Non veg items
-
ముక్క.. పక్కాయేనా..?
అనంతపురం నాల్గో రోడ్డులో రమేష్ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం వీరింటికి బంధువులొచ్చారు. చాలా రోజులకు ఇంటికి రావడంతో ప్రత్యేక వంటకాలతో వారిని సంతోష పెట్టాలని.. రమేష్ స్థానికంగా ఉండే ఓ మటన్ దుకాణానికి వెళ్లి కేజీ పొట్టేలు మాంసం తెచ్చి భార్యతో కూర చేయించాడు. ఏమైందో తెలియదు.. తిన్న కొద్దిసేపటికీ వారందరికీ ఒకటే విరేచనాలు. ఆస్పత్రికి వెళ్లి రూ. వెయ్యి ఖర్చు చేస్తే గానీ ఉపశమనం లభించలేదు. అనంతపురంలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ఎక్కడపడితే అక్కడ వెలిసిన మాంసం దుకాణాలు ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నాయి. రాయదుర్గం: పెళ్లయినా, ఇతర ఏ ఫంక్షన్ అయినా ప్రస్తుత రోజుల్లో నాన్‌వెజ్ అంటేనే ప్రజలు ఉత్సాహం చూపుతారు. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరకడంతో మాంసాహారంపై మరింత ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ధరలు ఆకాశాన్నంటినా ఆదివారమొస్తే కచ్చితంగా తినాల్సిందేనంటున్నారు. అయితే, దీన్నే అదునుగా తీసుకున్న కొందరు వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ దుకాణాలు ఇష్టానుసారంగా నెలకొల్పి అపరిశుభ్ర వాతావరణంలో కార్యకలాపాలు సాగిస్తూ వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. నిబంధనలు ఇలా.. కబేళాలు, మాంసాహార దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ముందుగా మున్సిపల్, పంచాయతీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏర్పాటు చేసిన కబేళా (స్లాటర్ హౌజ్)ల్లోనే జీవాలను వధించాలి. వధించే ముందు పశువైద్యాధికారి జీవాలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. వధించిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విక్రయించేందుకు వీలుగా మెడ భాగంలో ధ్రువీకరణ ముద్ర వేస్తారు. వినియోగదారులు ఆ ముద్రను చూసి కొనుగోలు చేస్తే కొంత భరోసా ఉంటుంది. జరుగుతోంది ఇలా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రమాణాలు పాటించడం లేదు. కొన్నింటిని కబేళాల్లో వధిస్తున్నా.. పశు వైద్యాధికారి ధ్రువపరచడం లేదు. మరికొందరైతే దుకాణాల ఆవరణలోనే వధిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో అయితే పట్టించుకునే వారే లేరు. అటు స్థానిక అధికారులు, ఇటు పశు సంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు తెరుస్తున్నారు. పలు వ్యాధులతో చనిపోయిన జీవాలను సైతం ఎక్కడో వధించి తీసుకొస్తూ ప్రజలకు కట్టబెట్టేస్తున్నారు. ఆరోగ్యాలను హరిస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చాలా చోట్ల ఉన్న కబేళాలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నిబంధనలు పక్కాగా అమలు చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూర్చినట్లవుతంది. నెలకోసారి కొంటాం పెద్దల సాంప్రదాయ ప్రకారం ఇంట్లో కోడి మాంసం వండటం లేదు. దీంతో మేక, పొట్టేలు మాంసం కొనాల్సి వస్తోంది. పెద్ద కుటుంబం కావడంతో మూడు కిలోలు కొంటాం. ధర తక్కువ ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు కొని తిన్నాం. ప్రస్తుతం నెలకు ఒకసారి కూడా తెచ్చుకోలేని పరిస్థితి. – బోయ శివన్న, రైతు, రంగచేడు కమిషనర్లకే చర్యలు తీసుకునే అధికారం కబేళాల ఏర్పాటు, మాంసం నాణ్యతగా ఉండేలా చూడడం, అపరిశుభ్రత ఉంటే చర్యలు తీసుకోవడం తదితర చర్యలు చేపట్టే అధికారం మున్సిపల్ కమిషనర్లకు ఉంది. మాకు సమాచారం ఇస్తే వైద్యాధికారులు వెళ్లి జీవం ఎలా ఉందో ధ్రువీకరిస్తారు. ప్రాథమిక పరీక్షల్లోనే ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుస్తుంది. అవసరమైతే వధించిన తర్వాత జీవాల పరీక్షలకు ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్యంగా ఉండే మాంసం విక్రయించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. లేదంటే కఠిన చర్యలు చేపడతాం. – ఏవీ రత్నకుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ, అనంతపురం నాణ్యతలేని మాసం విక్రయిస్తే కఠిన చర్యలు రాయదుర్గంలో అధికారికంగా జంతుశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం మార్కెట్ వద్దే స్థలం కేటాయించి వ్యాపారాలు చేపట్టేలా ఆదేశాలిచ్చాం. అక్కడ కాకుండా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు సాగిస్తున్నట్టు మా దృష్టికి వస్తున్నాయి. మూగజీవాలు ఆరోగ్యంగా ఉన్నాయా..? లేదా అని పశు వైద్యులు గుర్తించాకే వధించాల్సి ఉంటుంది. వ్యాధుల బారిన పడ్డ, మృతి చెందిన వాటి మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించేలా సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేస్తాం. – దివాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం -
నోరూరించే నర్గీస్ కోఫ్తా.. తయారీ ఇలా!
కావలసినవి: గుడ్లు – ఎనిమిది; మటన్ ఖీమా – అరకేజీ; ఉల్లిపాయ – ఒకటి(ముక్కలు తరగాలి; వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూను; పసుపు – టీస్పూను; కారం – అరటీస్పూను; గరంమసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; బియ్యప్పిండి – అరకప్పు; ఆయిల్ – డీప్‌ఫ్రైకి సరిపడా. గ్రేవీ కోసం: ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – రెండు (ముక్కలు తరగాలి); వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు; అల్లంపేస్టు – రెండు టీస్పూన్లు; టొమాటోలు – మూడు(పేస్టు చేసుకోవాలి); ధనియాలపొడి – రెండు టీస్పూన్లు; జీలకర్ర – టీస్పూను; పసుపు – అరటీస్పూను; కారం – అర టీస్పూను; గరం మసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; పెరుగు – ఎనిమిది టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ: ► ముందుగా ఆరు గుడ్లను ఉడికించి, పెంకు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ► పెద్ద గిన్నెలో మటన్ ఖీమా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక గుడ్డుసొన వేసి పేస్టులా కలపుకోవాలి ► ఈ మిశ్రమాన్ని ఆరు సమభాగాలుగాచేసి పక్కనపెట్టుకోవాలి ► ఉడికించిన ఒక్కో గుడ్డుకు పూర్తిగా కవర్ అయ్యేలా ఖీమా మిశ్రమాన్ని పట్టించాలి ► అన్ని గుడ్లకు పట్టించాక బియ్యంపిండిలో ముంచాలి మిగిలిన గుడ్డుసొనను బాగా కలపాలి. బియ్యప్పిండిలో ముంచిన గుడ్లను ఈ గుడ్డుసొనలో ముంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ఫ్రైచేసి పక్కనపెట్టుకోవాలి ► వేడెక్కిన బాణలిలో గ్రేవీకోసం తీసుకున్న ఆయిల్ వేయాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలువేసి రంగు మారేంత వరకు వేయించాలి ► ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టులను వేసి మూడు నిమిషాలు వేయించి టొమాటో పేస్టు, కారం, ధనియాలపొడి, గరం మసాలా వేయాలి ► రుచికిసరిపడా ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు పెరుగు, అరకప్పు నీళ్లు వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి, డీప్‌ఫ్రై చేసి పెట్టుకున్న కోప్తాలను వేసి జాగ్రత్తగా తిప్పుకోవాలి ∙ఐదునిమిషాలు మగ్గాక కొత్తిమీరతో గార్నిష్ చేస్తే నర్గీస్ కోఫ్తా రెడీ. ఇది రైస్,చపాతీల్లోకి మంచి సైడ్ డిష్. (క్లిక్: హనీ చికెన్ కర్రీ..టేస్ట్ అదుర్స్.. ఇలా చేసుకోండి) చికెన్ కాగ్జీకట్ కావలసినవి: చికెన్ – అరకేజీ; చిన్న ఉల్లిపాయలు – ఎనిమిది; బంగాళ దుంపలు – ఎనిమిది; వెల్లుల్లి రెబ్బలు – ఆరు; అల్లం – అంగుళం ముక్క ; పెద్ద ఉల్లిపాయ – ఒకటి; పచ్చికొబ్బరి తురుము – కప్పు; ఎండుమిర్చి – ఏడు; లవంగాలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; మిరియాలు – పది; ధనియాలు – టేబుల్ స్పూను; మెంతులు – టీస్పూను; గసగసాలు – టేబుల్ స్పూను; సోంపు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; జాజికాయ పొడి – టీస్పూను; ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ: ► ధనియాలు, గసగసాలు, మెంతులను పొడిచేకోవాలి ► అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను సన్నగా తరగాలి ► బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు వేసి వేగనివ్వాలి. తరువాత కొబ్బరి తురుము వేసి మూడు నిమిషాలు వేయించాలి ► ఇప్పుడు ధనియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గాక, చికెన్ వేసి సన్నని మంట 10 నిమిషాలు ఉడికాక చిన్న ఉల్లిపాయలు, బంగాళ దంపలు వేసి ఉడికించాలి ► ఆయిల్ పైకి తేలాక జాజికాయ పొడి, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. (క్లిక్: కీమా ఇడ్లీ, బనానా షీరా చాక్లెట్ బాల్స్, బ్రెడ్–ఎగ్ బజ్జీ తయారు చేసేద్దామిలా..) -
కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్ చేశారా
మర్యాదలకు, మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరు ఉభయగోదావరి జిల్లాలు.. ఇక మన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పసందైన విందు భోజనాలు, సంక్రాంతి కోడిపందేలు, నాన్ వెజ్ వంటల రుచుల గొప్పతనం అందరికీ తెలిసిందే. అలాంటి భీమవరంలో తయారైన నాన్‌వెజ్ పచ్చళ్లు ఇప్పుడు దేశ విదేశాల్లోని తెలుగువారి నోరూరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లోని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు నాన్‌వెజ్ పచ్చళ్లు పంపించాలంటే వెంటనే గుర్తుకొచ్చేవి భీమవరం పచ్చళ్లే. సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 50 మంది వరకు ఈ నాన్‌వెజ్ పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొందరు నిత్యం ఈ పచ్చళ్ల వ్యాపారంలో ఉంటే.. మరికొందరు తమకు వచ్చిన ఆర్డర్ మేరకు పచ్చళ్లు తయారు చేస్తారు. నాజ్‌వెజ్ పచ్చళ్ల వ్యాపారం ఈ ప్రాంతంలో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. నాణ్యత, రుచిలో రాజీ పడకుండా పచ్చళ్లు తయారు చేయడంతో వీటికి మంచి పేరు దక్కింది. చూస్తేనే నోరూరించేలా నాణ్యతతో వీటిని తయారుచేస్తుంటారు. భీమవరం వచ్చే రాజకీయ నాయకులు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ నాన్‌వెజ్ పచ్చళ్లు రుచి చూడాల్సిందే. వాటి రుచి చూసిన వారు తప్పకుండా తమతో తీసుకెళ్తుంటారు. ఎందరో ప్రముఖులు ఇక్కడి పచ్చళ్లకు ఫ్యాన్స్‌గా మారిపోయారు. దాదాపు 40 దేశాలకు ఎగుమతి భీమవరం ప్రాంతంలోని నాన్‌వెజ్ పచ్చళ్లు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాండ్, దుబాయ్, కువైట్, సింగపూర్, రష్యా తదితర 40 దేశాలకు వెళ్తుంటాయి. అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులకు ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. అలాగే విదేశాల్లోని తెలుగువారు ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటారు. నాన్‌వెజ్ పచ్చళ్ల వ్యాపారం భీమవరం ప్రాంతంలో ఏడాదికి సుమారు రూ.కోటి వరకూ జరుగుతుందని అంచనా. నాన్‌వెజ్ పచ్చళ్లు ఆయా రకం బట్టి కిలో రూ.600 నుంచి రూ.1500 వరకు ఉంటాయి. పావుకిలో ప్యాకెట్ల దగ్గర నుంచి విక్రయిస్తుంటారు. మన ఆర్డర్ల మేరకు పెద్ద ఎత్తున కూడా తయారుచేస్తుంటారు. ► చేపలో రకాలు : శీలావతి, కొరమీను, పండుగొప్ప, మెత్తళ్లు, బెత్తుల పచ్చళ్లు లభిస్తాయి. ► చికెన్ వెరైటీలు : బోన్, బోన్‌లెస్, నాటు కోడి, పందెం పుంజు పచ్చళ్లు ప్రత్యేకం ► రొయ్యలో రకాలు : రొయ్య(చిన్నవి), రొయ్య (పెద్దవి), శాక రొయ్య పచ్చళ్లు ఫేమస్ ► అలాగే పీత, మటన్ బోన్‌లెస్, మటన్ ఖీమా పచ్చళ్లు కూడా ఆర్డర్ల మేరకు సరఫరా చేస్తారు. ► పీత సమోసా ప్రత్యేకం.. ఇక్కడ తయారు చేసే పీత సమోసా ప్రత్యేకమైంది. మామూలుగా సమోసా అంటేనే వెంటనే తినాలనిపిస్తుంది. ఇక ఇక్కడ తయారైన పీత సమోసా రుచి చూస్తే వదిలిపెట్టరు. ► చికెన్ పచ్చడి ► రొయ్యల పచ్చడి ► నాటుకోడి పచ్చడి ► పీతల సమోసా -
‘ముక్క’మాటానికిపోయి..
ఓ స్కూల్ మాస్టారు.. కారు కొన్నారు. మిగిలిన మాస్టార్లు కారు కొన్నందుకు పార్టీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఇంకేముంది.. పాపం సారు.. మొహమాటానికి.. సారీ ‘ముక్క’మాటానికి పోయారు. కక్క, ముక్కలతో మాంసాహారాన్ని వండించారు. అంతేకాదు.. క్యారియర్లతో ఏకంగా స్కూల్‌కు తీసుకువచ్చేశారు. అయితే తాము చదువు చెబుతున్న పాఠశాల అన్నవరం దేవస్థానానికి చెందిన సంస్కృతోన్నత పాఠశాలని మరిచారో ఏమో!.. కొండపై సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న వేళ మాంసాహార విందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరికి విషయం ఆలయ అధికారులకు తెలియడంతో ఆ మాస్టార్లు చిక్కుల్లో పడ్డారు. సాక్షి, తూర్పుగోదావరి(ప్రత్తిపాడు) : ఒకవైపు సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రత్నగిరిపై భక్తి శ్రద్ధలతో దేవస్థానం అధికారులు వేడుకలు నిర్వహిస్తుంటే.. కొండదిగువన దేవస్థానం నిర్వహణలో గల సంస్కృతోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మాంసాహారం భుజించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం విమర్శలకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఈఓ ఎంవీ సురేష్ బాబు మధ్యాహ్నం హుటాహుటిన హైస్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ మాంసాహారాన్ని ఊరి చివర పారబోయించారు. ఈ మాంసాహార భోజనం హైస్కూల్‌కు తీసుకువచ్చిన స్కూల్ అసిస్టెంట్ విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేయగా, క్యారియర్లను తన గదిలో ఉంచిన పీఈటీ చక్రధరరావుకు షోకాజ్ నోటీసు అందజేశారు. పార్టీ అడిగారని.. అన్నవరం దేవస్థానం 50 ఏళ్లుగా కొండదిగువన, ప్రస్తుత మొదటి ఘాట్‌రోడ్ పక్కన సంస్కృతోన్నత పాఠశాల నిర్వహిస్తోంది. ఈ స్కూల్లో సంస్కృతం ప్రధాన భాషగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. ఇక్కడ హైస్కూల్ ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులు కూడా పర్వదినాల్లో దేవస్థానంలో పలు రకాలుగా సేవలందిస్తుంటారు. హైస్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ విజయ్‌కుమార్ ఇటీవల కారు కొనుకొన్నందున ఇతర ఉపాధ్యాయులు ఆయనను పార్టీ అడిగారు. ఆయన మాంసాహారాన్ని వండించి రెండు క్యారియర్లతో హైస్కూల్‌కు తెచ్చి పీఈటీ గదిలో ఉంచారు. దేవస్థానంలో స్వామివారి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈఓకు ఈ మేరకు సమాచారం రావడంతో మధ్యాహ్నం 12.30 కు దేవస్థానం హైస్కూల్‌కు చేరుకుని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో పీఈటీ గదిలో ఒక పెద్ద క్యారియర్‌లో బిర్యానీ, మరో క్యారియర్‌లో మాంసం కూర ఉండడంతో దీనిపై ఆ ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా సహచర ఉపాధ్యాయులు పార్టీ అడగడంతో తెచ్చానని తెలిపారు. దీనిపై పీఈటీ చక్రధరరావును ప్రశ్నించగా తన గదిలో ఆ క్యారియర్లను పెట్టమని తాను చెప్పలేదని సమాధానమిచ్చారు. వారిద్దరి స్టేట్మెంట్లతో పాటు ఇతర ఉపాధ్యాయుల స్టేట్మెంట్లు కూడా ఈఓ రికార్డు చేయించారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్ విజయ్‌కుమార్, పీఈటీ ఎం.చక్రధరరావులపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో కూడా చాలాసార్లు ఇలానే హైస్కూల్లో మాంసాహారం తీసుకున్నట్టు తెలిసింది. -
ఐఐటీ బాంబేలో నాన్‌వెజ్‌పై నిషేధం తొలగింపు
సాక్షి, ముంబయి : విద్యార్ధులు, ఫ్యాకల్టీల నుంచి తీవ్ర నిరసన ఎదురవడంతో క్యాంపస్‌లోని కేఫ్‌లో మాంసాహార వంటకాలపై నిషేదాన్ని ఐఐటీ బాంబే ఉపసంహరించింది. నాన్ వెజ్ ఐటెమ్స్ విక్రయంపై ఎలాంటి నియంత్రణలు లేవని..క్యాంపస్‌లోని సివిల్ కేఫ్‌లో తాజా ఆహారం అందుబాటులో ఉండాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తొలుత ఈ ఉత్తర్వులు జారీ చేశామని ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది. ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రాధాన్యత, వివక్ష చూపడం సంస్థ చేయబోదని స్పష్టం చేసింది. మరోవైపు కేవలం నాన్ వెజ్ వంటకాలనే నిషేధించడం పట్ల పలువురు విద్యార్దులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవే కారణాలపై శాఖాహార వంటకాలను ఎందుకు నిషేదించలేదని వారు నిలదీశారు. ఇక క్యాంపస్‌లో నాన్‌వెజ్ ఐటెమ్స్‌కు పేరొందిన సివిల్ కేఫ్‌లో నిషేధం ఎత్తివేసిన క్రమంలో మాంసాహార వంటకాలు తిరిగి అందుబాటులోకి వస్తాయని విద్యార్థులు పేర్కొన్నారు. జనవరి 20న క్యాంటిన్ కమిటీ సంబంధిత కేఫ్ కాంట్రాక్టర్‌కు నాన్ వెజ్ ఐటెమ్‌లు అందించరాదని కోరుతూ నోటీసులు ఇచ్చింది. -
నాన్ వెజ్‌పై ఢిల్లీ కార్పొరేషన్ సంచలన ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: నాన్ వెజ్ వంటకాలపై బీజేపీ పాలిత దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ వివాదాస్పద ఉత్తర్వులు జారీచేయనుంది. నాన్ వెజ్ వంటకాలను దుకాణాల ముందు డిస్ప్లే చేయరాదని ఆహార అవుట్లెట్లను కార్పొరేషన్ ఆదేశించనుంది. ఇటీవల జరిగిన సమావేశంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని సభా నాయకుడు షికా రాయ్ చెప్పారు. పరిశుభ్రత, మాంసాన్ని చూడటం ద్వారా కొందరి సెంటిమెంట్ దెబ్బతినడం వంటి కారణాలతో మాంసాహార వంటకాల డిస్ప్లేను నిషేధిస్తున్నట్టు చెప్పారు. వండిన, ముడి మాంసం ఏదైనా షాపు ఓనర్లు షాపు ముందు డిస్ప్లే చేయడంపై నిషేధం విధించనున్నట్టు ఆయన తెలిపారు. నజఫ్‌గర్ జోన్ నుంచి ఓ కౌన్సిలర్ హెల్త్ కమిటీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావించగా, దీన్ని ఎస్డీఎంసీ దృష్టికి తీసుకువెళ్లగా సభ ఆమోదించిందని కార్పొరేషన్ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి అనుగుణంగా ఉందా లేదా అనేది పరిశీలించి మున్సిపల్ కమిషనర్ దీనికి ఆమోదం తెలపవచ్చని లేదా తిరస్కరించవచ్చని చెప్పారు. సౌత్ ఢిల్లీలో హజ్ ఖాస్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, సఫ్దర్‌జంగ్ గ్రీన్ పార్క్, కమల్ సినిమా, అమర్ కాలనీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో మాంసాహారాన్ని విక్రయించే పలు ఈటరీలు, రెస్టారెంట్లున్నాయి. మాంసాన్ని విక్రయించే పలు ప్రాంతాల్లో కబాబ్‌లు, షావర్మాలను ప్రదర్శించడం అతి సాధారణం. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయంపై పలు రాజకీయ పార్టీలు, వైద్య వర్గాల నుంచీ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. -
థీమ్ బరాబర్..
సిటీలో భోజనప్రియుల అభి‘రుచు’లకు తగ్గట్లే రెస్టారెంట్లు కూడా శరవేగంగా మారుతున్నాయి.పోటీ పెరగడంతో ఎలాగైనాకస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నాయి. సాదాసీదాగా కనిపించే రెస్టారెంట్లు త్వరగానే బోరు కొట్టేస్తుండటంతో, ‘సిటీ’జనులు కొత్తవాటి కోసం చూపు సారిస్తున్నారు. అలాంటి వారిని ఆకర్షించేందుకు నగరంలోని రెస్టారెంట్లు కొత్త కొత్త థీమ్స్‌తో ముస్తాబవుతున్నాయి. కొన్ని రాచరుచులతో అలరిస్తున్నాయి. మరికొన్ని ఖండాంతర రుచులను చేరువ చేస్తున్నాయి. ఇంకొన్ని ఒద్దికగా సంప్రదాయ రుచులనే సరికొత్తగా వండి వడ్డిస్తున్నాయి. ఇలాంటి థీమ్ రెస్టారెంట్లపై ‘సిటీప్లస్’ కథనం.. ‘చిరు’తిండి... భోజనప్రియులు తరచూ కొత్త కొత్త రెస్టారెంట్లకు వెళుతుంటారు. కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. రుచులు సరే, ఆరోగ్యం మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగానే బేగంపేట్‌లో ‘ఆహార్ కుటీర్’ మొదలైంది. నలుగురు మిత్రులు.. రాంబాబు, అర్చన, శ్రీరామ్, దినేష్.. తమ కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరీ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలతోనే ఇక్కడ అన్ని పదార్థాలనూ తయారు చేస్తారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పెంచిన కూరగాయలనే వాడతారు. పల్లెవాతావరణాన్ని తలపించే ఈ రెస్టారెంట్ అలంకరణ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇక్కడ సంప్రదాయబద్ధంగా అరిటాకుల్లో వడ్డిస్తారు. మంచినీళ్లు, మజ్జిగ మట్టిపాత్రల్లో అందిస్తారు. మహారాజ భోజనం... చాలా రెస్టారెంట్లకు పేరులోనే ‘రెస్ట్’ ఉంటుంది గానీ, అక్కడకు వెళ్లేవారికి ఎలాంటి విశ్రాంతి ఉండదు. ఆర్డర్ చేసిన పదార్థాలు టేబుల్ మీదకు రాగానే, భోంచేయడం, ఆపై బిల్లు కట్టి, టిప్పు చదివించుకుని బయటపడటం.. ఇదంతా రొటీన్ వ్యవహారం. మణికొండలోని ‘వాక్’ (వీకెండ్స్ ఎట్ కూచిపూడి) రెస్టారెంట్ తీరే వేరు. ఇక్కడకు వెళ్లేవారెవరైనా, అడుగు పెడుతూనే ఆహారం కోసం ఆర్డర్ ఇవ్వక్కర్లేదు. విశ్రాంతిగా గడపొచ్చు. గేమ్స్ వంటి వాటితో కాలక్షేపం చేయవచ్చు. ఆకలేసినప్పుడు నిదానంగా ఆర్డర్ చేసి, తాపీగా భోజనం చేయవచ్చు. ‘కింగ్స్’లంచ్, ‘క్వీన్స్’ డిన్నర్ ఈ రెస్టారెంట్ స్పెషల్స్. ఇవి పేరుకు తగినట్లే రాజసం ఉట్టిపడుతూ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్లలో అరడజనేసి స్టార్టర్స్, నాలుగు రకాల టిఫిన్లు, ఏడు రకాల బిర్యానీలు, సీఫుడ్ సహా తొమ్మిదిరకాల నాన్ వెజ్ ఐటమ్స్, ఐదు రకాల స్వీట్లు, డెసర్ట్స్ ఉంటాయి. ‘కింగ్స్’లంచ్ కాస్త స్పైసీగా ఉంటే, ‘క్వీన్స్’డిన్నర్ కొంచెం డెలికేట్‌గా ఉంటుంది. ఇందులోని వైట్రూమ్ ధవళకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఎల్ఈడీ లైట్లు వెలిగినప్పుడల్లా రంగులు మారుతుంటుంది. బ్లాక్రూమ్లోని ఎల్ఈడీ దీపాలు నింగిలో చుక్కల్లా తళతళలాడుతూ కొత్త అనుభూతినిస్తాయి.