nizerian
-
అసలు పేరు చెప్పిన డెత్ సర్టిఫికెట్!
సాక్షి, హైదరాబాద్: ఇక్కడి పోలీసులు అరెస్టు చేసినా... తమ పాస్‌పోర్టు స్వాదీనం చేసుకున్నా...లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేసినా... రాకపోకలు, దందాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి నైజీరియన్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ దేశంలోనే అసలు, నకిలీ పేర్లతో రెండు పాస్‌పోర్టులు తీసుకుంటున్నారు. అసలుది దాచేసి, నకిలీ పేరుతో తీసుకున్న దాంతోనే ప్రయాణాలు చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడూ ఇందులోని పేరే చెప్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), నారాయణగూడ ఠాణా అధికారులు ఇటీవల అరెస్టు చేసిన వసిగ్వీ చిక్వమేక జేమ్స్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడి అసలు పేరు, వివరాలు సైతం ఓ డెత్ సర్టిఫికెట్ ద్వారా బయటకు వచ్చాయి. డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్లు అవలంభిస్తున్న కొత్త పంథా ఇదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. గోవాకు వచ్చిపోతూ డ్రగ్స్ దందా... నైజీరియాకు చెందిన వసిగ్వీ జేమ్స్ 2013 నుంచి టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిపోతున్నాడు. 2016, 2019ల్లోనూ రాకపోకలు సాగించిన ఇతడికి గోవా, బెంగుళూరుల్లో ఉండే డ్రగ్ పెడ్లర్స్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ జాక్స్ సరఫరా చేస్తున్న సింథటిక్ డ్రగ్స్‌కు అక్కడి పెడ్లర్స్‌కు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు. ఇలాంటి నేరాలు చేస్తూ చిక్కిన వారి నుంచి పోలీసులు పాస్‌పోర్టు స్వాదీనం చేసుకుంటారు. వీళ్లు బెయిల్ పొందినా దేశం దాటి వెళ్లిపోకుండా విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తారు. తనకు ఇలా జరిగితే స్వదేశానికి వెళ్లడం ఇబ్బందని భావించాడు. దీంతో 2021 నవంబర్ 19న నైజీరియాలోనే అలమాంజో మాసెక్సూ్య పేరుతో మరో పాస్‌పోర్టు తీసుకున్నారు. నకిలీవి వాడుతూ వ్యవహారాలు.. డబ్బు అవసరమైన ప్రతిసారీ భారత్‌కు వచ్చి డ్రగ్స్ దందా చేయడం మొదలెట్టాడు. ఈ నకిలీ పేరుతో తీసుకున్న పాస్‌పోర్టు వాడి 2021–22ల్లో గోవాకు వచ్చాడు. తనకు పరిచయం ఉన్న కస్టమర్లను డ్రగ్స్ అమ్ముతూ ఈ ఏడాది మార్చిలో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆ సందర్భంలో అలమాంజో పేరు చెప్పి, దాంతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. మూడు వారాలు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్లీ దందా మొదలెట్టాడు. తాజాగా గత వారం నారాయణగూడ పరిధిలోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేయడానికి వచ్చి హెచ్–న్యూ పోలీసులకు చిక్కాడు. ప్రాథమిక విచారణలో తన పేరు అలమాంజో అని చెప్తూ ఆధారంగా ఆ పేరుతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. సాధారణ దర్యాప్తులో భాగంగా అధికారులు అతడి సెల్‌ఫోన్‌ను విశ్లేషించారు. ఆమె డెత్ సర్టిఫికెట్తో గుట్టురట్టు... ఇందులోని ఈ–మెయిల్స్, ఇతర పత్రాల్లో వసిగ్వీ జేమ్స్ అనే పేరు కనిపించింది. దీనిపై ప్రశ్నించగా... అసలు ఆ ఫోనే తనది కాదంటూ తప్పించుకున్నాడు. గోవాలో తనతో సహజీవనం చేసిన ఓ యువతి గతంలోనే అనారోగ్యంతో మరణించిందని, ఆమె మీద ఒట్టేసి చెప్తున్నానంటూ బుకాయించాడు. అయితే అనుమానం నివృత్తి కాని దర్యాప్తు అధికారులు ప్రతి ఈ–మెయిల్‌ను విశ్లేషించారు. ఓ మెయిల్లో సదరు యువతికి సంబంధించిన డెత్ సరి్టఫికెట్ లభించింది. అందులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆమె పేరుతో పాటు భర్తగా వసిగ్వీ చిక్వమేక జేమ్స్ పేరు ఉంది. దీని ఆధారంగా పోలీసులు అతగాడిని తమదైన శైలిలో విచారించారు. దీంతో తన అసలు పేరు అదేనని అంగీకరించడంతో పాటు అలా ఎందుకు చేశాడో వివరించాడు. ఇటీవల అనేక మంది నైజీరియన్లు ఇలానే చేస్తున్నట్లు బయటపెట్టడంతో అ«ధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై ఆ దేశ ఎంబసీకి లేఖ రాయాలని నిర్ణయించారు. (చదవండి: మునా‘వార్’... కామెడీ షో కోసం వస్తున్న మునావర్ ఫారూఖీ) -
