Nominations Election Notification
-
సార్వత్రిక ఎన్నికలు.. తొలిరోజు ప్రముఖుల నామినేషన్లు
Upadates తెలంగాణలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. నల్గొండ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. సంగారెడ్డి జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మొదటి సెట్ నామినేషన్ సురేష్ షెట్కార్ తరపున నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు ఈ నెల 24న సురేష్ షెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ: డీకే అరుణ నామినేషన్ దాఖలు భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన డీకే అరుణ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మహారాష్ట్ర నామినేషన్ సమర్పించిన సుప్రియా సూలే ఎన్సీపీ (శరద చంద్ర పవార్) పార్టీ సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే నామినేషన్ దాఖలు చేశారు బారామతి స్థానంలో పోటీలో ఉన్నారు Maharashtra: NCP-SCP sitting MP and candidate from Baramati, Supriya Sule files her nomination papers. Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar has been fielded by NCP against NCP-SCP MP Supriya Sule from Baramati. pic.twitter.com/8uS99KwDTk — ANI (@ANI) April 18, 2024 తెలంగాణ నల్లగొండ లోక్ సభ స్థానంలో తొలి నామినేషన్ దాఖలు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున తొలి సెట్టు నామినేషన్ సమర్పించిన పార్టీ నేతలు తెలంగాణ కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు నామినేషన్ వేయనున్నారు నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశి్చమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. The Gazette notification has been issued for the 4th phase of general elections. Polling will take place for 96 Lok Sabha seats across 10 states Andhra Pradesh, Bihar, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Odisha, Telangana, Uttar Pradesh, West Bengal, and Jammu & Kashmir.… pic.twitter.com/xyjCS0xesf — ANI (@ANI) April 18, 2024 సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరుగనుంది. గురువారం ఉదయం నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఈ విడతకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 96 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు అవకాశం కలి్పంచారు. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 న జరుగనుంది. అనంతరం ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. కాగా నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిషాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగో విడతలో పోలింగ్ జరుగనుంది. -
తొలిరోజు భారీగా..
మిర్యాలగూడ : ప్రాదేశిక ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉన్నప్పటికీ తొలిరోజే భారీగా నామినేషన్లు వచ్చాయి. వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో పది జెడ్పీటీసీ, 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా స్థానాలకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. తొలిరోజు 109 ఎంపీటీసీ స్థానాలకు గాను 261 మంది అభ్యర్థులు 264 నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా పది జెడ్పీటీసీ స్థానాలకు గాను 32 మంది అభ్యర్థులు 34 నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల వారీగా ఇవీ నామినేషన్లు ప్రాదేశిక ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో 109 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ – 3, సీపీఐ(ఎం) – 11, కాంగ్రెస్ – 92, టీఆర్ఎస్ – 141, టీడీపీ – 2, స్వతంత్ర అభ్యర్థులు – 15, మొత్తం 264 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా పది జెడ్పీటీసీ స్థానాలకు గాను బీజేపీ – 1, సీపీఐ(ఎం) – 3, కాంగ్రెస్ – 15, టీఆర్ఎస్ – 11, టీడీపీ –2, స్వతంత్ర – 2, మొత్తం – 34 నామినేషను దాఖలయ్యాయి. -
ఆట మొదలైంది!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: శాసనసభా ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి మొదలు కాబోతోంది. డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. నోటిఫికేషన్‌తోపాటే నామినేషన్ల ప్రక్రియా మొదలవుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే ఆయా జిల్లాల కలెక్టర్ల ఆదేశాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు సాగుతుంది. 20న నామినేషన్ల పరిశీలన, 21, 22 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. 23వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థుల ప్రచారానికి గడువు ఉంటుంది. డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహిస్తారు. ఇదీ రాబోయే 25 రోజుల షెడ్యూల్. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యయ పరిశీలకులను ఈసీ నియమించింది. వీరంతా సోమవారం నుంచే తమ విధులు ప్రారంభించనున్నారు. పరిశీలకులతోపాటు క్షేత్రస్థాయితో మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలకులు ఈ నెల 19న రానున్నారు. సమస్యాత్మక స్థానాలు 4 ఉమ్మడి జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాలుగా నాలుగింటిని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గోదావరి, ప్రాణహిత నదీ పరీవాహక నియోజకవర్గాలు మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూరులను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఈ నియోజకవర్గాల్లో బందోబస్తుకు అదనంగా కేంద్ర బలగాలు రానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో డిసెంబర్ 7న సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. టీఆర్ఎస్ అభ్యర్థుల చేతికి బీఫారాలు ముందస్తు ఎన్నికల కోసం ప్రభుత్వాన్ని రద్దు చేసిన సెప్టెంబర్ 6వ తేదీనే టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే 105 అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడానికి ఒకరోజు ముందే వారందరికీ బీఫారాలను అందజేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన పది మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. సోమవారం నుంచి 19వ తేదీ వర కు మంచిరోజులే ఉండడంతో ముహూర్త బలం చూసుకొని నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. జాబితా కోసం కాంగ్రెస్ నేతల ఎదురుచూపు ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు బీఫారాలతో సిద్ధంగా ఉండగా, కాంగ్రెస్ నేతలు అభ్యర్థుల జాబితా కోసం ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో బెల్లంపల్లిలో సీపీఐ పోటీ చేయడం ఖాయమైంది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎవరో ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కూడా సోమ లేదా మంగళ వారాల్లో వెల్లడి కానుంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో కూడా ఇప్పటికే లీక్ కావడంతో బీఫారాల కోసం వేచి చూస్తున్నారు. నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన? భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను రెండు విడతలుగా ప్రకటించింది. మంచిర్యాల, చెన్నూరు స్థానాలకు పోటీ తీవ్రంగా ఉండడంతో పెండింగ్‌లో పెట్టారు. ఆదివారం హైదరాబాద్‌లో జరగాల్సిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది. దీంతో ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను రాష్ట్ర పార్టీ అధికారికంగా ఖరారు చేయలేదు. సోమవారం అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటే మంగళవారం ఢిల్లీ నుంచి మూడో జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది. మంచిర్యాల నుంచి ఎరవెల్లి రఘునాథ్, ముల్కల్ల మల్లారెడ్డి పోటీ పడుతుండగా, చెన్నూరు నుంచి రామ్‌వేణు, అందుగుల శ్రీనివాస్ టికెట్టు వేటలో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఏ సమీకరణాల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారో చూడాల్సిందే. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఆదిలాబాద్‌అర్బన్: శాసనసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ దివ్యదేవరాజన్ విలేకరులతో తెలిపారు. ఈనెల 12 నుంచి 19 వరకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు. నామినేషన్‌కు జతచేయాల్సిన ధ్రువపత్రాలు, సూచనలు.. నామినేషన్ ఫారం– 2బీని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉచితంగా పొందవచ్చు రెండు ఫొటోలలో ఒక స్టాంప్ సైజ్ ఫొటో నామినేషన్ పత్రంపై, రెండోది అఫిడవిట్‌పై అతికించాలి జనరల్ అభ్యర్థుల డిపాజిట్ రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల డిపాజిట్ రూ.5 వేలతో పాటు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి అభ్యర్థి నామినేషన్‌ను అదే నియోజకవర్గ ఓటరు ప్రతిపాదించాలి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థిని ఒకరు, ఇండిపెండెంట్లను పది మంది ప్రతిపాదించాలి బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరు ఎలా రాయాలో తెలుపుతూ తెలుగులో రాసి ఇవ్వాలి ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చు అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తారు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీ టర్ల దూరంలో వాహనాలను నిలిపివేయాలి అభ్యర్థి తనపై క్రిమినల్ కేసుల వివరాలను పార్ట్– 3ఏలో తప్పని సరిగా పేర్కొనాలి రిటర్నింగ్ అధికారి నుంచి పొందాల్సిన పత్రాలు.. చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రశీదు పరిశీలనకు హాజరయ్యేందుకు నోటీసు ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్ట్రార్ కరపత్రం, పోస్టర్లు, ప్లెక్సీలు, ఇతర సామగ్రి ముద్రించేందుకు ప్రజాప్రతినిథ్య చట్టంలోని సెక్షన్ 127– ఏ సూచనలు ప్రతిజ్ఞ లేదా శపథం చేసినట్లు ధ్రువీకరణ పత్రం నామినేషన్ పత్రంలోని లోపాలు, ఇంకా జతపర్చాల్సిన పత్రాల సూచిక (చెక్ మెమో) -
కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
- నంద్యాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ - ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - తొలి రోజు రెండు నామినేషన్లు నూనెపల్లె (నంద్యాల): కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. ఆయన శనివారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచే మొదలుపెట్టామన్నారు. ఆగస్టు ఐదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు నూతనంగా రూపొందించిన నామినేషన్ పత్రాలనే దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. వీటితో పాటు రూ.10 వేలు డిపాజిట్ చేయాలని చెప్పారు. నామినేషన్ పత్రాలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో స్వీకరించబోమని తెలిపారు. అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే అనుమతిస్తామని, మిగిలిన వారు నామినేషన్ దాఖలు చేసే కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. అభ్యర్థులపై నిఘా వేశామని, కోడ్ ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థుల పూర్తి వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. అభ్యర్థులు అందించే నామినేషన్ పత్రాల ప్రతులను కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేస్తామని తెలిపారు. నామినేషన్ పత్రాలను తనకు కానీ, సహాయ రిటర్నింగ్ అధికారి (ఏఆర్ఓ)కి కానీ అందజేయవచ్చన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తుంటే 8978840011కు నేరుగా ఫోన్ చేయవచ్చని సూచించారు. నామినేషన్ల విత్‌డ్రాకు ఆగస్టు 7 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉందన్నారు. ఆగస్టు 23న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. తొలిరోజు రెండు నామినేషన్లు : నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి శనివారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ నామినేషన్లను స్వీకరించారు. నవతరం పార్టీ తరఫున రావూస్ సుబ్రమణ్యం, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ మహబూబ్‌బాషా నామినేషన్లు దాఖలు చేశారు.