nikhil handa
-
గూగుల్‌లో వెతికి మరి చంపాడు
న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన శైలజ ద్వివేది హత్య కేసులో పోలిసులు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. శైలజ ద్వివేదిని హత్య చేసని నిఖిల్ హండా ప్రస్తుతం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే నేపంతో నిఖిల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ముందు ఈ హత్యను ఆక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు చిక్కాడు. అయితే పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శైలజను చంపి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించడానికి నిఖిల్ హండా గూగుల్ సాయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ‘హత్యను యాక్సిడెంట్‌గా చిత్రికరించడం ఎలా...చంపిన తరువాత సాక్ష్యాలను ఎలా నాశనం చేయాలి’ వంటి పలు అంశాల గురించి నిఖిల్ గూగుల్‌లో సర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా నిఖిల్ ఫోన్ కాల్ డేటాను, ఇంటర్నెట్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు ఈ విషయాలు తెలిసాయి. ఈ విషయం గురించి పోలీసులు ‘శైలజ, నిఖిల్ కారులోకి ఎక్కిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు నిఖిల్ ఆమె గొంతు నులిమి చంపాడు. తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా శైలజ మృతదేహాన్ని రోడ్డు మీద పడేశి, ఆపై ఆమె గొంతు మీద నుంచి కారును పొనిచ్చాడు. చూసేవారికి అది యాక్సిడెంట్‌లా కనిపించాలని ఇలా చేశాడు. కానీ పోలీసులకు తన మీద అనుమానం రావడంతో సాక్ష్యాలను నాశనం చేయాడానికి ప్రయత్నించాడు. శైలజను చంపడానికి ఉపయోగించిన కత్తితో పాటు ఆ రోజు తాను ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్, జీన్స్ ప్యాంట్లను కాలబెట్టడానికి ప్రయత్నించాడు. అయితే హరిద్వార్ నుంచి మీరత్ వెళ్లే దారిలోఈ పనులన్నింటిని ముగించాలని భావించాడు. కానీ నిఖిల్ హండా కారు టోల్‌ప్లాజా నుంచి వెళ్లే దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫూటేజ్ ఆధారంగానే నిఖిల్‌ను అరెస్ట్ చేశాము. ప్రస్తుతం ఈ సాక్ష్యాలను ఫోరెన్సిక్ లాబ్‌కి పంపించారు. నివేదికల కోసం ఎదురు చూస్తున్నామ’ని తెలిపారు. -
‘నేను అందమైన అదృష్టవంతురాలిని’
సాక్షి, న్యూఢిల్లీ : భర్త సహోద్యోగి, ఆర్మీ మేజర్ నిఖిల్ హండా చేతిలో దారుణ హత్యకు గురైన శైలజ ద్వివేది 2017లో మిసెస్ ఇండియా ఎర్త్ పోటిల్లో అమృత్సర్ తరుపున పాల్గొంది. పోటిల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. తన మనసుకు నచ్చినట్లే తన జీవితాన్ని గడుపుతాను అని చెప్పేంత తెగువ గల మహిళ శైలజ ద్వివేది. గత సంవత్సరం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గురించి, తన కుటుంబం గురించే కాక మన దేశంలో మహిళల భద్రత ఎలా ఉంది వంటి పలు అంశాల గురించి తన అభిప్రాయలను తెలియజేశారు. శైలజ ద్వివేది అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ‘‘చిన్నప్పటి నుంచి నా దేశం తరపున ఏదో ఒక పోటీలో పాల్గొనాలనే కోరిక నాలో చాలా బలంగా ఉండేది. రోజువారి జీవితంలో మహిళలు కుటుంబం కోసమే తప్ప తమ కోసం తాము జీవించటం లేదు. ఇక్కడ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడవారికి కూడా ఒక జీవితం ఉంటుంది. వారికంటూ కొన్ని కలలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. కుటుంబంతో పాటు వాటిని కూడా నెరవేర్చుకోవాలి. నా మనసుకు నచ్చి నేను ఈ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్నాను తప్ప నేనేంటో తెలియజేయాలనో, ఇంకేదో సాధించాలనే ఉద్దేశంతో మాత్రం కాదు’ కుటుంబం అంటే ఇలా ఉండాలి... ప్రేమించే భర్త, అల్లరి చేసే పిల్లలు వారి మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవాలతో కూడిన ఒక అనుబంధం ఉంటే అదే అసలు సిసలు కుటుంబం. అటువంటి కుటుంబంలోని వారంతా కలిసి పనిచేసుకుంటూ, తమ అభిప్రాయలను ఒకరితో ఒకరు పంచుకుంటూ సంతోషంగా ఉంటారు. అటువంటి కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అందమైన వ్యక్తినే నేను వివాహం చేసుకున్నాను మహిళల భద్రత... మహిళల భద్రత పట్ల మన దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో పాటు మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, వేధింపులు, యాసిడ్ దాడులు, గృహహింస వేధింపులు చూస్తుంటే మనం ఇంతటి భయంకర సమాజంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. ఖాళీ సమయాల్లో హిందీ సినిమాలు చూడ్డటం, పాటలు వినటం తనకు ఇష్టం. బాగా కబుర్లు చెప్పెవారంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందం, అదృష్టం కలిసిన అమ్మాయిని నేను’’. చదువులోనూ చురుకే... అందం మాత్రమే కాక చదువులోనూ ముందే ఉండేవారు శైలజ. ఒక్కసారి ఆమె విద్యాభ్యాసాన్ని పరిశీలిస్తే ట్రావేల్ అండ్ టూరిజమ్‌లో డిగ్రీ, ఆర్బన్ ప్లానింగ్‌లో ఎంటెక్, జియోగ్రఫీలో మాస్టర్స్ చేశారు. అంటే సాంప్రదాయ బద్దంగా డిగ్రీలో తీసుకున్న సబెక్ట్నే పీజీలో చదవకుండా నూతన అంశాలను ఎంచుకుంటూ కొత్తదనం అంటే ఎంత ఇష్టమే చెప్పకనే చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారన్న అక్కసుతో ఆమెను నిఖిల్ హండా అతి దారుణంగా గొంతు కోసి మరి చంపాడు. -
6 నెలల్లో 3500 ఫోన్ కాల్స్.. పొసెసివ్‌నెస్ వల్లే
సాక్షి, న్యూఢిల్లీ : సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిఖిల్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు, వివరాలు రాబట్టేందుకు అతడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణ అనంతరం పలు కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం... సహోద్యోగి, మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజను వివాహం చేసుకోవాలని భావించిన నిఖిల్.. శైలజను కలవడానికి ముందు రోజే తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఢిల్లీకి వచ్చి శైలజను తన హోండా సిటీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అందుకు శైలజ నిరాకరించడంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు. ఆ తర్వాత మీరట్‌కు వెళ్లిన అనంతరం కారును పూర్తిగా శుభ్రం చేశాడు. శైలజ, తన ఫోన్లలో ఉన్న కొన్ని అప్లికేషన్లను డెలిట్ చేశాడు. అంతేకాకుండా తన ఫోన్‌ను పూర్తిగా ధ్వంసం చేసి, ఇంటి సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో పడేశాడు. తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి శైలజను చంపేసినట్టు చెప్పాడు. అయితే ఆమెతో తనకు అంతగా చనువు లేదని తెలిపాడు. అయితే నిఖిల్ కారును పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు రక్తపు మరకలు, వేలి ముద్రలు, ముందు సీటు భాగంలో ఇరుక్కున్న తల వెంట్రుకలు గుర్తించారు. అవి శైలజకు సంబంధించినవిగా తేల్చారు. నిఖిల్ ఫోన్ డేటాను పరిశీలించినన పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 3500 సార్లు శైలజకు ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. శైలజ, నిఖిల్ ఫోన్లలో తొలగించిన యాప్స్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తుంటే శైలజ విషయంలో పొసెసివ్నెస్తోనే నిఖిల్ ఉన్మాదిగా మారినట్టు తెలుస్తోందని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే శైలజను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధం మాత్రం ఇంకా లభించలేదని ఆయన తెలిపారు. -
