నేపథ‍్యంలో కోల్‌గేట్ నష్టపోయాయి.
అటు డాలర్ మారకంలో రుపీ మరింత బలపడింది. 0.20 పైసల లాభంతో రూ. 64.11 వద్ద ఉంది.ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 35 రూ.లుఎగిసి రూ. 28,040 వద్ద ఉంది.