nirmal area hospital
-
గర్భసంచి ఆపరేషన్ కోసం వస్తే.. ప్రాణాలు పోయాయి
నిర్మల్‌టౌన్: గర్భసంచి ఆపరేషన్ కోసం వస్తే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు, వైద్యుల వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వాంకిడి అనుబంధ గ్రామం చిన్నరాజురకు చెందిన లలిత(44) గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం నిర్మల్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకొచ్చా రు. సోమవారం లలితకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మంగళవారం ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో ముందుగా మత్తుమందును ఇచ్చారు. ఆపరేషన్ ప్రారంభిం చిన కొద్ది సేపటికి పరిస్థితి విషమించి లలిత మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లలిత మృతిచెందిందని ఆమె భర్త రాములు, బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద ఆందో ళన చేపట్టారు. డీఎంఅండ్‌హెచ్‌వో జలపతి నాయ క్, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ సురేష్, సీఐ జాన్‌దివాకర్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఆపరేషన్ నిర్వహించిన వైద్యురాలు రజిని, అనస్తిసియా నిపుణులు మృతి చెందిన విధానాన్ని వారికి వివరించారు. ఆపరేషన్ నిర్వహించిన సమయంలో లలితకు అకస్మాత్తుగా గుండెపోటు, ఫిట్స్ రావడంతోనే మరణించిందని తెలిపారు. రోగిని రక్షించేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదని వివరించారు. రోగి బంధువులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఐ జాన్‌దివాకర్ వారిని సముదాయించి పంపించారు. -
రైతు కుటుంబాన్ని మింగిన ఆర్థిక భారం
కడెం(ఖానాపూర్): నిర్మల్ జిల్లా కడెం మండలం లో ఆర్థిక భారం ఓ రైతు కుటుంబాన్ని మింగేసింది. అప్పుల బాధ తాళలేని భార్యాభర్తలు ఇద్దరూ శుక్రవారం క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, వారి పాప మహేశ్వరి (11 నెలలు) తల్లి పాలు తాగడంతో ఆ పాలే చిన్నారి పాలిట మృత్యుకోరలయ్యాయి. కడెం మండలంలోని ధర్మాజీపేట్‌కి చెందిన లక్ష్మి – భీమయ్య దంపతులకు నలుగురు ఆడపిల్లలు. పదేళ్ల క్రితం భీమయ్య మరణించడంతో ఒకే ఒక కుమారుడైన భీమేశ్‌పై కుటుంబ భారం పడింది. భూమిని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ నలుగురు అక్కలకు పెళ్లిళ్లు చేశాడు. దీంతో భీమేశ్‌ను ఆర్థిక భారం వెంటాడింది. రెండేళ్ల క్రితం శైలజతో వివాహం జరిగింది. వీరికి 11 నెలల పాప. అప్పుల బాధతో భార్యాభర్తలిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబసభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భీమేశ్ మృతిచెందగా, శనివారం తల్లిపాలు తాగిన చిన్నారి మహేశ్వరి మృతి చెందింది. చికిత్స పొందుతున్న శైలజ(31) సైతం ఆదివారం చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గట్టినేని బాలకృష్ణ తెలిపారు. -
వివాహితపై గ్యాంగ్ రేప్..
- అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు యువకులు - అక్కడకు వచ్చిన బాధితురాలి భర్తపైనా దాడి - నిందితులపై నిర్భయ కేసు నమోదు ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ పంచాయతీ పరిధి గల ఒడ్డెవాడ గ్రామానికి చెందిన ముగ్గురు టీనేజ్ యువకులు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితపై శనివారం రాత్రి లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 21 ఏళ్ల వయసు గల వివాహిత గ్రామ శివారులోని తన నివాసంలో ఉంది. ఆమె భర్త ఖానాపూర్‌కు పని కోసం వెళ్లాడు. ఈ సమయంలో ఆ ముగ్గురు యువకులు.. దండుగుల ధర్మపురి, కుంచపు గంగాధర్, 17 ఏళ్ల వయసు గల మైనర్ బాలుడు రాత్రి 10.30 గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లారు. తన భర్త ఇంట్లో లేడని ఆమె సమాధానం చెప్పగా ఆ యువకులు వెళ్లిపోయారు. మళ్లీ అరగంట తర్వాత మరోసారి రాత్రి 11 గంటలకు ఆమె ఇంటికి వెళ్లారు. అప్పటికీ ఆమె భర్త ఇంటికి రాకపోవడంతో ఇదే అదనుగా భావించిన యువకులు ఆ వివాహితను బలవంతంగా ఇంటి వెనుక భాగంలో గల గడ్డివాములోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు మొత్తం ముగ్గురూ వరుసగా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అప్పటికే గ్రామానికి చేరుకున్న ఆమె భర్త తన భార్య కోసం వెతుకుతుండగా సంఘటన స్థలంలోనే పడి ఉంది. వెంటనే ఆ యువకులు ఆమె భర్తపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. నిందితులపై నిర్భయ కేసు: బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
