Nirvana
-
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
ముగ్గురి ఆశలు ఖుషి పైనే..
-
ఉత్తుంగ తరంగ గంగ
తన పితరులకు మోక్షం కలిగించడం కోసం భగీరథుడనే మహారాజు ఎన్నో ప్రయత్నాలు చేసి, దివినున్న గంగను భువికి రప్పించాడు. అయితే, అలా కిందికి వచ్చే క్రమంలో గంగ తన మార్గంలో వున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని తన ఉత్తుంగ తరంగాలతో ముంచెత్తింది. కుపితుడైన జహ్నుమహర్షి తన ఆశ్రమాన్ని ధ్వంసం చేసిన గంగానదిని తన యోగశక్తితో ఔపోసన పట్టాడు. మహర్షి ద్వారా జరిగింది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని పరిపరి విధాలా ప్రార్థించాడు. మహర్షి గంగను తన కుడిచెవి నుండి విడిచిపెట్టాడు. జహ్నుమహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయింది. గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల భస్మరాశులపై ప్రవహించి వారికి ఉత్తమగతులను ప్రసాదించింది. గంగను భువికి రప్పించే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, వెనక్కు తగ్గకుండా, ఏమాత్రం చలించకుండా తన ప్రయత్నంలో సఫలీకృతుడైన భగీరథుడి పేరు ప్రయత్న రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పవిత్రమైన గంగలో మునిగితే ఎంతటి పాపమైనా తొలగిపోతుందన్నది ప్రగాఢ విశ్వాసం. అయితే, అంతటి పవిత్రమైన గంగను కూడా కలుషితం చేసి, నిర్మలమైన గంగాజలాలను విషపూరితం చేసేస్తున్నాయి పరిశ్రమల వ్యర్థాలు, కర్మాగారాల నుంచి వెలువడే విషరసాయనాలు. దాంతో గంగలో స్నానం చేస్తే సంక్రమించే పుణ్యం సంగతి ఎలా ఉన్నా, చర్మవ్యాధులు సంక్రమిస్తాయేమోనని భయపడ వలసి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే గంగాప్రక్షాళన జరగాలి. అందుకు చిత్తశుద్థితో చెత్తశుద్ధి జరగాలి. గంగ అంటే నదే కాదు, నీరు కూడా. నీటితో మనం శుభ్రపరచుకోవడమే కాదు, నీటిని కలుషితం చేయడం మానాలి. నీళ్ల సీసాలు, చెత్తాచెదారాన్ని నీళ్లలో పడేయడం మానాలి. గంగాప్రక్షాళన్ పేరుతో ప్రధాని ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ప్రధానమైన మార్పు రావలసింది ముందుగా మనలోనే. – డి.వి.ఆర్. -
కాలిబాట వదిలితేనే పైరు పదిలం
వరి నాట్లలో సమగ్ర యాజమాన్యం తప్పనిసరి ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ సంపత్‌కుమార్ అనంతపురం అగ్రికల్చర్: వరి పంట వేసే రైతులు అధిక దిగుబడుల కోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. సమగ్ర సాగు పద్ధతులు వరి నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే పొలాన్ని దుమ్మ చేయడం ప్రారంభించి రెండు మూడు దఫాలుగా మురగబెట్టాలి. పొలమంతా సమానంగా చెక్కతోకాని ఇతరత్రా పరికరంతో చదను చేసుకోవాలి. రేగడి భూముల్లో రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమం పూర్తి చేసి నాట్లు వేసుకోవాలి. నారు తీసే సమయంలో మొక్కలు లేత ఆకుపచ్చగా ఉండాలి. నాలుగు నుంచి ఆరు ఆకులున్నపుడు నాటాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గుతాయి. చదరానికి 33 మూనలు (మొక్కలు) ఉండేలా నాటుకోవాలి. ప్రతి రెండు మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్లు (సెం.మీ) కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి తగ్గుతుంది. అలాగే కలుపు మందులు పిచికారి, ఎరువుల వేయడానికి అనువుగా ఉంటుంది. భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేలా నాటాలి. ముదురు నారు నాటినపుడు కుదుళ్ల సంఖ్య పెంచి, కుదురుకు నాలుగైదు మొక్కలు నాటాలి. అలా నాటినపుడు నత్రజని మామూలుగా వేసేదాని కన్నా 25 శాతం ఎక్కువ వేయాలి. నీరు తక్కువగా పెట్టి నాట్లు వేసుకోవాలి. ఎరువులు, కలుపు నివారణ ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ అవసరం. నత్రజనిని మూడు భాగాలుగా చేసి దమ్ము, దబ్బు, అంకురం దశలో వేసుకోవాలి. భాస్వరం ఒకేసారి వేసుకోవాలి. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఒకేసారి, తేలికపాటి నేలల్లో సగం దమ్ము సమయంలోనూ మిగతా సగం అంకురం దశలో వేయాలి. నాటిన మూడు నాలుగు రోజుల్లోగా నీరు పలుచన చేసి ఎకరాకు ఒక లీటర్ బుటాక్లోర్ లేదా అర లీటర్ ప్రెటిటాక్లోర్ లేదా అర లీటర్ అలిలోఫాస్ 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లితే కలుపు సమస్య తగ్గుతుంది. నాటిన 15 నుంచి 20 రోజుల సమయంలో ఎకరాకు 50 గ్రాములు ఇథార్స్‌సల్యురాన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నాట్లు వేసిన రెండు నుంచి ఆరు వారాల్లో పైరు సరిగా ఎదగక జింకులోపం రావచ్చు. ముదురాకు చివర్లో, మధ్య అనెకు ఇరువైపులా తుప్పు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడుతాయి. దీని నివారణకు 2 గ్రాములు జింక్‌సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి.