Nizampeta
-
పదవి కాపాడుకునేందుకు మేయర్ పడరాని పాట్లు!
కుత్బుల్లాపూర్: శివారు ప్రాంత రాజకీయం రసవత్తరంగా మారుతుంది.. ఇప్పటికే నగరం నగర శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలు.. నగర పంచాయతిలలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారుతూ తమ అధిష్టానానికి ఝలక్ ఇస్తున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికార టిఆర్ఎస్ కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు ఆస్కారం ఇవ్వడంతో మేయర్ ఒక మెట్టు దిగి ప్రతి ఒక కార్పొరేటర్‌కు ఎంతో కొంత ముట్టజెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ► కాగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2019 జనవరి నెలలో జరిగాయి. ఈ ప్రాంతంలో మొత్తం 27 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు గెలుపొందగా ఆరు గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మెజారిటీ సభ్యులు ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ లో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ రాజులు కలిసి కొలను నీలా గోపాల్‌రెడ్డిని మేయర్‌గా, డిప్యూటీ మేయర్ ధనరాజ్‌యాదవ్‌లను ఎంపిక చేశారు. అంతవరకు బాగానే ఉంది రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి ప్రయాణం మూడవ సంవత్సరం దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్ మొదలైంది. క్యాంపు రాజకీయాలకు... ► మొత్తం 27 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా వారిలో ఏకంగా 17 మంది స్థానిక టీఆర్ఎస్ నేతతో గత నెలలో శ్రీశైలం టూర్ కి వెళ్లి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. దీంతో ఏదో జరిగిపోతుందన్న ఆందోళనతో మేయర్ భర్త గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే వివేకానందలకు ఈ విషయా న్ని చేరవేశారు. క్యాంపులో ఉన్న 17 మందితో పాటు మరో ముగ్గురు కార్పొరేటర్లు జత కలవడంతో వారి సంఖ్య ఏకంగా 20 కి చేరింది. దీంతో ‘రాజీ’ఫార్ములాకు వచ్చిన మేయర్ భర్త ఒ క్కొక్కరికి ఇంత చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో మరోసారి ఆ నో టా.. ఈ నోటా ఈ ఒప్పందం విషయం బహిర్గతం కావడంతో ఆయా పార్టీల నాయకులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా స్వతంత్రంగా గెలిచిన ఆరుగురు కార్పొరేటర్లు ఈ విషయంలో తటస్థంగా ఉండడం విశేషం. గిట్టని వాళ్ల పని ఇది... ► ఈ విషయంపై నిజాంపేట మేయర్ భర్త గోపాల్ రెడ్డిని వివరణ కోరగా ఖండించారు. కొంతమంది గిట్టనివాళ్లు ఇలా చెప్పుకుంటున్నారని, తాను ఎందుకు డబ్బులు ఇస్తానని ప్రశ్నించారు. అదంతా అబద్ధపు ప్రచారమని, తాను ఎవరికీ డబ్బులు ఇస్తానని చెప్పలేదు అంటూ వివరణ ఇచ్చారు. -
మూణ్నెళ్ల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే
ఇల్లెందు: క్షణికావేశంలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇద్దరిలో భర్త పరిస్థితి విషమంగా ఉంది.. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని నిజాంపేట పంచాయతీ రేపల్లెవాడకు చెందిన భూక్యా వేణు మూడు నెలల కిందట సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలలకే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పురుగులమందు తాగేలా చేసింది. వేణు కలుపు నివారణకు కొట్టే మందు తాగగా సంధ్య విత్తనశుద్ధి చేసే మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వారిని ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఖమ్మానికి తరలించారు. వేణు పరిస్థితి విషయంగా ఉంది. వేణుకు తల్లి చీన్యా, సోదరుడు వీరన్న ఉండగా సంధ్యకు మాత్రం తల్లిదండ్రులు లేరు. రేపల్లెవాడలో తన పిన్ని ఇంటి వద్ద ఉండి బీఫార్మసీ వరకు చదువుకుంది. చదవండి: కలెక్టరేట్లో గన్‌మెన్‌గా భర్త.. రోడ్డుపై విగతజీవిగా భార్య చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
బాబోయ్ డంపు.. తట్టుకోలేక ప్రజలు..