- వ్యాధి బారిన మరో యువతి - జిల్లాలో కలకలం - బెంబేలెత్తుతున్న ప్రజలు నిర్మల్ అర్బన్/బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. కాసిపేట మండలం రొట్టపల్లి గ్రామానికి చెందిన పోగుల సరోజ వ్యాధి బారిన పడి మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా లక్ష్మణచాంద మండలం బొప్పారం గ్రామానికి చెందిన యువతి(26) స్వైన్‌ఫ్లూ బారిన పడింది. మంగళవారం ఆమెకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానం వచ్చిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా.. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించినట్లు ఏరియా ఆస్పత్రి వైద్యుడు ధూంసింగ్ తెలిపారు. స్వైన్‌ఫ్లూగా నిర్ధారించి యువతికి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరిగా జిల్లాలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు బయటపడుతుండడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం, ప్రజలు ఎన్ని జాగ్రత్త లు తీసుకున్నా స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింది నీరులా విస్తరిస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావం వల్ల చల్లటి గాలికి స్వైన్‌ఫ్లూ వ్యాధి వేగంగా విస్తరిస్తోం ది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రభావం చూపిస్తోంది. తుమ్మినా.. దగ్గినా.. స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రభావం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరైనా ఆకస్మికంగా తుమ్మినా.. దగ్గినా.. జలుబుతో కనిపించిన భయంతో వణుకుతున్నారు. గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో ప్రజ లు అభద్రతాభావానికి గురవుతున్నారు. హెచ్1ఎన్1(స్వైన్‌ఫ్లూ) అనే అంటువ్యాధి ఇన్ప్లూయంజా ‘ఎ’ వైరస్ వల్ల వ్యాపిస్తోంది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా సోకుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పు డు, సాధారణంగా మాట్లాడుతున్న క్రమంలో నోటి నుంచి వెలువడే తుంపర్ల వల్ల వైరస్ వ్యాపిస్తుంది. ఫ్లూ వ్యాధి మాదిరిగా ఉండి ఊపిరితిత్తుల అంతర్భాగాలలో సోకి ప్రమాదకారిగా మారుతుంది. త్వరితగతిన వ్యాధి ముదిరి ప్రాణాపాయం జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందువల్ల అప్రమత్తతంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం తప్పా మరో మార్గం లేదు. సకాలంలో చికిత్స చేయించుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడడానికి వీలుంది. జాగ్రత్తలు.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు ఇతరులను కలిసే క్రమంలో చేతులు కలపడం(కరచాలనం) చేయవద్దు. కౌగిలించుకోవద్దు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తప్పనిసరిగా ముక్కును, నోటిని శుభ్రమైన గుడ్డతో చేతిని అడ్డం పెట్టుకోవాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నోటికి మాస్కులు ధరించాలి. గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాబట్టి సాధ్యమైనంత వరకు చల్లటి గాలిలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఇలా చేస్తే సరి.. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, విరేచనాలు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండడం వంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపించినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి. వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యుడి సలహాను పాటించాలి. ముఖ్యంగా బయట తిరగవద్దు, ఎక్కువగా నీళ్లు తాగాలి. పౌష్టికాహారాన్ని భుజించాలి. సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలి. స్వైన్‌ఫ్లూ బాధితురాలికి కలెక్టర్ పరామర్శ మంచిర్యాల టౌన్ : మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లూ బాధితురాలు పోగుల సరోజను కలెక్టర్ జగన్మోహన్ మంగళవారం పరామర్శించారు. స్థానిక టీఎన్జీఓస్ భవనంలో స్వైన్‌ఫ్లూపై అవగాహన సదస్సు ముగిసిన అనంతరం ఆయన నేరుగా ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. కాసిపేట మండలం రొట్టపల్లి గ్రామానికి చెందిన పోగుల సరోజ జనవరి 31న స్వైన్‌ఫ్లూ వ్యాధి బారిన పడగా సోమవారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స పొందుతున్న సరోజను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంటికి వెళ్తానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయడంతో.. చికిత్స పొందిన అనంతరం ఇంటికి వెళ్లాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్రావుతో మాట్లాడి బాధితురాలికి అందిస్తున్న వైద్య సేవలు తెలుసుకున్నారు. మందులు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని వైద్యులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రుక్మిణమ్మ ఉన్నారు.