గిఫ్ట్ ఫ్రాడ్ కేసులో నైజీరియన్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ కస్టమ్స్ అధికారిగా ఫోన్ చేసి అందినకాడిక దండుకుంటున్న నైజీరియన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీసీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. ఈస్ట్ మారెడ్‌పల్లికి చెందిన ఓ మహిళకు యూకేకు చెందిన డాక్టర్ హెర్మన్ లియోన్ అనే పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగా ఆమెకు హెర్మన్ వాట్సాప్ నంబర్‌ను ఇచ్చాడు. తక్కువ సమయంలో వీళ్లిద్దరు మంచి స్నేహితులయ్యారు. యూకే నుంచి 40 వేల పౌండ్ల విలువైన పార్సిల్‌ను బహుమతిగా పంపిస్తున్నానని హెర్మన్ తెలిపాడు. పార్సిల్ కోసం మనీ లాండరింగ్ చార్జీలు, ఆదాయ పన్ను, బీమా వంటి రకరకాల చార్జీలు చెల్లించాలని తెలపగా.. వేర్వేరు ఖాతాలకు రూ.38.57 లక్షలు సమర్పించుకుంది. ఎంతకీ పార్సిల్ ఇంటికి రాకపోవటంతో నిరాశ చెందిన సదరు మహిళ.. తాను మోసపోయానని తెలుసుకొని గతేడాది మే 27న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారలను సేకరించి ఢిల్లీలోని జనక్‌పురిలో నివాసం ఉంటున్న నైజీరియన్ ఒనేకా సొలమన్ విజ్డమ్ అలియాస్ సైమన్ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 7 సెల్ఫోన్లు, రెండు బ్యాంక్ ఖాతా పుస్తకాలు, ఒక డెబిట్ కార్డ్ స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!) -
ఫేస్బుక్ అడ్డాగా దోపిడీ : నైజీరియన్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్ అడ్డాగా బాధితులకు రూ లక్షల్లో టోకరా వేస్తున్న నైజీరియాకు చెందిన ఆర్థర్ అకున్నెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని శివ్ విహార్ ప్రాంతంలో నివసించే ఆర్ధర్ తన సహచరులతో కలిసి ఫేస్బుక్ లక్ష్యంగా అమాయకులకు వల విసిరి పెద్దమొత్తంలో నగదును కాజేస్తాడని పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో లక్ష్యంగా ఎంచుకున్న బాధితులకు విదేశాల నుంచి తాము విలువైన కానుకలను మీ కోసం తీసుకొస్తున్నామని నమ్మబలుకుతూ కస్టమ్స్ చెకింగ్‌లో ఇరుక్కుపోయామని తమ ఖాతాలకు నగదు పంపితే విలువైన కానుకలు మీకు ఇస్తామని వీరు ఎర వేస్తారని పోలీసులు తెలిపారు. వీరి ఉచ్చులో కూరుకుపోయిన వారు పెద్దమొత్తంలో నగదును వారి ఖాతాల్లో జమ చేసి మోసపోతున్నారని చెప్పారు. కాగా ఫేస్బుక్లో పరిచయమైన ఓ వ్యక్తి తనను రూ 30 లక్షల మేర మోసగించాడని ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఆర్ధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ధర్‌కు సహకరించిన ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఎన్ఆర్ఐ పేరుతో యువతికి స్కెచ్
సాక్షి, కోల్‌కతా : కోల్‌కతాకు చెందిన ఓ మహిళను రూ ఏడు లక్షలు మోసగించిన ముగ్గురు నైజీరియన్లను హౌరా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ వ్యక్తి వివాహ వెబ్సైట్లో తనకు తాను ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల యువతిని ముగ్గులోకి లాగాడు. తాను అమెరికా నుంచి మార్చిలో భారత్ వస్తున్నానని ఆమెను నమ్మబలికాడు. ఈ క్రమంలో అదే నెలలో యువతికి ఫోన్ చేసిన నిందితుడు తాను న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్నానని, క్లియరెన్స్ పొందేందుకు కొంత డబ్బు అవసరమని చెప్పగా చెల్లించేందుకు ఆమె అంగీకరించింది. ఇక డబ్బును అతని ఎకౌంట్లోకి బదిలీ చేసినప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని బాధితురాలు వాపోయారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నోయిడా నుంచి ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని ట్రాన్సిట్ రిమాండ్‌పై హుగ్లీకి తరలించి స్ధానిక కోర్టులో హాజరు పరిచారు. వీరి నుంచి 20 మొబైల్ పోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు ట్యాబ్లెట్లు, 21 ఏటీఎం కార్డులు, రూ 3.5 లక్షల నగదు, 30 పాస్‌బుక్కులు, చెక్‌బుక్కులతో పాటు 500 యూఎస్ డాలర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. నకిలీ పత్రాలతో నిందితులు యూపీ, మహారాష్ట్రలో పలు బ్యాంకు ఖాతాలు తెరిచారని పోలీసులు చెప్పారు. -
ఏయిర్‌పోర్ట్‌లో నైజీరియన్ అరెస్ట్
శంషాబాద్ : సోషల్ మీడియా ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ మోసగాడిని శంషాబాద్ విమానాశ్రయంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ నైజీరియన్.. విత్తనాల కంపెనీ ప్రతినిధిగా సుమారు రూ. 50 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో నైజీరియా నుంచి వచ్చిన అతడిని జార్ఖండ్ పోలీసులు మాటు వేసి మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయంలో అరె స్టు చేశారు. అనంతరం రాజేంద్రనగర్ ఎనిమిదో మెట్రోపాలిటన్ కోర్టుకు తరలించారు. కోర్టు సమయం మించి పోవడంతో పోలీసులు తిరిగి అతడిని కస్టడీకి తీసుకుని శంషాబాద్‌కు తరలించారు. -
అనారోగ్యంతో నైజీరియా విద్యార్థి మృతి
హైదరాబాద్: నైజీరియాకు చెందిన ఓ విద్యార్థి అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన ఉస్మాన్ (22) టోలిచౌకి అల్‌హస్నాత్ కాలనీలో ఉంటూ నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఉస్మాన్ తన స్నేహితుల సలహా మేరకు లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.