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్‌లోని డంపింగ్ యార్డుతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలాకాలం నుంచి దీనిని ఇక్కడ నుంచి తరలించాలని అధికారులను వేడుకుంటున్నా ఎవరూ స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం బాచుపల్లిలోని సర్వే నెంబర్ 186లో ప్రభుత్వ స్థలంలో అధికారులు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అయితే నిత్యం యార్డు నుంచి వెలువడే దుర్వాసనలు, చెత్తను కాల్చడంతో ఎగసి పడుతున్న మంటలు, పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి ఇక్కడ నుంచి తరలించాలనే డిమాండ్ ప్రజల్లో ఊపందుకుంది. డంపింగ్ యార్డుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ► నిజాంపేట్ కార్పొరేషన్ బాచుపల్లిలోని సర్వే నంబర్ 186లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో చెత్త డంపింగ్ యార్డును గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. ► రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో ఇళ్ల నుంచి సేకరించిన చెత్త టన్నుల కొద్దీ పెరుగుతోంది. ఇలా ప్రతి రోజు నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లోని 96 కాలనీల్లో, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి సుమారు 120 టన్నులకు పైగా చెత్తను సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ► అయితే ఇక్కడ చెత్తను ఇక్కడ వేరు చేసి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించడం అసలు ఉద్దేశం. ► కానీ నేడు ఏకంగా ఇక్కడే డంపింగ్ యార్డు ఏర్పాటైంది. దీంతో డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. విష వాయువులతో ఉక్కిరి బిక్కిరి... ► చెత్త తరచూ తగులబెడుతుండటంతో డంపింగ్ యార్డు రావణ కాష్టంలా నిత్యం మండుతూనే ఉంది. ► గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆసుపత్రి వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. ► అయితే ఈ చెత్తను సిబ్బందే తగుల బెడుతున్నారా.? లేక ఏదైనా రసాయన చర్య వల్ల మండుతోందా.. అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. ► ఈ మంటలతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ► అసలే దుర్వాసన ఆపై ఘాటైన పొగతో ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ► మంటల మూలంగా వాతావరణంలో అనేక వాయువులు విడుదల అవుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఆందోళనలో స్థానికులు.. ► డంపింగ్ యార్డు ఏర్పాటుతో తమకు ప్రశాంత జీవనం కరువైందని హిల్ కౌంటీ, సాయినగర్ కాలనీ, అదిత్య గార్డెన్, రాజీవ్ గృహకల్ప, బండారి లేఅవుట్, జర్నలిస్ట్ కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డంపింగ్ యార్డు పక్కనే నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభైతే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. విష జ్వరాల బారిన ప్రజలు... ► డంపింగ్ యార్డు కారణంగా రోజుల తరబడి చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు మలేరియా, డెంగీ లాంటి విషజ్వారా -
గడ్డపారతో దాడి, ఆపై కరెంట్ షాక్
సాక్షి, రామాయంపేట(మెదక్): కొడుకు పెట్టే బాధలు భరించలేక కన్న తండ్రి కర్కశంగా మారాడు. మరో వ్యక్తి సహకారంతో కన్న కొడుకునే కాటికి పంపాడు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ వెల్లడించారు. గ్రామానికి చెందిన కుమ్మరి స్వామి (40) జులాయిగా తిరుగుతూ తన తల్లిదండ్రులతో పాటు భార్యాపిల్లలను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అతడి బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్వామి మద్యం సేవించి తరచూ తన తల్లిదండ్రులతో గొడవపడుతూ ఉండేవాడు. దీంతో కొడుకును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అతడి తండ్రి బాలయ్య ప్రయత్నాలు చేశాడు. చదవండి: డబ్బుల కోసం వేధించి.. గొంతు నులిమి చంపేశాడు అదే గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్ రమేశ్‌తో కలిసి స్వామిని ఈ నెల 13వ తేదీ రాత్రి హతమార్చాలని వ్యూహం పన్నాడు. కరెంటు షాక్‌తో హతమార్చాలని వేసుకున్న ప్లాన్ అమలు కాలేదు. దీంతో ఇంట్లో పడుకున్న స్వామిపై గడ్డపార, రాడ్డుతో దాడిచేసి హతమార్చారు. స్వామి చనిపోలేదనే అనుమానంతో కరెంట్ షాక్ కూడా పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానంతో బాలయ్య, రమేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిందంతా చెప్పారు. చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..! మహిళా ఏఈఓ ఆత్మహత్య నంగునూరు (సిద్దిపేట) : రుణాలు ఇచ్చే యాప్స్‌కి మరో ప్రాణం బలైంది. ఓ యాప్ ద్వారా తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో డిఫాల్టర్ అని ఫోన్‌కు మెసేజ్ రావడంతో మనస్తాపం చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. నంగునూరు మండలం రాజగోపాల్‌పేట గ్రామానికి చెందిన కిర్ని మౌనిక (24) మండలంలోని ఖాత గ్రామ క్లస్టర్‌లోని కొండంరాజ్పల్లి, ఘణపూర్ గ్రామాల వ్యవసాయ విస్తరణాధికారిగా విధులు నిర్వహిస్తోంది. ఏడాది కిందట స్నాపిట్ యాప్ ద్వారా రుణం తీసుకుంది. కొన్ని నెలల నుంచి ఈఎంఐ చెల్లించడం లేదు. దీంతో సంస్థ నుంచి ఆమెకు డిఫాల్టర్ అని మెసేజ్‌లు రావడంతో పాటు రుణం తీసుకున్న ఉద్యోగిని ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికీ ఆ సంస్థ ఈ మెసేజ్‌లు పంపింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయతి్నంచింది. వెంటనే ఆమెను సిద్ది పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచగా, మెరుగైన వైద్యం కోసం అదేరోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. -
నిజాంపేట్‌లో అపార్ట్మెంట్లకు ఏమైంది!
