తన భర్త ఇంట్లో లేడని ఆమె సమాధానం చెప్పగా ఆ యువకులు వెళ్లిపోయారు. మళ్లీ అరగంట తర్వాత మరోసారి రాత్రి 11 గంటలకు ఆమె ఇంటికి వెళ్లారు. అప్పటికీ ఆమె భర్త ఇంటికి రాకపోవడంతో ఇదే అదనుగా భావించిన యువకులు ఆ వివాహితను బలవంతంగా ఇంటి వెనుక భాగంలో గల గడ్డివాములోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు మొత్తం ముగ్గురూ వరుసగా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అప్పటికే గ్రామానికి చేరుకున్న ఆమె భర్త తన భార్య కోసం వెతుకుతుండగా సంఘటన స్థలంలోనే పడి ఉంది. వెంటనే ఆ యువకులు ఆమె భర్తపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.
వివాహితపై గ్యాంగ్ రేప్..
Published Mon, Sep 4 2017 1:20 AM | Last Updated on Tue, Sep 12 2017 1:46 AM
- అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు యువకులు
- అక్కడకు వచ్చిన బాధితురాలి భర్తపైనా దాడి
- నిందితులపై నిర్భయ కేసు నమోదు
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ పంచాయతీ పరిధి గల ఒడ్డెవాడ గ్రామానికి చెందిన ముగ్గురు టీనేజ్ యువకులు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితపై శనివారం రాత్రి లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 21 ఏళ్ల వయసు గల వివాహిత గ్రామ శివారులోని తన నివాసంలో ఉంది. ఆమె భర్త ఖానాపూర్‌కు పని కోసం వెళ్లాడు. ఈ సమయంలో ఆ ముగ్గురు యువకులు.. దండుగుల ధర్మపురి, కుంచపు గంగాధర్, 17 ఏళ్ల వయసు గల మైనర్ బాలుడు రాత్రి 10.30 గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లారు.
తన భర్త ఇంట్లో లేడని ఆమె సమాధానం చెప్పగా ఆ యువకులు వెళ్లిపోయారు. మళ్లీ అరగంట తర్వాత మరోసారి రాత్రి 11 గంటలకు ఆమె ఇంటికి వెళ్లారు. అప్పటికీ ఆమె భర్త ఇంటికి రాకపోవడంతో ఇదే అదనుగా భావించిన యువకులు ఆ వివాహితను బలవంతంగా ఇంటి వెనుక భాగంలో గల గడ్డివాములోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు మొత్తం ముగ్గురూ వరుసగా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అప్పటికే గ్రామానికి చేరుకున్న ఆమె భర్త తన భార్య కోసం వెతుకుతుండగా సంఘటన స్థలంలోనే పడి ఉంది. వెంటనే ఆ యువకులు ఆమె భర్తపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.
తన భర్త ఇంట్లో లేడని ఆమె సమాధానం చెప్పగా ఆ యువకులు వెళ్లిపోయారు. మళ్లీ అరగంట తర్వాత మరోసారి రాత్రి 11 గంటలకు ఆమె ఇంటికి వెళ్లారు. అప్పటికీ ఆమె భర్త ఇంటికి రాకపోవడంతో ఇదే అదనుగా భావించిన యువకులు ఆ వివాహితను బలవంతంగా ఇంటి వెనుక భాగంలో గల గడ్డివాములోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు మొత్తం ముగ్గురూ వరుసగా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అప్పటికే గ్రామానికి చేరుకున్న ఆమె భర్త తన భార్య కోసం వెతుకుతుండగా సంఘటన స్థలంలోనే పడి ఉంది. వెంటనే ఆ యువకులు ఆమె భర్తపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.
నిందితులపై నిర్భయ కేసు: బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement