NIM
-
హెచ్డీఎఫ్సీ నికరలాభం 5శాతం డౌన్
దేశీయ అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ గురువారం తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. కన్సాలిడేటేడ్ నికరలాభం జూన్ కార్వర్ట్‌లో 15శాతం పెరిగింది.కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ.23,239 కోట్ల నుంచి రూ.29,959 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం 5శాతం క్షీణించి రూ.3052 కోట్లుగా నమోదయ్యాయి. స్టాండ్‌లోన్ ఆదాయం రూ.12,990 నుంచి రూ.13,017 కోట్లకు పెరిగింది. ఇదే క్యూ1లో నికర వడ్డీ మార్జిన్ 3.3శాతం నుంచి 3.1శాతానికి తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో కోవిడ్-19 సంబంధిత కేటాయింపులు రూ.1199 కోట్ల మేరకు జరిపినట్లు కంపెనీ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,079 కోట్ల నుంచి 10శాతం పెరిగి రూ.3,392 కోట్లకు చేరింది. వ్యక్తిగత రుణఖాతాదారుల్లో 2శాతం మంది, కార్పోరేట్ రుణగ్రస్తుల్లో 2శాతం కంపెనీలు మారిటోరియంను వినియోగించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు శుక్రవారం నష్టంతో 3.50శాతం రూ.1811 వద్ద ముగిసింది. -
60 శాతం పెరిగిన కెనరా నికర లాభం
ట్రెజరీ ఆదాయం భారీ వృద్ధి ముంబై: కెనరా బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలానికి 60 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.409 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.656 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వి.ఎస్. కృష్ణకుమార్ చెప్పారు. గత క్యూ3లో రూ.77 కోట్లుగా ఉన్న ట్రెజరీ ఆదాయం ఈ క్యూ3లో రూ.301 కోట్లకు పెరిగిందని, అలాగే నగదు రికవరీ రూ.1,214 కోట్ల నుంచి రూ.4,427 కోట్లకు, ఫీజు ఆదాయం రూ.851 కోట్ల నుంచి 38 శాతం వృద్ధితో రూ. 1,176 కోట్లకు పెరిగిందని, వ్యయాలపై నియంత్రణ మంచి ఫలితాలనిచ్చిందని వివరించారు. వీటన్నింటి కారణంగా నికర లాభం భారీగా వృద్ధి చెందిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.2,380 కోట్లకు చేరిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.36 శాతానికి, అంతర్జాతీయంగా ఎన్ఐఎం 2.21 శాతం నుంచి 2.24 శాతానికి పెరిగిందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 3.35 శాతం, నికర మొండి బకాయిలు 2.42 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాని బాకీలకు కేటాయింపులు రూ.543 కోట్ల నుంచి రూ.952 కోట్లకు పెంచామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,095 కోట్ల రుణాలను పునర్వ్యస్థీకరించామని పేర్కొన్నారు. రుణాలు 9 శాతం వృద్ధితో రూ.3.12 లక్షల కోట్లకు, డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.4.62 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ 3.2 శాతం వృద్ధితో రూ.453 వద్ద ముగిసింది. -
సిండికేట్ బ్యాంక్ లాభం రూ. 409 కోట్లు షేరుకి రూ. 3 డివిడెండ్
బెంగళూరు: ప్రభుత్వ రంగ సంస్థ సిండికేట్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 409 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 592 కోట్లతో పోలిస్తే ఇది 31% తక్కువ. ప్రధానంగా నికర మొండిబకాయిలకు(ఎన్పీఏలు) కేటాయింపులు పెరగడం ప్రభావం చూపినట్లు బ్యాంక్ చైర్మన్ సుధీర్ కుమార్ జైన్ చెప్పారు. అంతేకాకుండా గత క్వార్టర్లో రూ. 114 కోట్లమేర మ్యాట్ క్రెడిట్ అదనంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఎన్పీఏ కేటాయింపులు రూ. 160 కోట్ల నుంచి రూ. 331 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కాగా, నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 7% పుంజుకుని రూ. 1,433 కోట్లను తాకగా, బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 4,781 కోట్ల నుంచి రూ. 5,357 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.97% నుంచి 2.79%కు తగ్గాయి. ఎన్పీఏలు 0.76% నుంచి 1.56%కు పెరిగాయి.పూర్తి ఏడాదికి..: పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం దాదాపు 15% క్షీణించి రూ. 1,711 కోట్లకు పరిమితంకాగా, అంతక్రితం రూ. 2,004 కోట్లను ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ. 18,295 కోట్ల నుంచి రూ. 19,945 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు 7% పతనమై రూ. 99 వద్ద ముగిసింది.