పదవుల కోసం అర్ధించము:శివసేన
ముంబై: ఎన్ డీఏ ప్రభుత్వంలో మిత్ర పక్షంగా ఉంటూ కయ్యాల కాపురం చేస్తున్న శివసేన కాబినెట్ విస్తరణపై స్పందించింది. విస్తరణలో పదవి దక్కదని స్పష్టం కావడంతో మరోసారి బీజేపీపై విరుచుకుపడింది. శివసేన ఆత్మగౌరవ పార్టీ అని పదవుల కోసం ఎవరినీ అర్ధించదని ఆపార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే మీడియాతో మట్లాడుతూ అన్నారు. ఎవరి గుమ్మం ముందూ తాము పదవుల కోసం నిలబడమని తెలిపారు. పదవులు తమ పార్టీకి ప్రథమ ప్రాధాన్యం కాదని అన్నారు. కేంద్ర కేబినెట్ లో ఆపార్టీకి చెందిన అనంత్ గీతే మంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా సేన,బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.