పోలీసు కస్టడీకి ఆర్మీ మేజర్ నిఖిల్
న్యూఢిల్లీ: సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్ నిఖిల్ హండాకు ఢిల్లీలోని ఓ కోర్టు 4 రోజుల పోలీసు కస్టడీ విధించింది. మేజర్‌ను పోలీసులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. హత్య చేయడానికి అతను వాడిన కత్తి, హత్యసమయంలో అతను ధరించిన డ్రెస్, ఇతర కీలక సాక్ష్యాధారాల వివరాలు రాబట్టేందుకు నిఖిల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు జడ్జిని కోరారు. దీంతో నిందితుణ్ని కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చింది. ఆర్మీ మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజ (35)ను ప్రేమించిన నిఖిల్, ఆమె పెళ్లికి నిరాకరించడంతో శనివారం హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం నిఖిల్‌ను మీరట్‌లో పోలీసులు అరెస్టు చేశారు. శైలజ గతేడాది మిస్ ఇండియా ఎర్త్ అందాల పోటీల్లో పాల్గొన్నారు. అంతకుముందు ‘మిస్ ఎర్త్ క్రియేటివ్’ పోటీలోనూ గెలుపొందారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. 2008లో మేజర్ అమిత్‌తో పరిచయం ఏర్పడగా, 2009లో వారి పెళ్లి జరిగింది. ఈ జంటకు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. 1959లో నానావటి కేసు నుంచి 2008 నీరజ్ కేసుదాకా.. అత్యంత క్రమశిక్షణ గల వారిగా భావించే త్రివిధ దళాల ఉద్యోగులు నేరాలకు పాల్పడిన ఘటనలు గతంలోనూ జరిగాయి. 1959– నానావటి కేసుఈ కేసు ఆధారంగా అనేక సినిమాలు, పుస్తకాలొచ్చాయి. కేఎం నానావటి అనే నౌకాదళ కమాండర్ 1959 ఏప్రిల్ 27న తన భార్య సిల్వియా ప్రేమికుడు ప్రేమ్ ఆహుజాను హత్య చేశాడు. స్థానిక కోర్టు నానావటిని నిర్దోషిగా విడుదల చేసినా, బాంబే హైకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. చివరకు బాంబే గవర్నర్, తొలి ప్రధానిæ నెహ్రూ సోదరి విజయలక్ష్మి ప్రజాభిప్రాయం ఆధారంగా నానావటికి క్షమాభిక్ష పెట్టారు. 1982– సికంద్ హత్య కేసు ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన ఎస్జే చౌదరి ఢిల్లీ వ్యాపారి కిషన్ సికంద్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానిక కోర్టు 26 ఏళ్లు విచారణ జరిపి ఆర్మీ అధికారికి జైలు శిక్షవేసింది. 2009లో ఢిల్లీ హైకోర్టు ఆ అధికారిని నిర్దోషిగా ప్రకటించి కేసు నుంచి విముక్తుణ్ని చేసింది. తర్వాత సుప్రీంకోర్టూ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. చౌదరి తన భార్య నుంచి విడిపోయి వేరుగా ఉంటుండటంతో కిషన్ ఆమెకు దగ్గరయ్యాడని, దీనిని భరించలేక చౌదరి సికంద్‌ను హత్యచేశాడని ఆరోపణ. 2007– మేఘా రాజ్దాన్ కేసు కెప్టెన్ మేఘా రాజ్దాన్ భారత ఆర్మీలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ రెజిమెంట్‌లో అధికారిణి. ఆర్మీ అధికారి కెప్టెన్ చైతన్య భత్వాడేకర్ను 2006లో పెళ్లాడారు. తర్వాత చైతన్య పుణెకు చెందిన ఓ అమ్మాయితో సంబంధంపెట్టుకున్న విషయం మేఘాకు తెల్సింది. తర్వాత చైతన్య వేధింపులు భరించలేక మేఘా 2007లోఆత్మహత్య చేసుకున్నారు. 2008–నీరజ్ గ్రోవర్ కేసు నటి మరియా సుసైరాజ్‌కు, నౌకాదళ అధికారి ఎమిలీ జెరోమ్‌కు 2008లో పెళ్లి సంబంధం కుదిరింది. నీరజ్ గ్రోవర్ అనే వ్యక్తితో మరియాకు సంబంధం ఉందన్న అనుమానంతో జెరోమ్ అతణ్ని హత్య చేశాడు. తర్వాత మరియా, జెరోమ్లు కలిసి నీరజ్ శరీరాన్ని ముక్కలుగా చేసి పడేశారు. త కేసులో జెరోమ్‌ను కోర్టు శిక్షించింది. సుసైరాజ్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. -
ఆర్మీ అధికారి భార్య హత్య కలకలం