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సదరు నిర్మాణాలు పూర్తయినా కూడా వాటిని వదిలిపెట్టడం లేదు. ఇటీవల నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ గోపి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా నిర్మించిన 103 భవనాలను గుర్తించి సీజ్ చేశారు. గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్నప్పుడు అనుమతులతో జీ ప్లస్–4 అంతస్తులు నిర్మించారు. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ మూడు గ్రామాలు కలిపి కార్పొరేషన్‌గా గత సంవత్సరం ఏర్పాటైంది. అంతకు ముందు వచ్చే నుంచే విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కమిషనర్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడంతో యజమానులు, కాంట్రాక్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి బిల్డర్లు నిర్మాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ముకుందరెడ్డి గత ఏడాది నవంబరు 1న అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ ఏడాది మే 16న ప్రస్తుత కమిషనర్ గోపి సుమారు 1000కి పైగా అక్రమ నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖ రాశారు. కరోనా ప్రభావం, ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేయడం పనులు నిలిచాయి. యథాతథంగా పనుల నిర్వహణ.. కార్పొరేషన్ అధికారులు ఇటీవల సీజ్ చేసిన భవనాల్లో యథాతథంగా పనులు కొనసాగుతున్నాయి. సీజ్ చేసిన తర్వాత అధికారులు తమ పని పూర్తయినట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పనులు జరుగుతున్న విషయం తెలిసినా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ప్రాథమిక దశలోనే నిర్మాణాలను అడ్డుకుంటే ఎవరికీ నష్టం జరగదని, నిర్మాణం పూర్తయిన తర్వాత సీజ్ చేస్తే ఎలా అని పలువురు ఆరోపిస్తున్నారు. ఏమాత్రం ఉపేక్షించం.. సీజ్ చేసిన అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశాం. అనుమతులకు సంబంధించిన పత్రాలను తమకు ఇవ్వాలని కోరాం. అన్నీ పరిశీలించిన తర్వాతే అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు. ఇప్పటికే 103 భవనాలను సీజ్ చేశాం. – గోపి, కమిషనర్, నిజాంపేట్ కార్పొరేషన్ -
నిజాంపేటలో కారు జోరు.. కార్పొరేషన్ కైవసం
సాక్షి, హైదారాబాద్ : రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. నిజాంపేట కారు తిరుగులేని జోరును ప్రదర్శించి కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 22 డివిజన్లలో ఫలితాలు వెలువడగా.. 19 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడు డివిజన్లలో దయాకర్‌రెడ్డి ప్యానల్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కార్పొరేషన్ కైవసం చేసుకోవాలంటే 17 డివిజన్లలో విజయం సాధించాలి. టీఆర్ఎస్ ఇప్పటికే 19 డివిజన్లలో విజయం సాధించింది. టీఆర్ఎస్ భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నిజాంపేటకు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు నిజాంపేటలో పోలింగ్ కౌంటింగ మందకొడిగా సాగుతోంది. తుది ఫలితం వెలువడేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాపతంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్ శాతం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే నమోదైంది. తక్కువ పోలింగ్ శాతం నమోదైనప్పటికీ ఫలితాలు వెల్లడిలో మాత్రం తీవ్రమైన ఆలస్యం నెలకొంది. ఇక బోడుప్పల్(28)లో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్7, బీజేపీ 2, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. ఫిర్జాదిగూడ 26 స్థానాలకు గాను 16 స్థానాలను కారు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మూడు స్తానాల్లో గెలుపొందింది. జవనహార్ నగర్లో కూడా కారు జోరు కొనసాగింది. 26 స్థానాలకు గాను టీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 3, బీజేపీ 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. -
25వేలకే తులం బంగారం ఇస్తానంటూ..!
హైదరాబాద్: ఆయన పేరు దొరబాబు. నిజాంపేటలో అశోకా జెమ్స్ అండు జువెల్లరీ పేరిట ఓ బంగారు అభరణాల దుకాణాన్ని నిర్వహిస్తున్న దొరబాబు గతంలో మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కస్టమ్స్ అధికారులు చాలామంది తనకు తెలుసునని, వారి ద్వారా కేవలం రూ. 25వేలకు తులం బంగారం ఇప్పిస్తానని మహిళల్ని నమ్మించాడు. దీంతో 20 మహిళలు అతనికి ఏకంగా రూ. 80 లక్షల వరకు చెల్లించారు. ఇదిగో బంగారం అదిగో బంగారం అంటూ ఊరించిన దొరబాబు చెప్పాపెట్టకుండా మాయమయ్యాడు. అతడు ఎంతకూ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. నిజాంపేట్‌లో రూ.25వేలకే తులం బంగారం పేరిట మహిళల్ని మోసం చేసిన దొరబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.