Norman
-
పురస్కారం..: పచ్చనాకు సాక్షిగా...
చేనులోని గోధుమను ఎప్పుడైనా పలకరించారా? అది తన గోడు వెళ్లబుచ్చుకోదు. మన గోడు ఏమిటో శ్రద్ధగా వింటుంది. మన ఆకలి తీరుస్తుంది... అందుకే గోధుమ అంటే నార్మన్ బోర్లాగ్‌కు అంత ఇష్టం. మన దేశం కరువు కోరల్లో చిక్కుకుపోయిన ఒకానొక సమయంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు అద్భుతాన్ని సృష్టించాయి. రైతు కంట్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయన ఫోటో మన రైతుల ఇండ్లలో కనిపిస్తుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇనిషియేటివ్ (బీజీఆర్‌ఐ) అంతర్జాతీయ అవార్డ్‌కు ఎంపికైన డా.పర్వీన్, మెంటర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలిభారతీయ శాస్త్రవేత్త... నార్మన్ బోర్లాగ్ అనే పేరు వినబడగానే అమెరికన్ పేరులా అనిపించదు. ఆత్మీయనేస్తంలా ధ్వనిస్తుంది. మెక్సికోలో ఇంటర్నేషనల్ మైజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన బోర్లాగ్ రోగనిరోధక శక్తితో కూడిన, అధిక దిగుబడి ఇచ్చే డ్వార్ఫ్(చిన్న) గోధుమ వంగడాలను సృష్టించి రైతునేస్తం అయ్యాడు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మన దేశం కరువు కోరల్లో చిక్కుకున్న విషాదకాలంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కరువు కోరల నుంచి రక్షించాయి. గోధుమ ఉత్పత్తిలో మన రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేశాయి. అందుకే ఉత్తరభారతంలోని రైతుల ఇండ్లలో ఆయన ఫోటో కనిపిస్తుంది. బోర్లాగ్ కుమార్తె జీని బోర్లాగ్ తండ్రి కృషిని ముందుకు తీసుకెళుతోంది. గ్లోబల్ వీట్ కమ్యూనిటీని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేస్తున్న జీని బోర్లాగ్ ‘సూపర్ ఉమెన్ ఆఫ్ వీట్’ గా పేరుగాంచింది. బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇన్షియేటివ్(బీజిఆర్‌ఐ) చైర్‌పర్సన్‌గా గోధుమ రంగానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను రైతుల దగ్గరికి తీసుకెళుతుంది. 2010లో ఏర్పాటు చేసిన జీని బోర్లాగ్ లాబ్ వుమెన్ ఇన్ ట్రిటికమ్ మెంటర్ అవార్డ్‌ను గోధుమరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి, కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డ్‌కు గానూ పంజాబ్‌కు చెందిన శాస్త్రవేత్త డా.పర్వీన్ చూనెజ ఎంపికైంది. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. గతంలో మన దేశం నుంచి డా.మిథాలీ బన్సాల్, డా.సాను ఆరోరా ఎర్లీ కెరీర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపియ్యారు. పర్వీన్ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పీహెచ్డీ చేయడం విశేషం. వివిధ దేశాల నుంచి ఎర్లీ కెరీర్ విన్నర్స్‌తో పాటు మెంటర్స్‌ను కూడా ఎంపిక చేస్తుంది బీజిఆర్‌ఐ. మెంటర్ విభాగంలో ఈ అవార్డ్ అందుకోనుంది పర్వీన్. మన దేశం నుంచి ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సైంటిస్ట్‌గా ప్రత్యేకత సాధించింది పర్వీన్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జన్మించిన పర్వీన్ కెఎన్ జైన్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. సందేహాలను తీర్చుకోవడంలో ఎప్పుడూ సంశయించేది కాదు. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్విటీలో బీఎస్సీ చేసింది. 1992లో పీహెచ్డీ పూర్తి చేసింది. 1996లో డీఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, న్యూ దిల్లీ ‘ఔట్‌స్టాండింగ్ ఉమెన్ సైంటిస్ట్’ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్లు అందుకుంది. ఇంటర్నేషనల్ వీట్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. ‘పర్వీన్లో మార్గదర్శక నైపుణ్యాలే కాదు, గొప్ప స్నేహలక్షణాలు ఉన్నాయి. ఆమె దగ్గర పనిచేయడం అంటే ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకునే అవకాశమే కాదు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది’ అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ సర్వ్‌జీత్ సింగ్. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. -
అన్నం ముద్ద మనిషి హక్కు
ఆహార హక్కు మనిషి కనీస హక్కు. భూమిపై పడిన ప్రతి ఒక్కరికీ భూమిపై మొలకెత్తిన ప్రతి గింజను పొందే నైతిక హక్కు ఉంది. నార్మన్ బొర్లాగ్ ఇలా అంటాడు : ‘‘నీ పక్కవాడు తినకుండా పడుకుంటే నీకా రోజు నిద్ర పట్టకూడదు. ‘బాగున్నావా’ అని అడిగే బదులు, ‘తిన్నావా?’ అని అడుగు. అప్పుడు వాడు నిజంగా ఎలా ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుస్తుంది. ఆకలి భయంతో సగం ప్రపంచం సూర్యోదయానికి భయపడుతూ లేస్తున్నప్పుడు నీ నాగరికతకు అర్థం లేదు. దేవుడిపై నీ విశ్వాసానికి అర్థం లేదు. ఆకలి భయంతో సగం ప్రపంచం.. కన్నీటిని కూడా పొదుపుగా ఖర్చు చేస్తున్నప్పుడు నువ్వు ప్రబోధించే శాంతి సామరస్యాలకు అర్థమేలేదు’’ అని. మనిషి ఆహారపు హక్కును కాపాడే ప్రయత్నం చేసిన అమెరికన్ వ్యవసాయ నిపుణుడు నార్మన్ బోర్గాగ్. ఆకలిగా ఉన్నవారికి ఇంత ముద్దను పెట్టడం కూడా మానవ హకుల్ని పరిరక్షించడం కిందికే వస్తుంది. (రేపు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం) -
నోర్.. స్కేటింగ్ సూపర్
దుకాణంలో దర్జాగా స్కేటింగ్ స్కూటర్‌పై తిరుగుతున్న ఈ కుక్క పేరు నోర్మాన్. దక్షిణ కరోలినా రాష్ట్రంలోని ఉత్తర మేర్టిల్ బీచ్ సిటీలో ఉంటోంది. పక్కనే ఉన్న మహిళ పేరు కరెన్ కోబ్. స్కూటర్‌పై తిరిగేలా కుక్కకు శిక్షణనిచ్చి పెంచుకుంటోంది. శనివారం నగరంలో కుక్కల షాపులో ఈవిడ షాపింగ్ చేస్తున్నపుడు తీసిందీ ఫొటో. నోర్మాన్ ఇప్పటికే అత్యంత వేగంగా స్కూటర్‌పై వెళ్లే కుక్కగా గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది. -
మన సంస్కృతిని భావితరాలకు అందించాలి
పల్లారుగూడ (సంగెం) : రోజురోజుకూ కనుమరుగవుతున్న సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. సంగెం మండలంలోని పల్లారుగూడ శివారు మహారాజ్తండాలో గురువారం సంగెం జెడ్పీటీసీ సభ్యురాలు గుగులోత్ వీరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యూరు. ఈ సందర్భంగా రాజయ్యను గిరిజనులు డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగతించి సన్మానించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తీజ్ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా... గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు 18 ఏళ్లు నిండిన గిరిజన యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.50 వేల ఇవ్వనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. గిరిజనులు, మైనార్టీలు, దళితుల అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటారుుంచారన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే దళిత, గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1,500 చొప్పున దసరా నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు పునరుద్ఘాటించారు. ఐదేళ్లలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రుపొందించుకుందామన్నారు. గంగదేవిపల్లిలాగ దేశంలో పేరు వచ్చేలా రాజకీయూలకతీతంగా... పోటీతత్వంతో గ్రామాభివృద్ధికి కృషిచేయూలన్నారు. కాగా, మైదాన ప్రాంతానికి ప్రత్యేక ఐటీడీఏను ఏర్పాటు చేయాలని రాజయ్యను పలువురు గిరిజనులు కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, స్వామి నాయక్, వర్ధన్నపేట ఎంపీపీ మార్నెని రవీంద ర్రావు, లలితాయాదవ్, భరత్‌కుమార్‌రెడ్డి, మదన్‌కుమార్, సాగర్‌రెడ్డి, గోపీసింగ్, శంకర్రావు, దేవ్‌సింగ్, వీరన్న, యాదగిరిరావు. రాజు, సంపత్, సదానందం పాల్గొన్నారు.