nirmal mla
-
అమాత్య అల్లోల ...
ఆదిలాబాద్ :రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపుల్లో భాగంగా ఆయనకు న్యాయ, గృహ నిర్మాణ శాఖలు దక్కాయి. దీంతో ఆయన అనుచరవర్గంలో హర్షం వ్యక్తమైంది. నిర్మల్, సిర్పూ ర్ నియోజకవర్గాలతోపాటు, పలుచోట్ల టీఆర్ఎస్ శ్రేణులు ఆనందోత్సహాల్లో మునిగితేలాయి. ఐకే రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో కొనసాగారు. ఆయన వృత్తికి తగినట్లు గానే ఆయనకు న్యాయశాఖ దక్కింది. అలాగే గృహ నిర్మాణ శాఖ కూడా కేటాయించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న జోగు రామన్నకు బాధ్యతలు పెరిగాయి. అదనంగా బీసీ సంక్షేమ శాఖను ఆయనకు కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యం మరింత దక్కిం ది. రామన్నకు బీసీ సంక్షేమశాఖ కేటాయించడం పట్ల జిల్లాలోని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రేఖానాయక్ వర్గీయుల్లో ఆసంతృప్తి.. మంత్రివర్గ కూర్పులో జిల్లాలోని మహిళా ఎమ్మెల్యేలకు చుక్కెదురు కావడంతో అంతర్గతంగా అసంతృప్తులు రగులుతున్నాయి. మహిళా కోటాలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితోపాటు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ ఈ పదవులు ఆశించారు. కోవ లక్ష్మికి పార్లమెంటరీ సెక్రటరీ పదవి దక్కగా, రేఖ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోవ లక్ష్మికి పార్లమెంటరీ సెక్రటరీ పదవి దక్కడంపై ఆమె వైఖరి ఎలా ఉన్నా, ఆదివాసీ సంఘాలు మాత్రం భగ్గుమంటున్నాయి. ఆదివాసీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేతలు ఇంద్రవెల్లిలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తానని జోడేఘాట్‌కు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ఆదివాసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నలుగురికి కేబినెట్ హోదా.. ఉమ్మడి రాష్ట్రంలో పదవుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం జరుగ గా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడి నేతలకు ముఖ్యమైన పదవులు వరిస్తున్నాయి. 1984 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ జెడ్పీ చైర్మన్‌గా, ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి కలగానే మిగిలింది. ఇప్పుడు మంత్రి పదవి దక్కడంతో ఆయన చిరకాల వాంఛ నెరవేరినట్లయ్యింది. ఇంద్రకరణ్‌రెడ్డితో కేబినెట్ హోదా కలిగిన నేతల సంఖ్య జిల్లాలో నాలుగుకు చేరింది. మంత్రి జోగు రామన్న ఇప్పటికే కేబినెట్ మంత్రిగా కొనసాగుతుండగా, ప్రభుత్వ విప్‌గా నియమితులైన చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కూడా కే బినెట్ హోదా ఉంది. పార్లమెంటరీ సెక్రటరీ కోవ లక్ష్మి మాత్రం సహా య మంత్రి హోదాలో కొనసాగనున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిని ధిగా ఉన్న వేణుగోపాలచారి కూడా కేబినేట్ హోదాలోనే ఉన్నారు. -
20 ఏళ్లుగా దోబూచులాడిన మంత్రి పదవి..
హైదరాబాద్ : నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలలుగా ఊరిస్తూ వస్తున్న పదవి రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆయన ఎట్టకేలకు కారెక్కారు. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ పదవి దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా పనిచేయాలనే ఆయన చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. 20 ఏళ్లుగా దోబూచులాడిన మంత్రి పదవి ఇంద్రకర్ రెడ్డికి దక్కింది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి, సొంత చరిష్మాతో విజయం సాధించిన ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డిని కూడా టీఆర్ఎస్లో చేరేలా ఇంద్రకరణ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి కీలకమైన శాఖ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం.. ఇంద్రకరణ్‌రెడ్డికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరుంది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఆయన కీలక పదవులు అనుభవించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గం :ఆదిలాబాదు వ్యక్తిగత వివరాలు పుట్టిన తేదీ:16 ఫిబ్రవరి 1949 స్వస్థలం : నిర్మల్ మండలం ఎల్లపల్లి తండ్రి : తండ్రి నారాయణరెడ్డి భాగస్వామి: విజయలక్ష్మి విద్యార్హత : ఎల్ఎల్బి -
బెర్త్ ఖరారు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర మంత్రి వర్గంలో జిల్లాకు మరో బెర్తు దక్కింది. నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. ఆరు నెలలుగా ఊరిస్తూ వస్తున్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. కొత్తగా ఆరుగురికి మంత్రి వర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఇందులో ఇంద్రకరణ్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పార్లమెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. మంత్రి పదవి రేసులో జిల్లాకు చెందిన ఈ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అనుకున్నట్లుగానే వారికి పదవులు దక్కాయి. ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ పదవి దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా పనిచేయాలనే ఆయన చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరుతోంది. మంగళవారం ఆయన రాజధానిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఏడాది జూన్‌లో తెలంగాణ రాష్ట్ర సర్కారు తొలి మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఒక్కరికే చోటు దక్కింది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి, సొంత చరిష్మాతో విజయం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డిని కూడా టీఆర్ఎస్లో చేరేలా ఇంద్రకరణ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి కీలకమైన శాఖ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన తెగకు చెందిన కోవ లక్ష్మికి పదవి ఇవ్వడం ద్వారా గోండు వంటి ఆదివాసీలకు ప్రాధాన్యత ఇచ్చారనే భావన వ్యక్తమవుతోంది. తొలిసారిగా ఎమ్మెల్యే విజయం సాధించినా ఆమెకు ఈ పదవి దక్కింది. మంత్రి వర్గంలో చోటు ఖరారైన సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డితో కలిసి ఆయన సీఎంకుకృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పదవి ఖాయం కావడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు అనుచరవర్గం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరు నేతలు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చూసేందుకు హైదరాబాద్ తరలివెళ్లారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం.. ఇంద్రకరణ్‌రెడ్డికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరుంది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఆయన కీలక పదవులు అనుభవించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు.