Nominated MPs
-
రాజ్యసభలో మరింత కీలకంగా వైఎస్సార్సీపీ!
న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. నామినేటెడ్ ఎంపీలైన నలుగురు రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జఠ్మలాని పదవికాలం శనివారంతో ముగియడంతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్రపది ద్రౌపది ముర్ము వీరిని నియమించారు. వీరు అనంతరం రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే నలుగురు ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 86కు చేరగా.. ఎన్డీయే కూటమికి 101 మంది ఎంపీల బలం ఉంది. మొత్తం 245 సభ్యులు కలిగిన పెద్దల సభలో మెజార్టీ మార్కు 113గా ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 225 మంది ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో కాంగ్రెస్‌కు 26, తృణమూల్ కాంగ్రెస్‌కు 13, ఆమ్ ఆద్మీపార్టీ 10, డీఎంకే పార్టీకి 10 మంది సభ్యులు ఉన్నారు. వీరితోపాటు ఇక అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమిలో భాగంగా లేని తెలంగాణలోని బీఆర్ఎస్, పలువురు నామినేటేట్ ఎంపీలు, స్వతంత్రులు ఉన్నారుఅయితే ఎగువ సభలో బిల్లులను ఆమోదించడానికి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీయేతర పార్టీలపై ఆధారపడి ఉంది. దీంతో గతంలో ఎన్డీఏకు మిత్రపక్షంగా వ్యవహరించిన తమిళనాడులోని అన్నాడీఎంకే, అంశాలవారీగా పలుమార్లు మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇపుడు కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీల ఎంపీలనూ ( అన్నాడీఎంకే 4, వైఎస్సార్ సీపీ11) కలిపితే 101 ప్లస్ 15.. మొత్తంగా 116 కావటంతో.. బిల్లులు ఆమోదం పొందడానికి ఈ రెండు పార్టీలూ కీలకంగా మారాయి.గతంలో కూడా పలు సందర్భాల్లో వైఎస్సార్సీపీ(11), అన్నాడీఎంకే (4) పలు బిల్లుల విషయంలో ఎన్డీయేకు మద్దతిచ్చాయి. కానీ ఇటీవల ఎన్నికలకు ముందు గత ఏడాది డిసెంబర్లో అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేనతో కూటమి గట్టి మరీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పోటీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. బిల్లులు గట్టెక్కాలంటే వైఎస్సార్సీపీ సపోర్టు ఎన్డీయేకు తప్పనిసరి. ఎందుకంటే 11 మంది సభ్యులున్న వైస్సార్సీపీ... రాజ్యసభలో నాలుగవ అతిపెద్ద పార్టీ కావటం విశేషం. ఇక గతంలో ఎన్డీయేకు మరో మిత్రపక్షంగా ఉన్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్ కూడా ఎన్నికల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే బీజేడీ తేల్చి చెప్పింది. బీజేడీకి తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లుల ఆమోదానికి వై ఎస్సార్సీపీ , బీజేడీ , బీఆర్ఎస్ మద్దతు కీలకం.ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 మంది ఎన్నికయ్యేవారు కాగా.. ఈ ఏడాది ఈ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అస్సాం, బీహార్లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర నుంచి ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రలో మరో రెండు దక్కించుకునే ఛాన్స్ ఉంది. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు నామినేటెడ్ సభ్యుల ఓట్లు, వైఎస్సార్సీపీ ఓట్లు కలిపితే బీజేపీకి మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత బలం ఉండనుంది. -
కూతలా! కోతలా!!
సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం రైలు మాత్రమే! అందుకే.. రైల్వే బడ్జెట్ వస్తోందంటే, కొత్త రైళ్ల కోసం, ఉన్న రైలు మార్గాల పొడిగింపు కోసం, కొత్త మార్గాల మంజూరు కోసం, రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం వారు వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉం టారు. కానీ, వారికి ఏటా నిరాశే మిగులుతోంది. రైల్వే మంత్రుల బండ్లు ఇందూరు స్టేషన్లో ఆగకుండానే దాటిపోతున్నారుు. దశాబ్దాల కోరికలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి. ఈసారి సురేష్ ‘ప్రభు’ ఏం చేస్తారో? రైల్వే బడ్జెట్లో వాటాపై ఉత్కంఠ ⇒ గతంలోనూ ఒరిగిందేమీ లేదు ⇒ సురేష్ ‘ప్రభు’ ఈసారి కరుణిస్తారా ⇒ బోధన్-బీదర్ రైల్వే మార్గానికి ‘లైన్’ క్లియర్ అవుతుందా ⇒ పెద్దపల్లి-నిజామాబాద్ రూట్‌కు రైల్వే మంత్రి భరోసా ఇస్తారా ⇒ మన ఎంపీల ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందా!? సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మొన్న త్రివేది, బన్సల్... నిన్న మల్లికార్జున ఖర్గే... తాజాగా సురేష్ ప్రభు... కేంద్ర రైల్వే మంత్రులు ఎవరైనా వారి బడ్జెట్లో జిల్లాకు ప్రయోజనం అంతంతే. 2014- 15 లో కొంత మోదం, మరికొంత ఖేదం మిగిల్చిన రైల్వే బడ్జెట్ ఈసారైనా ఆశాజనకంగా ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 67 ఏళ్లుగా నానుతున్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ ఇంకా 16 కిలోమీటర్లయి పూర్తవుతుంది. దీనికి నిధుల కేటాయింపుపైనే ప్రధానంగా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2013-14 బడ్జెట్లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులే కేటాయించారు. 2014-15 బడ్జెట్లో వాటి ఊసే ఎత్తలేదు. నిజామాబాద్-ముంబాయి వరకు వేసిన ఎక్స్ప్రె స్ రైళ్లు అంత ఆశాజనకంగా లేకపోగా, ఆర్మూరు-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనలు ఏమవుతాయో తెలియడం లేదు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా జిల్లాకు ప్రయోజనం దక్కుతుం దా? అన్న సంశయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత బడ్జెట్లో జిల్లాకు కొత్త రైళ్లు, నిధులు కేటాయింపులపై రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి భిన్నస్వరాలు వినిపించగా, ఆ బడ్జెట్లో పేర్కొన్న పలు అంశాలు అమలుకు నోచుకోలేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, ఫ్లైఓవర్, పుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, రైల్వే అభివృద్ధిపై బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. ఎప్పుడో పూర్తి కావాల్సిన మోర్తాడ్-ఇందూరు రైల్వేలైన్ ఇంకా నత్త నడకనే సాగుతోంది. దీనిని పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు నోచుకోలేదు. ఆర్మూర్- ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ పనులు చేపట్టలేదు. జిల్లా వ్యవసాయక, పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధికి ప్రధానమైన ఈ రెండు కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తు ది రూపు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరేడు దశాబ్దాలుగా కలల ప్రాజెక్టుగా ఉన్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ పనుల పూర్తికి సరిగా నిధులు రావడం లేదు. సుమారు 178 కిలోమీటర్ల పొడవున్న ఈ రైలుమార్గం 162 కిలోమీటర్లు పూర్తరుుంది. పెర్కిట్ నుంచి నిజామాబాద్ వరకు ఇంకా 16 కిలోమీటర్ల కు నిధులు ఇవ్వాల్సి ఉంది. గత బడ్జెట్లో రూ.76 కోట్లు కేటాయిం చినా 34.98 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఎంపీల ప్రతిపాదనలు ఫలించేనా! రైల్వే బడ్జెట్ సందర్భంగా నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్ చేసిన ప్రతిపాదనలకు ఈసారైనా పూర్తిస్థాయిలో మోక్షం లభిస్తుంమోనని ఇందూరు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. గత బడ్జెట్లో ఆర్మూర్ ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికిఆ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించలేదు. ఫలితంగా అది ప్రతిపాదనలకే పరిమితమైంది. బోధన్-బీదర్ లైన్, ఆర్మూర్-నిర్మల్ - ఆదిలాబాద్ లైన్లను మరచి పూర్తిగా నిరాశకు గురి చేశారు. సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెంచి, ఆదర్శ స్టేషన్ల అభివృద్ధికి పైసా కూడ విదిల్చలేదు. కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలో పాత, కొత్త సమస్యలు, ప్రతిపాదనలను కేంద్రం దష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ కవిత ప్రకటించారు. ఈసారి బడ్జెట్లో జిల్లాకు అన్యాయం జరగ కుండా ఉండేందుకు ముఖ్యమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను రెండు నెలల కిందటే సమర్పించామని ఆమె ఇటీవల ‘మీ ట్ దిప్రెస్’లోనూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో జిల్లా సమస్యలు ఏ మేరకు పరిష్కారం అవుతాయి? ఎంపీల ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది.