సోషల్ మీడియా ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ మోసగాడిని శంషాబాద్ విమానాశ్రయంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
శంషాబాద్ : సోషల్ మీడియా ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ మోసగాడిని శంషాబాద్ విమానాశ్రయంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ నైజీరియన్.. విత్తనాల కంపెనీ ప్రతినిధిగా సుమారు రూ. 50 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.
దీంతో నైజీరియా నుంచి వచ్చిన అతడిని జార్ఖండ్ పోలీసులు మాటు వేసి మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయంలో అరె స్టు చేశారు. అనంతరం రాజేంద్రనగర్ ఎనిమిదో మెట్రోపాలిటన్ కోర్టుకు తరలించారు. కోర్టు సమయం మించి పోవడంతో పోలీసులు తిరిగి అతడిని కస్టడీకి తీసుకుని శంషాబాద్‌కు తరలించారు.