north korea missiles
-
రంగంలోకి యూఎస్ సూపర్సోనిక్ బాంబర్లు
సియోల్: వరుస క్షిపణి పరీక్షలతో ఉద్రిక్తతలు పెంచుతున్న ఉత్తరకొరియాకు అమెరికా హెచ్చరికలు పంపింది. దక్షిణకొరియాలో జరుపుతున్న సంయుక్త సైనిక విన్యాసాల చివరి రోజు శనివారం అధునాతన సూపర్సోనిక్ బాంబర్ బీ–1బీ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. 2017 డిసెంబర్ తర్వాత వీటిని విమానాలను కొరియా ద్వీపకల్ప విన్యాసాల్లో వాడటం ఇదే తొలిసారి. వారం వ్యవధిలో ఉత్తర కొరియా పరీక్షల పేరిట ఏకంగా 30కి పైగా క్షిపణులు ప్రయోగించడంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అందుకే ఈసారి విన్యాసాల్లో ఎఫ్–35 అగ్రశ్రేణి యుద్ధవిమానంసహా దాదాపు 240 యుద్ధ విమానాలతో తమ సత్తా ఏమిటో ఉ.కొరియాకు చూపే ప్రయత్నంచేశాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అగ్రదేశాల మధ్య బేధాభిప్రాయలు పొడచూపడంతో ఇదే అదనుగా భావించి ఉ.కొరియా క్షిపణి పరీక్షలను ఒక్కసారిగా పెంచేసింది. శనివారం సైతం నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. విన్యాసాల పేరిట తమ భూభాగాల దురాక్రమణకు ప్రయత్నిస్తే శక్తివంతమైన సమాధానం ఇస్తామని అమెరికా, ద.కొరియాలనుద్దేశిస్తూ ఉ.కొరియా హెచ్చరించడం గమనార్హం. -
జపాన్‌కు ట్రంప్ జై.. ‘నన్ను నమ్మండి’
టోక్యో: జపాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జై కొట్టారు. జపాన్ ప్రధాని షింజో అబేకు ఫోన్ చేసి మాట్లాడిన ఆయన చాలా ఉల్లాసంగా కబుర్లు చెబుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు 100శాతం తనకు సమ్మతమేనని చెప్పారు. ఇటీవల ఉత్తర కొరియా నాలుగు ఖండాంతర క్షిపణులను పరీక్షించిన విషయాన్ని కూడా వారిద్దరు చర్చించుకున్నట్లు మీడియా ప్రతినిధులకు అబే తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో భద్రతాపరమైన తీర్మానానికి విరుద్ధంగా ఉత్తర కొరియా వ్యవహరించిందని, ఇది ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా ఒప్పందానికి ఒక సవాలు అని ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చినట్లు అబే వివరించారు. ‘అమెరికా 100శాతం జపాన్‌తో కలిసి పనిచేస్తుందని డోనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్లో చెప్పారు. ఆయన చెప్పిన మాటల్ని మొత్తం జపాన్ ప్రజలకు తెలియజేయాలని నన్ను కోరారు. ఈ విషయంలో రెండో ఆలోచనే అవసరం లేదని, పూర్తి స్థాయిలో తనను నమ్మవచ్చని చెప్పారు. ప్రమాదం ఇప్పుడు కొత్త దశలోకి వచ్చిందని మేమిద్దరం అంగీకరించాం(ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం నేపథ్యంలో)’ అని అబే తెలిపారు.