అమెరికాలో హక్కుల స్వరం...
బాలల హక్కులపై తమ స్వరాన్ని ప్రపంచ వ్యాప్తంగా వినిపించేందుకు ఢిల్లీకి చెందిన నైన్ ఈజ్ మైన్ సంస్థ సభ్యులు పదిహేను మంది న్యూయార్క్ వెళ్ళారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో నిర్వహించే అభివృద్ధి చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో భారత ప్రధాని అమెరికా పర్యటన కూడా జరగడంతో వారు తమ డిమాండ్లను ఆయనకూ వినిపించేందుకు ప్రయత్నించారు.
నైన్ ఈజ్ మైన్ నరేంద్రమోడీ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను పెట్టింది. బడ్జెట్ లో ప్రస్తుతం 3.5, 1గా ఉన్న విద్యకు... స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి ఆరుశాతం, ఆరోగ్యం కోసం వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్స్ (UNE) నుంచి ఐదు శాతం, కేటాయించాలని తమ నోట్ లో కోరింది. సంస్థ 2006 సంవత్సరం నుంచీ ఈ విషయంలో ప్రత్యేక పోరాటం జరపుతోంది. అన్ని బాలల హక్కులతోపాటు విద్యా, ఆరోగ్యం విషయంలోకూడా ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ ను అమలు పరచాలన్నదే తమ డిమాండ్ అని ప్రచార కన్వీనర్ స్టీవ్ రోచా తెలిపారు.
యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం తన బడ్జెట్లో 10, 11, 12 ప్రణాళికల్లో ఆరోగ్యానికి 1.7 శాతం నుంచీ 2 శాతం ఇచ్చిందనీ, అది ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క శాతం మాత్రమే ఉండటం శోచనీయమని రోచా అన్నారు. తాము జెనీవా వెళ్ళినపుడు ఓ దళిత బాలుడు భారత్ ను తీవ్రంగా విమర్శించిన ఘటన ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిందేనని రోచా అన్నారు. మినహాయింపుల సమస్యలపై అతడు ప్రశ్నించిన తీరు భారత సమాజం, ప్రభుత్వం తలెత్తుకోలేనిదని రోచా వివరించారు.
అలాగే హక్కుల బృందం నోట్ పై యూ ఎన్ ఏజెన్సీలు కూడ చర్చించాయని, కానీ ఇండియా అందులో లేదని అన్నాడు యువ బృందంలోని బాత్రా. తమ బృందం ఆరోగ్య, విద్య డిమాండ్లను గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చించినా.. సరిగా స్పందించలేదన్నారు. ''మేం నిజానికి మీకు సహాయం అందించగలం. ప్రభుత్వం కూడ కేటాయింపులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పౌరులుగా ఆరోగ్యం, ఆహారం, విద్య వంటి విషయాలపై చర్చించడం మీ కర్తవ్యం. అయితే మంచి ఆహారం తీసుకోవడం, బాగా చదువుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ విధి'' అని మంత్రిత్వ శాఖ అందని బాత్రా తెలిపారు.
అయితే ఇండియానుంచీ బాలల హక్కుల సాధనకోసం వెళ్ళిన పదిహేను మంది యువకుల బృందంలోని పూర్ణ మలావత్, కోన్ఘమ్ లు ఇంతకు ముందెప్పుడూ న్యూయార్క్ ను సందర్శించలేదు. దీంతో వారు న్యూయార్క్ పర్యటనను ఎంతో థ్రిల్ గా ఫీలయ్యారు. సినిమాల్లో స్సైడర్ మ్యాన్ వేలాడే ఆకాశహర్మ్యాల వంటి భవనాలను అక్కడ చూసి ముగ్ధులయ్యారు.
మలావత్ రెండేళ్ళక్రితం పదమూడేళ్ళ అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిన బాలిక. ఇప్పుడు ఆమె న్యూయార్క్ వెళ్ళిన బృందంలోని పదిహేను మంది సభ్యుల్లో ఒకరు. ఎనిమిదో తరగతి చదువుతున్న కోన్ఘమ్.. కూడ '' నేను ప్రపంచ శాంతి..న్యాయంకోసం సహాయం అడుగుతున్నాను'' అంటూ అధికారులకు తన స్వరం వినిపించాడు. మణిపూర్ లో నివసించే అతడు పుట్టిన కొన్నాళ్ళకే తల్లి కంటి కంటిచూపు కోల్పోయింది. తండ్రి భారత భద్రతా దళాలతో చంపబడ్డాడు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు చేయకపోవడం వల్లే ఆ అనర్థం జరిగిందన్న ఆలోచనతో కోన్ఘమ్ అలా అన్నాడు.
నిజానికి మిలీనియం డెవలప్ మెంట్ గోల్స్ పై ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు నైన్ ఈజ్ మైన్ వంటి కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని జవాబుదారీగా గా చేశాయి. ప్రస్తుత బడ్జెట్ లో స్మృతి ఇరానీ విద్యకు ఆరుశాతం గురించి మాట్లాడటం కూడ ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోందని, అందుకే హక్కులపై అవగాహనను ప్రజల్లో మరింత పెంచాల్సిన అవసరం కూడ ఉందంటారు నైన్ ఈజ్ మైన్ సభ్యులు.