ఎస్బీఐ నో క్యూ
APPకీ కహానీ...
ఆధునిక టెక్నాలజీని ఒడిసిపట్టుకొని, దాన్ని వినియోగదారులకు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే ఎస్బీఐ తాజాగా ‘నో క్యూ’ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
* బ్యాంక్ కస్టమర్లు/నాన్ కస్టమర్లు ఈ యాప్ సాయంతో వర్య్చువల్ క్యూ టికెట్ (ఎం-టోకెన్)ను బుక్ చేసుకోవచ్చు.
* ఎస్బీఐకి సంబంధించిన ఎంపిక చేసుకున్న ఏ బ్రాంచ్‌లోనైనా, కావాల్సిన సర్వీసులకు గానూ ఎం-టోకెన్లను పొందొచ్చు.
* బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లక ముందే టోకెన్లను తీసుకోవడం వల్ల అక్కడ క్యూ లైన్లో వేచి ఉండాల్సిన బాధ తప్పుతుంది. మన విలువైన సమయం మిగులుతుంది.
* క్యూ లైన్లో మనకు ముందు ఎంతమంది ఉన్నారో, ఎంత సమయం పడుతుందో కూడా తెలుసుకోవచ్చు.
* బ్యాంక్ బ్రాంచ్ ఎంత దూరంలో ఉన్నదీ.. దాని వద్దకు ఏ విధంగా వెళ్లాల్సిందీ.. యాప్‌లో చూడొచ్చు.
* యాప్‌ను పెన్ చేయగానే బ్యాంకుకు సంబంధించిన సర్వీసులు (డిపాజిట్స్, నెఫ్ట్, విత్‌డ్రాయల్స్, డీడీ వంటి తదితర) మనకు కనిపిస్తాయి.
* కావాల్సిన సర్వీస్‌పై క్లిక్ చేయగానే యాప్ మనకు దగ్గరిలోని బ్రాంచ్‌ను చూపిస్తుంది. బ్రాంచ్ ఎంపిక చేసుకొని అటు తర్వాత ఎం-టోకెన్‌ను బుక్ చేసుకోవచ్చు.