సాక్షి, రామాయంపేట(మెదక్): కొడుకు పెట్టే బాధలు భరించలేక కన్న తండ్రి కర్కశంగా మారాడు. మరో వ్యక్తి సహకారంతో కన్న కొడుకునే కాటికి పంపాడు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ వెల్లడించారు. గ్రామానికి చెందిన కుమ్మరి స్వామి (40) జులాయిగా తిరుగుతూ తన తల్లిదండ్రులతో పాటు భార్యాపిల్లలను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అతడి బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్వామి మద్యం సేవించి తరచూ తన తల్లిదండ్రులతో గొడవపడుతూ ఉండేవాడు. దీంతో కొడుకును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అతడి తండ్రి బాలయ్య ప్రయత్నాలు చేశాడు. చదవండి: డబ్బుల కోసం వేధించి.. గొంతు నులిమి చంపేశాడు
అదే గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్ రమేశ్‌తో కలిసి స్వామిని ఈ నెల 13వ తేదీ రాత్రి హతమార్చాలని వ్యూహం పన్నాడు. కరెంటు షాక్‌తో హతమార్చాలని వేసుకున్న ప్లాన్ అమలు కాలేదు. దీంతో ఇంట్లో పడుకున్న స్వామిపై గడ్డపార, రాడ్డుతో దాడిచేసి హతమార్చారు. స్వామి చనిపోలేదనే అనుమానంతో కరెంట్ షాక్ కూడా పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానంతో బాలయ్య, రమేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిందంతా చెప్పారు. చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..!
మహిళా ఏఈఓ ఆత్మహత్య
నంగునూరు (సిద్దిపేట) : రుణాలు ఇచ్చే యాప్స్‌కి మరో ప్రాణం బలైంది. ఓ యాప్ ద్వారా తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో డిఫాల్టర్ అని ఫోన్‌కు మెసేజ్ రావడంతో మనస్తాపం చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. నంగునూరు మండలం రాజగోపాల్‌పేట గ్రామానికి చెందిన కిర్ని మౌనిక (24) మండలంలోని ఖాత గ్రామ క్లస్టర్‌లోని కొండంరాజ్‌పల్లి, ఘణపూర్ గ్రామాల వ్యవసాయ విస్తరణాధికారిగా విధులు నిర్వహిస్తోంది. ఏడాది కిందట స్నాపిట్ యాప్ ద్వారా రుణం తీసుకుంది. కొన్ని నెలల నుంచి ఈఎంఐ చెల్లించడం లేదు. దీంతో సంస్థ నుంచి ఆమెకు డిఫాల్టర్ అని మెసేజ్‌లు రావడంతో పాటు రుణం తీసుకున్న ఉద్యోగిని ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికీ ఆ సంస్థ ఈ మెసేజ్‌లు పంపింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయతి్నంచింది. వెంటనే ఆమెను సిద్ది పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచగా, మెరుగైన వైద్యం కోసం అదేరోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment