No water for cultivation
-
ఎండుతున్న ఆశలు..!
చెన్నారావుపేట: దేవుడు వరమించిన పూజారి కరుణించలేదనే సమేత రైతుల పట్ల నిజమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ రైతుల కోసం ఇవ్వడంతో కష్టాలు పోయాయి అనుకున్నారు. కానీ బావులల్లో భూగర్భ జలాలు లేకపోవడంతో రైతుల ఆశలు ఎండకు ఆవిరై పోయినట్టు తయారైంది. చెరువులు, కుంటలలో నీళ్లు ఎండిపోతుండటంతో బావులల్లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు వస్తే పంటలను బతికించుకోవచ్చని కలలు కన్న రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బోర్లు వేసుకొని పంటలు రక్షించుకుందామంటే అందనంత దూరంలోకి జలాలు అడుగంటిపోయి.. నీళ్ల చుక్క రాని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఎస్సారెస్పీ ద్వారా నీటి విడుదలకు కృషి చేస్తే పంటలు చేతికొస్తాయని రైతులు కోరుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ శివారులోని బూరుగుకుంట తండాకు చెందిన బానోతు మురళికి గ్రామ శివారులో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 2 ఎకరాలు భూమిలో వరి పంట వేశాడు. ఎకరంలో పసుపు పంట వేశాడు. బావిలో నీళ్లున్నాయనే ఆశతో పంట వేశాడు. బావిలో నీళ్లు ఎండిపోతుండటంతో పంటను కాపాడుకోవడానికి రెండు బోర్లు వేసినా పడకపోవడంతో చేసేది ఏమి లేక చేతులెత్తేశాడు. ఎస్సారెస్పీ జలాలు వచ్చిన తన పంట పండుతుందని ఆశ పడ్డాడు. నీళ్లు రాకపోవడంతో చేసేది ఏమి లేక తన పశువులను, గేదెలను మేపుతున్నాడు. ఈ దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి... ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు.. రెండు ఎకరాలలో వరి నాటు వేశాను పంట మంచిగా పెరిగింది. బావిలో నీళ్లు ఎండిపోతుండటంతో రెండు బోర్లు రూ.1 లక్ష పెట్టి వేయింనా పడలేదు. వరి పంటలకు రూ.23 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. మంచిగా ఉన్న నీళ్లులేక ఎండిపోతుండంతో గుండె బరువెక్కింది. ఎడుద్దామనుకున్న ఏడుపు రావడం లేదు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్లు వచ్చిన కొంత మేర పంటను బతికించుకోవచ్చన్న ఆశ ఉంది. – బానోతు మురళి, యువ రైతు -
ఎండిపోతున్న వరి చేలు
అన్నదాతల ఆందోళన సీతానగరం: అప్పులు చేసి సాగు చేస్తున్నారు. వర్షాలు కురవక విలవిల్లాడిపోతున్నారు. పంటలు ఎండిపోవడంతో బావురుమంటున్నారు. మండలంలో వర్షాధార పంటలను పండిస్తున్న జానుమల్లువలస, కోటసీతారాంపురం, దయానిధిపురం, పూనుబుచ్చింపేట, గాదెలవలస తదితర గ్రామాల్లో రైతులు జూన్ నెలలో వరినారు వేశారు. జూలై రెండో వారంలో వర్షాలు కురవడంతో ఉభాలకు వరినారు అందుకురావడంతో అప్పులు చేసి వరినాట్లు వేశారు. దశాబ్దాల కాలంగా రైతులు ఏటా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2000వ సంవత్సరంలో వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా రూ.3.5 కోట్ల వ్యయంతో మిగులు జలాలను కోటసీతారాంపురం, జాను మల్లువలస, పూనుబుచ్చింపేట, దయానిధిపురం, గాదెలవలస గ్రామాలకు చెందిన 5 వేల ఎకరాలకు సాగు నీరందించే పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో కాలువ పనులు జరగలేదు. దీంతో నీరులేక వరిచేలు ఎండిపోవడంతో రైతుల కష్టాలు మొదలయ్యాయి. ఎండిపోయిన వరినారు : సిహెచ్.సత్యనారాయణ, రైతు, కేఎస్ పురం. మాది సన్నకారు రైతు కుటుంబం. వర్షాలు కురవకపోవడంతో వేసిన వరినారు ఎండిపోయింది. వ్యవసాయం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే వెంగళరాయ సాగర్ నుంచి నీరు మళ్లించాలి. వీఆర్ఎస్ నీళ్లివ్వాలి : పి.ఆనంద్, రైతు, కేఎస్ పురం కుటుంబమంతా నిరంతరం శ్రమించి వరిఉభాలు చేశాం. అప్పులు చేసి తొలివిడత ఎరువులు వేశాం. పదిహేను రోజులుగా వర్షాల్లేక, వెంగళరాయ సార్నుంచి నీరు రాక పంటలు ఎండి పోతున్నాయి. తక్షణమే వీఆర్ఎస్ నుంచి నీరు విడుదల చేయాలి.