నంబర్‌వన్ ఐటమ్‌సాంగ్
టాలీవుడ్లో ఐటమ్సాంగుల హంగామా మొదలైంది ‘ఆర్య’ నుంచి. అందులోని ‘ఆ అంటే అమలాపురం...’ పాట తెలుగునేలను ఓ ఊపు ఊపేసింది. అప్పట్నుంచి సుకుమార్ తన దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాలో కచ్చితంగా ఓ ఐటమ్ నంబర్ ఉండేలా చూసుకుంటున్నారు. దేవిశ్రీ-సుకుమార్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన అన్ని ఐటమ్సాంగులూ అదరహో అనిపించినవే. ఈ సందర్భంలో మహేశ్ ఐటమ్సాంగుల గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి. ‘పోకిరి’లో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...’ పాట నుంచి నిన్న మొన్న వచ్చిన ‘దూకుడు’లోని ‘ఆటో అప్పారావు..’ పాట వరకూ దాదాపు మహేశ్ నర్తించిన అన్ని ఐటమ్ సాంగులూ మాస్‌ని ఉర్రూతలూగించినవే.
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికి అనుకుంటున్నారా? మహేశ్, సుకుమార్, దేవిశ్రీ... ఈ ముగ్గురు కలిసి ప్రస్తుతం ‘1’ చిత్రానికి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆనవాయితీ ప్రకారం సుకుమార్ ఇందులో కూడా ఓ ఐటమ్నంబర్ని పెట్టేశారు. సుకుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ ఐటమ్‌సాంగ్ అంటే మూమూలుగా ఉండకూడదు కదా! అందుకే... ఐటమ్నంబర్లలోనే తలమానికం అనిపించేలా ఈ సాంగ్‌ని సుకుమార్ చిత్రీకరించినట్లు సమాచారం.
బాలీవుడ్ మోడల్ సోఫియా ఈ సాంగులో ప్రిన్స్‌తో కాలు కదిపారు. ప్రేమ్క్ష్రిత్ నేతృత్వంలో ముంబైలో చిత్రీకరించిన ఈ పాట యువతరాన్ని ఉర్రూతలూగిస్తుందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ‘1’ ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆ మిగిలిన ఉన్న పాటను చిత్రీకరించనున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ 22న వినూత్నంగా పాటలను, జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు.