non payment of dues case
-
‘పది నెలలైనా పారితోషికం రాలేదు’
చెన్నై : సౌత్ సినిమాలను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించే ప్రముఖ సబ్టైటిలిస్ట్ రేఖ్స్ రజనీ-అక్షయ్ కుమార్ మూవీ 2.ఓ నిర్మాతలపై ఫైర్ అయ్యారు. ఈ సినిమాకు తనకు రావాలల్సిన బకాయిలను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తనకు ఇంకా చెల్లించలేదని ఆరోపించారు. పది నెలలు గడిచినా బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2.ఓ తెలుగు, తమిళ్ వెర్షన్కు తాను సబ్టైటిల్ వర్క్ చేసినా తనకు ఇంకా పేమెంట్ అందలేదని ఆమె ట్విటర్లో తన ఆవేదన వెళ్లగకక్కారు. సినిమా గత ఏడాది నవంబర్లో విడుదల కాగా తనకు రావాల్సిన మొత్తం సెటిల్ చేసేందుకు నిర్మాతలకు పదినెలల సమయం ఇచ్చినా ఫలితం లేకపోయిందని, తాను పలుమార్లు వారికి మెసేజ్లు, మెయిల్, కాల్స్ చేసినా స్పందన లేదని వాపోయారు. సినిమాలకు వెన్నెముక వంటి సబ్టైటిల్స్ పనులు చేసేవారి శ్రమకు ఫలితం అందడం లేదని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో తనతో వర్క్ చేయించుకునే నిర్మాతలకు తమ పరిస్ధితి తెలియాలనే ఉద్దేశంతోనే తాను ట్వీట్ చేస్తున్నానని చెప్పారు. 2.ఓ మూవీకే కాకుండా కమల్ హాసన్, గౌతమ్ మీనన్, నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ల నుంచి కూడా తనకు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. కాగా లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి ఆమె ఆరోపణలను తోసిపుచ్చారు. తాము అందరికీ సకాలంలో చెల్లింపులు జరిపామని, ఎవరికీ బకాయి లేమని స్పష్టం చేశారు. రికార్డులు పరిశీలించి ఆమెకు చెల్లింపులు జరిపిన విషయం నిర్ధారించాలని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కోరారని చెప్పారు. తన పనికి డబ్బు చెల్లించలేదని ఆరోపించడం ఆమెకు అలవాటని లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
పనులు చేసినా పైసలు లేవు
సాక్షి, కొమరాడ: గ్రామాల్లో వలస నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో కూలీలకు వంద రోజులు పనులు కల్పించడంతో వలసలకు అడ్డుకట్ట వేయొచ్చునని ప్రభుత్వం సంకల్పించింది. అయితే పథకం కూలీలకు చేతి నిండి పనులున్నా కూడా వలసలు ఆగడం లేదు. దీనికి కారణంగా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడమే. కూలీలు ఉన్న చోటికి ఉపాధి కల్పించి వలసలు నివారించాలని ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది మూడు నెలల నుంచి వేతనదారులు కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం చీమ కుట్టినట్లు అనిపించడం లేదని వేతనదారులు మండిపడుతన్నారు. గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండంల్లోని నెలలు తరబడి కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ చేస్తున్న చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు కూలి డబ్బులు కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పనులు చేసినా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడంతో గ్రామీణులు వలస బాట పడుతున్నారు. పనులు ఫుల్.. డబ్బులు నిల్.. ఆరు నెలలుగా సరైన వర్షం లేకపోవడంతో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో కూలీలు పొట్టకూడి కోసం ఉపాధి పనులవైపు మొగ్గు చూపారు. అయితే పనులకు ఇబ్బంది లేకపోయినా డబ్బులు విషయానికి వచ్చే సరికి వారికి తిప్పలు తప్పడం లేదు. దీంతో పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. నైపుణ్యం లేని కార్మికులకు స్థానికంగా ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వాలన్నా ప్రభుత్వం లక్ష్యం మరుగు పడుతోంది. వాస్తవానికి ఉపాధి హామీ వేతనదారులకు 100రోజులు నుంచి 200 రోజులు పనికల్పించి వారం వారం బిల్లులు చెల్లించాలి. కానీ క్షేత్ర స్థాయిలో కనీసం 100రోజులు కూడా పని కల్పించడం లేదు. చేసిన పనులకు బిల్లులు అందడం లేదు. కొమరాడ- సంఘాలు 960 వేతనదారులు 6542 బకాయాలు రూ.1.65కోట్లు కురుపాం.. సంఘాలు 661 వేతనదారులు 4468 బకాయాలు రూ.2కోట్లు జియ్యమ్మవలస: సంఘాలు 788 వేతనదారులు 4991 బకాయాలు రూ.2.08 కోట్లు గరుగుబిల్లి.. సంఘాలు 828 వేతనదారులు 6042 బకాయిలు రూ.2.30 కోట్లు గుమ్మలక్ష్మిపురం.. సంఘాలు 779 వేతనదారులు 6042 బకాయిలు రూ.2కోట్లు మూడు నెలలు డబ్బులు లేవు మూడునెలలు కూలీ డబ్బులు పడలేదు. కార్యాలయాలు, బ్యాంకు చుట్టూ తిరుగుతన్నా డబ్బులు పడడంలేదు. అనేక ఇబ్బందులు పడుతున్నా కుటుంబ పోషణ భారమైంది. నిత్యవసర వస్తువులు కూడా కొనక్కోలేక పోతున్నాం.– ఆకులు జయలక్ష్మి, వేతనదారులు, గుణానపురం ఇబ్బంది పడుతున్నాం నెలల తరబడి ఉపాధి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కొన్ని కుటుంబాలు వలస పోతున్నాయి. అధికారులు దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఫలితం లేదు.– బుగత ఆదినారాయణ, వేతనదారుడు, గుణానపురం అధికారులు స్పందించాలి ఉపాధి వేతనదారులకు కూలి డబ్బులు అందక వలస బాట పడుతున్నారు. పొట్ట కూటి కోసం వారు కష్ట పడినా డబ్బులు రావడం లేదు. కూలి డబ్బులు ఇవ్వకపోతే వారు ఎలా బతికేది. – అధికారి శ్రీనివాసురావు, వైఎస్సార్ సీపీ నాయకులు, శివిని -
బకాయిలు చెల్లించలేదని సోనియాపై కేసు
తిరువనంతపురం: గత లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వెంటాడుతున్న వరుస ఓటములు, కీలక నేతలు పార్టీ నుంచి వైదొలగడం, నాయకత్వ మార్పుపై గందరగోళం.. ఇలా పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో వివాదంలో ఇరుక్కుంది. బకాయిలు చెల్లించని కేసులో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ చిక్కుల్లోపడ్డారు. తిరువనంతపురం కోర్టులో సోనియాపై కేసు నమోదైంది. కేరళలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ భవనాన్ని నిర్మించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తమకు కాంట్రాక్టు ఇచ్చిందని, దీనికి సంబంధించి 2.8 కోట్ల రూపాయల బకాయిలను తమకు చెల్లించలేదని ఆ రాష్ట్రానికి చెందిన హీథర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆరోపించింది. ఈ విషయం గురించి అడిగితే కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు తమ వద్ద డబ్బులు లేవని చెబుతున్నారని వెల్లడించింది. తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హీథర్ కన్స్ట్రక్షన్ కంపెనీ తిరువనంతపురం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సోనియా గాంధీతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్, ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీలకు లీగల్ నోటీసులు పంపించింది. కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిన కొన్ని రోజుల్లోనే ఈ కేసు వెలుగు చూసింది.