ఆందోళన అవసరం లేదు: జేపీ నడ్డా
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ లో బయట పడిన పోలీయో వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరో్గ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఐదేళ్లుగాదేశంలో ఒక్క పోలియో కేసుకూడా నమోదు కాలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ ను 2011 లోనే పోలియో రహిత దేశంగా గుర్తించిందని గుర్తు చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య సిబ్బంది తనిఖీల్లో అంబర్ పేటలో పోలియో వైరస్ బయటపడిన అనంతరంఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా చిన్నారులకు పోలియో వాక్సిన్ అందించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము సమన్వయంతో పని చేస్తున్నామని అన్నారు.