no fly rules
-
వారిక ‘నో ఫ్లై లిస్టు’లో
న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్న ఆకతాయిలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఉత్తుత్తి బాంబు బెదిరింపులతో ప్రమాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్న వారిని, భయాందోళనలకు గురిచేస్తున్న వారిని ఇకమీదట విమాన ప్రయాణానికి అనర్హుల జాబితా (నో ఫ్లై లిస్టు)లో చేర్చనున్నారు. మూడు రోజుల్లో మొత్తం 19 జాతీయ, అంతర్జాతీయ విమానా లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొన్ని విమానాలను దారిమళ్లించి దగ్గర్లోని విమానాశ్రయాల్లో దింపి తనఖీలు పూర్తి చేశారు. ఇవన్నీ ఉత్తుత్తి బాంబు బెదిరింపులేనని తేలింది. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నిఘా సంస్థలు, పోలీసుల సహకారంతో బాంబు బెదిరింపులకు దిగుతున్న వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, చట్టసంస్థలు ప్రతికేసులోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు బుధవారం తెలిపారు. మరో ఏడు విమానాలకు బెదిరింపులుబుధవారం మరో ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ ఉత్తవేనని తేలింది. నాలుగు ఇండిగో విమానాలు, రెండు స్పైస్‌జెట్ విమానాలు, ఒక ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. రియాద్–ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని దారి మళ్లించి మస్కట్ (ఒమన్)లో దింపారు. చెన్నై– లక్నో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో దిగగానే ప్రయాణికులను సురక్షితంగా దింపి.. విమానాన్ని నిర్జన ప్రదేశానికి తీసు కెళ్లారు. అలాగే ఢిల్లీ– బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు రావడంతో దాన్ని తిరిగి దేశ రాజధానికి మళ్లించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇలాగే ముంబై– ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. మైనర్ అరెస్టు: ముంబై: మూడు విమానాలను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో బాంబు బెదిరింపులు పంపిన చత్తీస్‌గఢ్‌లోని ఒక 17 ఏళ్ల మైనర్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. -
నో మాస్క్ , నో ఫ్లై : డీజీసీఏ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విమాన ప్రయాణీకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది. మాస్కు ధరిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తేల్చి చెప్పింది. అంతేకాదు విమానంలో ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రస్తుత డీజీసీఏ నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్‌లైన్స్, క్యాబిన్ సబ్బందికి అధికారం ఉందని వెల్లడించారు. గురువారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, దేశీయ విమానాలలో ముందుగా ప్యాక్ చేసిన స్నాక్స్, భోజనం, ఇతర పానీయాలకు అనుమతి ఉంటుంది. విమానయాన వ్యవధిని బట్టి దేశీయ విమానాలలో ప్రీ-ప్యాక్డ్ భోజనం, పానీయలను అందించవచ్చు. అలాగే అంతర్జాతీయ విమానాలు, చార్టర్ ఫ్లైట్ ఆపరేటర్లు కూడా తమ ప్రయాణీకులకు ప్రామాణిక పద్ధతుల ప్రకారం వేడి భోజనం, ఇతర పానీయాలను అందించేందుకు అనుమతించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ఆహారం లేదా పానీయాలను అందిస్తున్నప్పుడు సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ట్రేలు, ప్లేట్లు మాత్రమే వాడాలని తెలిపింది. అలాగే ప్రతీసారి సిబ్బంది హ్యాండ్ గ్లౌజులు ధరించాలని పేర్కొంది. ప్రయాణ ప్రారంభంలో ప్రయాణీకులకు డిస్పోజబుల్ ఇయర్ ఫోన్లు లేదా శుభ్రపరిచిన , శానిటైజ్ చేసిన హెడ్ ఫోన్లు అందిస్తారని తెలిపింది. కాగా కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా మార్చి 23 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. దాదాపు మూడు నెలల తరువాత మే 25న దేశీయ విమానాలు పాక్షికంగా తిరిగి ప్రారంభమైనా, భోజనం సరఫరాకు అనుమతి లేదు. -
అతిచేస్తే ‘నిషేధ జాబితా’లోకి!
న్యూఢిల్లీ: దేశీయ విమానాల్లో దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం వేటు పడనుంది. వీరి పేర్లను ‘నేషనల్ నో ఫ్లై లిస్టు’లో చేర్చాలని పౌర విమానయాన శాఖ ప్రతిపాదించింది. సూచనలు, అభిప్రాయాల కోసం ముసాయిదా నిబంధనలను శుక్రవారం విడుదల చేసింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా ఉద్యోగిపై చేయిచేసుకున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సిద్ధమైంది. దురుసు ప్రయాణికులతోపాటు భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులుగా భద్రతా సంస్థలు గుర్తించిన వారినీ జాబితాలో చేరుస్తారు. జాబితాలో అన్ని విమానయాన సంస్థల నుంచి సేకరించిన ఇలాంటి ప్రయాణికుల సమాచారం ఉంటుంది. అయితే నిషేధాన్ని అన్ని విమానయాన సంస్థలు అమలు చేయడం తప్పనిసరేం కాదు. ఇలాంటి లిస్టు ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ముసాయిదా ప్రకారం.. విమానయాన సంస్థకు చెందిన విచారణ కమిటీ నిర్ణయం తర్వాత పేర్లను ‘నో ఫ్లై లిస్టు’లో చేరుస్తారు. దురుసుతనం స్థాయిని బట్టి 3 రకాలు వర్గీకరిస్తారు. తొలి స్థాయిలో.. మత్తుతో శ్రుతిమించి ప్రవర్తించడం, శరీర కదలికలు, మాటలతో వేధింపులకు పాల్పడితే 3 నెలల నిషేధం ఉంటుంది. రెండోస్థాయిలో.. నెట్టడం, కొట్టడం, ఇతరుల సీట్లను ఆక్రమించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం మొదలైన వాటికి ఆరు నెలల నిషేధం విధిస్తారు. మూడో స్థాయిలో.. విమాన నిర్వహణ వ్యవస్థకు నష్టం కలిగించడం వంటి ప్రాణహాని చర్యలకు తెగబడితే రెండేళ్లు లేదా నిరవధిక నిషేధం ఉంటుంది. పదేపదే ఇలాంటి దురుసు ప్రవర్తనకు పాల్పడితే గతంలో విధించిన నిషేధానికి రెండు రెట్ల కాలపరిమితిలో నిషేధం విధిస్తారు.